Manu Bhaker On X: పారిస్ ఒలింపిక్స్ 2024 లో భారత షూటర్ మను భాకర్ చిరస్మరణీయ ప్రయాణం ముగిసింది. శనివారం 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో నాలుగో స్థానంలో నిలిచి మరో పతకాన్ని తృటిలో కోల్పోయింది. అయితే, ఆమె వ్యక్తిగత 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో, 10 మీటర్ల మిక్స్డ్ టీమ్ ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో 2 కాంస్య పతకాలను సాధించి దేశానికి అందించింది. ఈ సందర్బంగా తన ప్రయాణంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ […]
Kangana Ranaut – Rahul Gandhi: బాలీవుడ్ నటి, ఎంపీ కంగన్ రనౌత్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి ఆమె వ్యక్తిగత జీవితం వల్ల కాదు. ఆమె సోషల్ మీడియా పోస్ట్ కారణంగా వార్తల్లో నిలుస్తోంది. కంగనా రనౌత్ మరోసారి ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకుని తన ఇన్స్టా స్టోరీలో ఒక ఫోటోను పోస్ట్ చేసింది. ఇది నిమిషాల వ్యవధిలో వైరల్ అయ్యింది. దింతో ప్రస్తుతం కంగనా రనౌత్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. […]
Taj Mahal Ganga Water : ఆగ్రాలోని ప్రపంచ ప్రసిద్ధ కట్టడం తాజ్ మహల్లో హిందూ సంస్థకు చెందిన ఇద్దరు యువకులు గంగాజలాన్ని సమర్పించారు. హిందూ యువకులు వాటర్ బాటిళ్లలో గంగాజలం నింపి తాజ్ మహల్ లోపల గంగాజలాన్ని సమర్పించారు. తాజ్ మహల్ లోపలికి చేరుకున్న ఇద్దరు యువకులు ముందుగా సీసాలో నింపిన గంగాజలాన్ని చూపించి తాజ్ మహల్ లోపలికి వెళ్లి గంగాజలం అందించారు. వీరి వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్గా మారింది. అఖిల భారత […]
Marriage Cheater: మ్యాట్రిమోనియల్ సైట్లలో మోసానికి సంబంధించిన అనేక కథనాలను ఈమధ్య కాలంలో తరుచుగా చూస్తున్నాము. ఇకపోతే తాజాగా ఒడిశా రాజధాని భువనేశ్వర్లో పెళ్లి మోసానికి సంబంధించిన ఆశ్చర్యకరమైన విషయం ఓ మ్యాట్రిమోనీ సైట్ ద్వారా వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి ఐదుగురు మహిళలను తన మాటలతో మాయ చేసి పెళ్లి చేసుకున్నాడు. అంతేకాదు పెళ్లి కోసం దాదాపు 50 మంది అమ్మాయిలతో పరిచయం పెంచుకున్నాడు. ఇద్దరు మహిళల ఫిర్యాదుతో పోలీసులు అతన్ని పట్టుకున్నారు. నిందితుడిని 34 […]
GATE Exam 2025: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, రూర్కీ ఆన్లైన్లో గేట్ రిజిస్ట్రేషన్ 2025 తేదీలను ప్రకటించింది. నోటిఫికేషన్ ప్రకారం, గేట్ 2025 కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆగస్టు 24, 2024 నుండి ప్రారంభమవుతుంది. రిజిస్ట్రేషన్ లింక్ అధికారిక వెబ్సైట్ gate2025.iitr.ac.inలో అందుబాటులో ఉంటుంది. దరఖాస్తు చేయడానికి ముందు, అభ్యర్థులు తప్పనిసరిగా గేట్ పరీక్ష 2025 అర్హత ప్రమాణాలను ఒకసారి పూర్తిగా అర్థం చేయాలి. ఆలస్య రుసుము లేకుండా గేట్ 2025 దరఖాస్తు ఫారమ్ను సమర్పించడానికి […]
Ram Mohan Naidu: కేంద్ర పౌర విమానయాన శాఖామంత్రి రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళంలో జరిగిన దివ్యాంగుల సహాయ ఉపకరణాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. గత వైసీపీ ప్రభుత్వం విశాఖ రైల్వే జోన్ కు కావాల్సిన భూమి చూపించలేకపోయిందని., ఈ కారణంగానే రైల్వే జోన్ ప్రక్రియ ఆలస్యం అయ్యిందని., రైల్వే జోన్ కోసం గతంలోనే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయించిందని., కూటమి ప్రభుత్వం రైల్వే జోన్ ను టాప్ ప్రియారిటీగా తీసుకుందని అన్నారు. […]
Hop On Kangaroo: టూరిజం పేరుతో కపుల్స్, ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ విదేశాలకు తీసుకెళ్లే ఆఫర్స్ చూస్తుంటాం.. కానీ, స్పోర్ట్స్ టూరిజం ఎప్పుడైనా విన్నారా..? మీకు క్రీడలపై ఆసక్తి ఉంటే చాలు.. విదేశాలకు తీసుకెళ్లి స్టార్ ప్లేయర్స్తో గేమ్స్ ఆడే అవకాశం కల్పిస్తోంది ఓ సంస్థ. ప్రతిష్టాత్మక సంస్థల ఆధ్వర్యంలో విద్యార్థుల్లో క్రీడలపై ఆసక్తి పెంచేందుకు ఓ వినూత్న ప్రయోగానికి “హాప్ ఆన్ కంగారు “సంస్థ శ్రీకారం చుట్టింది. ఇక, ఇందు కోసం ఏం చేయాలి..? విదేశాలకు వెళ్లేందుకు […]
TG Bharath: రాష్ట్రంలోని అన్ని ఇండస్ట్రియల్ జోన్లలో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్ అధికారులను ఆదేశించారు. శనివారం మంగళగిరిలోని ఏపీఐఐసీ కార్యాలయంలో పరిశ్రమల శాఖ సెక్రటరీ యువరాజు, కమిషనర్ శ్రీధర్తో పాటు అన్ని శాఖల అధికారులతో ఆయన సమీక్ష సమావేశం ఆయన నిర్వహించారు. రాష్ట్రంలోని ఇండస్ట్రియల్ జోన్ల గురించి మంత్రి భరత్ ఆరా తీశారు. భూముల విలువ, నీరు, విద్యుత్, ఇతర […]
Daggubati Purandeswari: నేడు రాజమండ్రి రైల్వే స్టేషన్ లో ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, రైల్వే డి.ఆర్.ఎం నరేందర్ ఏ పాటిల్ పర్యటించారు. 250 కోట్ల రూపాయలతో రాజమండ్రి రైల్వే స్టేషన్ అభివృద్ధి చేపట్టనున్న నేపథ్యంలో పర్యటన చేపట్టారు. ఈ పర్యటనలో రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, బిజెపి నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడుతూ… రాజమండ్రి రైల్వే స్టేషన్ ను వరల్డ్ క్లాస్ స్టేషన్ గా తీర్చిదిద్దుతాం […]
Gopi Chand: 2001లో తొలి వలపు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోగా పరిచయమైన గోపీచంద్ నేటితో 23 వసంతాలు పూర్తి చేసుకున్నాడు. కేవలం హీరోగా మాత్రమే కాకుండా విలన్ గా కూడా నటించిన గోపీచంద్ తన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. మొదటి సినిమా తర్వాత జయం, నిజం, వర్షం లాంటి సినిమాలలో నెగిటివ్ రోల్స్ చేసి మెప్పించాడు. ఆ తర్వాత 2004లో విడుదలైన యజ్ఞం సినిమాతో తన కెరీర్ మలుపు తిరిగింది. ఇక అప్పుడు […]