Jubilee Hills Bypoll Results: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కౌంటింగ్‌కు సర్వ సిద్ధం.. ఫలితంపై ఉత్కంఠం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jubilee Hills Bypoll Results: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కౌంటింగ్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. యూసఫ్‌గూడ కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియంలో భారీ భద్రత మధ్య కౌంటింగ్ జరగనుంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. మొత్తం 10 రౌండ్లలో, 42 టేబుళ్లపై కౌంటింగ్ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రతి టేబుల్‌కు ప్రత్యేకంగా ఒక సీసీ కెమెరా ఏర్పాటు చేసి పర్యవేక్షణను కట్టుదిట్టం చేశారు. కౌంటింగ్ పనుల్లో 186 మంది సిబ్బంది పాల్గొంటున్నారు.
READ MORE: Bihar Assembly Election Results: నేడే బీహార్ ఎన్నికల ఫలితాలు.. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఫలించేనా..?
Also Read
- World Protests: ఫ్రాన్స్ నుంచి అమెరికా వరకు.. 8 దేశాల్లో నిరసనల సెగ.. కారణాలివే!
- JD Vance: వలసల్ని ప్రోత్సహించి అనుభవిస్తున్నారు.. ఫ్రాన్స్ అల్లర్లపై యూఎస్ ఉపాధ్యక్షుడు..
- WI Coach: వెస్టిండీస్ క్రికెట్‌ను కాపాడండి.. దయచేసి ఆర్థిక సాయం చేయండి.. హెడ్ కోచ్ డారెన్ సామీ ఆవేదన..
- YS Jagan: గెలుస్తామనే నమ్మకం చంద్రబాబుకు లేదు.. 2029 ఫినిషింగ్ లైన్!
మొదటిగా పోలైన 101 పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించనున్నారు. అనంతరం ఈవీఎంల లెక్కింపు మొదలవుతుంది. మొత్తం ప్రక్రియ రెండు నుంచి మూడు గంటల్లోనే పూర్తయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. కౌంటింగ్ కేంద్రం వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 4,01,365 మంది. నవంబర్ 11న జరిగిన పోలింగ్‌లో 48.49 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం పోలైన ఓట్లు 1,94,621. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఎవరికి వారు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఫలితంపై ఉత్కంఠ నెలకొంది. ముందుగా షేక్‌పేట్ డివిజన్ ఓట్ల లెక్కింపు జరుగనుంది. ప్రతి దశలో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, ప్రజల దృష్టి కౌంటింగ్ కేంద్రంపైనే నిలిచింది. ఎవరి వైపు ప్రజాభిప్రాయం మొగ్గుచూపిందన్నది ఇంకొద్ది గంటల్లోనే తేలనుంది.
READ MORE: Koti Deepotsavam Day 13 : సర్వతోముఖాభివృద్ధి కటాక్షం “మధురై మీనాక్షి కల్యాణోత్సవం”
తాజావార్తలు
-
World Protests: ఫ్రాన్స్ నుంచి అమెరికా వరకు.. 8 దేశాల్లో నిరసనల సెగ.. కారణాలివే!
-
PM-VBRY Scheme 2026: తొలిసారి ఉద్యోగం చేసేవారికి రూ.15,000.. రెండో విడత డబ్బుల కోసం ఈ కోర్సు తప్పనిసరి!
-
Jailer 2: జస్ట్ 5 నిమిషాల క్యామియోకి రూ.25 కోట్లా?
-
Ramayana: సహ నిర్మాతగా ఉన్నందుకేనా? రణబీర్‌ను డామినేట్ చేస్తున్న యశ్!
-
JD Vance: వలసల్ని ప్రోత్సహించి అనుభవిస్తున్నారు.. ఫ్రాన్స్ అల్లర్లపై యూఎస్ ఉపాధ్యక్షుడు..
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!