Bandi Sanjay: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA)పై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హెచ్‌సీఏలో జరుగుతున్న జూనియర్ సీనియర్ సెలెక్షన్‌ల పై సీరియస్ అయ్యారు.. గ్రామీణ స్థాయి క్రికెటర్లకు అవకాశం కల్పించకపోవడంపై వివరాలు సేకరించారు. సెలక్షన్ కమిటీలో ఉన్న సభ్యులపైన యాక్షన్ ఉండబోతుందని హెచ్చరించారు.. రాచకొండ కమిషనర్ కి సైతం సమాచారం ఇచ్చినట్లు స్పష్టం చేశారు. సెలక్షన్ కమిటీ సభ్యులు.. హైదరాబాద్‌లో ఉన్న నైపుణ్యం లేని క్రికెటర్లకి అవకాశం కల్పిస్తూ వారి దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. బీసీసీఐకి కూడా త్వరలో ఫిర్యాదు చేయబోతున్నట్లు స్పష్టం చేశారు.. “సెలక్షన్ కమిటీలో లక్షల రూపాయలు దండుకున్నట్టు తెలుస్తుంది.. నైపుణ్యం ఉన్న క్రికెటర్ల తల్లిదండ్రులు తమ గోడు వెళ్ళబోసుకున్నారు.. గతంలో మంచి పర్ఫామెన్స్ ఉన్న క్రికెటర్ ను కూడా సెలెక్ట్ చేయలేదని నా దృష్టికి వచ్చింది.. దీని పై నిజ నిజాలు త్వరలోనే బయట పెడతాం..” అని బండి సంజయ్ హెచ్చరించారు.
READ MORE: Bengaluru: ఇది జైలా గెస్ట్ హౌస్ హా..? ఉగ్రవాది, సీరియల్ కిల్లర్‌కు మొబైల్, టీవీ, ‘VIP’ సౌకర్యం..!