TG Parent Care Bill 2026: నేడే బిల్లు.. ఇక తల్లిదండ్రులను చూసుకోకపోతే ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగుల జీతాల్లో కోతలు పక్కా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Parent Care Bill 2026: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత సమాజంలోని ఓ కీలక సమస్యకు స్వస్తి చెప్పేందుకు ముందడుగు వేసింది. తల్లిదండ్రులకు ఓ వయసు వచ్చాక పిల్లలే తోడుండాలి. కానీ.. ప్రస్తుతం చాలా మంది వయోవృద్ధులైన తల్లిదండ్రులను అనాథలుగా వదిలేస్తున్నారు. ఈ విధనాన్ని రూపుమాపాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. వయోవృద్ధులైన తల్లిదండ్రుల సంరక్షణ, యోగక్షేమాల కోసం రాష్ట్రప్రభుత్వం బిల్లు సిద్ధం చేసింది. నేడు (శనివారం) అసెంబ్లీలో ‘తెలంగాణ ఉద్యోగుల జవాబుదారీతనం, పర్యవేక్షణ బిల్లు-2026’ను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఈ బిల్లుతో ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థలు, ప్రభుత్వ ఖజానా నుంచి జీతాలు పొందుతున్న ఉద్యోగులు ఒకవేళ పేరెంట్స్‌ను పట్టించుకోకుంటే వారి జీతం నుంచి 15 శాతం కట్ చేసి తల్లిదండ్రుల అకౌంట్‌లో జమ చేస్తారు. ఈ బిల్లు కేవలం ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే పరిమితం కాలేదు. ప్రైవేటుసంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు సైతం తల్లిదండ్రులను పట్టించుకోకుంటే తమ వేతనంలో నెలకు 15 శాతం నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనుంది.
READ MORE: Hardik Pandya: యాటిట్యూడ్ మాత్రమే కాదు.. మంచి మనసు ఉందని నిరూపించిన హార్దిక్ పాండ్య..!
Also Read
- PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
- OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
- Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్‌కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
- OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
జిల్లాల్లో ప్రభుత్వం నియమించిన ప్రత్యేక అధికారుల(జిల్లా కలెక్టరు)కు కారణాలు వివరిస్తూ దరఖాస్తు చేసుకుంటే ఆ అధికారి పరిశీలించి దరఖాస్తును పరిష్కరిస్తారు. తరువాత ఉద్యోగి వేతనం నుంచి 15 శాతం లేదా రూ.10 వేలు.. ఈ రెండింటిలో ఏది తక్కువైతే ఆ మొత్తాన్ని తల్లిదండ్రులకు భృతిగా అధికారి నిర్ణయిస్తారు. ఈ బిల్లు ప్రకారం.. ఎలాంటి ఆధారం లేని తల్లిదండ్రులు ముందుగా దరఖాస్తు చేసుకోవాలి. తల్లి లేదా తండ్రి అవసరమైతే ఇద్దరూ జిల్లా స్థాయిలో ప్రభుత్వం నియమించిన అధికారితో చర్చించి దరఖాస్తు సమర్పించాలి. ఈ దరఖాస్తును పరిశీలించి 60 రోజుట్లోగా సమస్యను పరిష్కరిస్తారు. తరువాత ఉద్యోగి జీతం నుంచి నిర్దేశించిన మొత్తాన్ని మినహాయించి తల్లిదండ్రుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసేందుకు ఆదేశాలివ్వాలి. ఒక వేళ అధికారి పట్టించుకోకుంటే, సమస్యను గడువుల లోపు పరిష్కరించకుంటే మరో మార్గం సైతం ఉంది. రాష్ట్ర స్థాయిలోని హైకోర్టు విశ్రాంత జడ్జీ కమిషనర్‌గా వ్యవహరిస్తారు. ఆయనకు అప్పీలు చేసే అవకాశం ఉంది.
READ MORE: Amaravati Legal Status: అమరావతికి చట్టబద్ధత.. నేడే ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం..
తాజావార్తలు
-
RAM 23 : రామ్ పోతినేని సినిమా టైటిల్ ఇదే.. మాస్ ఆడియన్స్‌కు కనెక్ట్ అవుతుందా?
-
Ramayana: ‘టాక్సిక్’ తర్వాత మరో భారీ పందెం.. ‘రామాయణం’పై దిల్ రాజు కన్ను? రూ.105 కోట్ల డీల్!
-
Akkineni Nagarjuna : 29న నాగార్జున ‘కింగ్ 100’ క్రేజీ గ్లింప్స్ బ్లాస్ట్.. అన్నపూర్ణ స్టూడియోస్ బిగ్ అప్డేట్
-
Friday Horoscope: శుక్రవారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారికి ఊహించని డబ్బు!
-
PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్‌గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!