Rajasthan: రాజస్థాన్‌లోని కోట్‌పుట్లీకి చెందిన ఓ కూరగాయల వ్యాపారి ఈ మధ్య వార్తల్లో నిలిచాడు. సాధారణ జీవితాన్ని గడిపిన ఆయన ఇటీవల పంజాబ్‌లో రూ.11 కోట్ల లాటరీని గెలుచుకున్నాడు. రాత్రికి రాత్రే అతడి జీవితం మారిపోయింది. కానీ.. ఒక్కడే ఓ చిక్కు వచ్చి పడింది. ఈ లాటరీ గెలిచినప్పటి నుంచి అతడికి బెదిరింపులు, మోసపూరిత కాల్స్ వస్తున్నాయి. గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి డబ్బు డిమాండ్ చేస్తున్నారు. మరికొందరు అతన్ని బ్లాక్‌మెయిల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. దీంతో మొబైల్ ఫోన్‌ను స్విచ్ ఆఫ్ చేసి తన కుటుంబంతో దూరంగా వెళ్లిపోయాడు.
READ MORE: Koti Deepotsavam 2025: వేంకటేశ్వరస్వామి కళ్యాణం, గరుడ వాహన సేవ.. 9వ రోజు విశేష కార్యక్రమాలు ఇవే!
అసలు ఎవరు ఈ అమిత్..?
32 ఏళ్ల అమిత్ సెహ్రా కోట్‌పుట్లీలో రోడ్డు పక్కన కూరగాయల దుకాణం నడుపుతూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. పంజాబ్‌లోని బతిండా నుంచి రూ. 500కి A438586 నంబర్ గల లాటరీ టికెట్‌ను కొనుగోలు చేశాడు. అక్టోబర్ 31 సాయంత్రం లూథియానాలో లాటరీ డ్రా జరిగింది. మొదటి బహుమతి అమిత్‌కు వరించింది. రూ.11 కోట్ల నగదు బహుమతి ప్రకటించారు. అయితే.. తన సన్నిహితుడు ముఖేష్ సేన్ నుంచి టికెట్ కొనడానికి 500 రూపాయలు అప్పుగా తీసుకున్నానని అమిత్ చెప్పాడు.
READ MORE: Koti Deepotsavam 2025: వేంకటేశ్వరస్వామి కళ్యాణం, గరుడ వాహన సేవ.. 9వ రోజు విశేష కార్యక్రమాలు ఇవే!
తనకు లాటరీ టికెట్ వచ్చిన అనంతరం.. అమిత్ తన కుటుంబంతో కలిసి క్లెయిమ్ ప్రక్రియను పూర్తి చేయడానికి బతిండాకు వెళ్లాడు. కొన్ని రోజుల తర్వాత.. తన గ్రామం కోట్పుట్లికి తిరిగి వచ్చాడు. ఈ అదృష్ట వంతుడికి గ్రామంలో ఘన స్వాగతం లభించింది. తన విజయంలో తన స్నేహితుడు ముఖేష్ సేన్ కీలక పాత్ర పోషించాడని, టికెట్ కొనడానికి అప్పు ఇచ్చాడని ఈ సందర్భంగా అమిత్ వెల్లడించాడు. తన స్నేహితుడి ఇద్దరు కుమార్తెలకు ఒక్కొక్కరికి రూ.50 లక్షల చొప్పున నగదు ఇస్తున్నట్లు ప్రకటించాడు.
READ MORE: Bangladesh: అసిమ్ మునీర్ కొత్త ఎత్తుగడ! 1971 యుద్ధం తర్వాత తొలిసారి బంగ్లాకు పాక్ యుద్ధనౌక..
కానీ.. ఇక్కడే పెద్ద చిక్కు వచ్చి పడింది. లాటరీ గెలిచిన వార్త వ్యాపించగానే, అమిత్ పేరు చర్చనీయాంశంగా మారింది. దీంతో అమిత్‌కు వివిధ నంబర్ల నుంచి ఫోన్ కాల్స్, మెసేజ్‌లు రావడం ప్రారంభమయ్యాయి. లాటరీ కంపెనీ లేదా ప్రభుత్వ అధికారులుగా నటిస్తూ చాలా మంది పన్నులు, క్లెయిమ్ ఫీజులు, విరాళాల పేరుతో డబ్బు డిమాండ్ చేశారు. కొందరు అతడిని బెదిరించారు. మొదట్లో కొన్ని కాల్స్ వచ్చాయని దాన్ని జోక్ లాగా తీసుకున్నట్లు అమిత్ చెప్పాడు. కానీ తరువాత, కాల్స్ సంఖ్య బాగా పెరిగింది. కాబట్టి తన ఫోన్‌ను స్వీచ్ ఆఫ్ చేసి కుటుంబంతో కలిసి సురక్షిత ప్రాంతానికి వెళ్లారు.