Phil Salt Catch Controversy: ఫిల్ సాల్ట్ ‘సూపర్’ క్యాచ్‌పై రచ్చ.. ఇంతకీ ఔటా? నాటౌటా?.. క్లారిటీ ఇదిగో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Phil Salt catch controversy: ఐపీఎల్ తొలి మ్యాచ్ ఎంతో ఉత్కంఠగా సాగింది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ హైవోల్టేజ్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో స్టార్ ప్లేయర్ ఫిల్ సాల్ట్ ఫీల్డింగ్‌ను ఎవ్వరూ మర్చిపోలేరు. మ్యాచ్‌లో మూడు క్యాచులు తీసుకున్నాడు సాల్ట్. అయితే.. ఎస్‌ఆర్‌హెచ్ స్టార్ బ్యాట్స్‌మెన్ హెన్రిచ్ క్లాసెన్ క్యాచ్ మాత్రం కొంత వివాదానికి దారి తీసింది. రొమారియో షెపర్డ్ వేసిన బంతిని లెగ్ సైడ్ వైపు గాల్లోకి బలంగా కొట్టాడు హెన్రిచ్ క్లాసెన్. డీప్ మిడ్-వికెట్‌లో ఫీల్డింగ్ చేస్తున్న సాల్ట్, ఆ క్యాచ్‌ను బౌండరీకి చాలా దగ్గరగా తీసుకున్నాడు. క్యాచ్ పట్టిన వెంటనే క్లాసెన్ గ్రౌండ్ నుంచి పెవిలియన్‌కు వెళ్తుండగా.. అతడిని బౌండరీ వద్ద సిబ్బంది ఆపారు. థర్డ్ అంపైర్ ఈ క్యాచ్‌ను పలు యాగింల్స్‌లో చెక్ చేశారు. దీంతో కొంత సేపు మైదానంలో గందరగోళం నెలకొంది. చివరకి థర్డ్ అంపైర్ ఔట్‌గా నిర్ణయించారు. క్లాసెన్ ఎంతో నిరుత్సాహంగా వెనుదిరిగాడు. అయితే.. ఈ క్యాచ్‌పై అభిమానులు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు జరపడం మొదలు పెట్టారు. అక్కడ క్లియర్‌గా ఔట్ అయినట్లు కనిపించింది. కానీ.. కొందరు ఇది ఔట్ అని.. మరి కొందరు నాట్ ఔట్ అని అభిప్రాయం వ్యక్తం చేశారు. వాస్తవానికి.. క్యాచ్ పట్టే క్రమంలో బౌండరీని స్టాల్ తాకినట్టు కనిపించాడు. కానీ.. వేరే యాంగిల్‌లో చూస్తే క్లియర్‌గా తాకనట్టు కనిపించింది. అందుకే థర్డ్ అంపైర్ నిర్ణయమే కరెక్ట్.
READ MORE: Anti-Trump Protests: ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా నిరసనలు.. ఛీకొడుతున్న అమెరికా ప్రజలు
Also Read
ఇదిలా ఉండగా.. నిన్న జరిగిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ బరిలోకి దిగిన ఎస్ఆర్‌హెచ్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. కెప్టెన్ ఇషాన్ కిషన్ 38 బంతుల్లో 80 పరుగులతో అద్భుతంగా రాణించగా, అనికేత్ వర్మ (కేవలం 18 బంతుల్లో 43 పరుగులు) చివరిలో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. పవర్‌ప్లేలో ఎస్ఆర్‌హెచ్ మూడు వికెట్లు కోల్పోయింది. కానీ, ఫామ్‌లో ఉన్న కిషన్, హెన్రిచ్ క్లాసెన్ (31)ల మధ్య 53 బంతుల్లో 97 పరుగుల పటిష్టమైన భాగస్వామ్యం ఇన్నింగ్స్‌ను నిలబెట్టింది. ఆ తర్వాత, ఎస్ఆర్‌హెచ్ మళ్లీ వరుసగా వికెట్లు కోల్పోయింది. అనికేత్ మెరుపు మెరుపు ఇన్నింగ్స్ పుణ్యమా అని, జట్టు 200 పరుగుల మార్కును దాటింది. మరోవైపు.. ఆర్సీబీ తరఫున బరిలోకి దిగిన దేవదత్ పడిక్కల్ 26 బంతుల్లో 61 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ (69 నాటౌట్, 38 బంతుల్లో) అద్భుతంగా రాణించాడు. రెండో వికెట్‌కు కేవలం 45 బంతుల్లో 101 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి, 15.4 ఓవర్లలోనే 202 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో ఆర్‌సీబీకి బలాన్ని చేకూర్చారు. ఎట్టకేలకు ఆర్సీబీని విజయ పతం వైపు నడిపించారు.
That’s not just a catch, that’s a full-on rollercoaster at the ropes 😮💨
Screen badi, awaazein badi. Apne smart TV ke JioHotstar app pe dekhiye Champions waali commentary LIVE💥#TATAIPL 2026 | #RCBvSRH | LIVE NOW 👉 https://t.co/LWOEeT2vNG pic.twitter.com/IzIDC3MtkX
— Star Sports (@StarSportsIndia) March 28, 2026
తాజావార్తలు
-
Meg Podcast: దశాబ్దం తర్వాత డిజిటల్ స్క్రీన్‌పై మెగా హోస్టింగ్.. ఆ రెమ్యునరేషన్ లెక్కలు ఏంది బాస్!
-
Nepal Floods: నేపాల్‌లో జల ప్రళయం.. విరిగిపడ్డ కొండచరియలు.. మూడు రోజుల్లో ఎంత మంది చనిపోయారంటే!
-
NEET UG 2027: గుడ్ న్యూసా? బ్యాడ్ న్యూసా?.. నీట్ 2027 ప్యాటర్న్ పూర్తిగా మారబోతోందా?
-
Antera Closed: ఎన్టీవీ ఎఫెక్ట్.. చివరకు మూతపడిన ‘అంతేరా’.!
-
Explainer: సూపర్ ఎల్‌నినో కాటు.. 2.3లక్షల మంది బలి?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!