Agricultural Development: తాజాగా కేంద్ర మంత్రివర్గం పలు పథకాలకు ఆమోదం తెలిపింది. సుస్థిర వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి, ఆహార భద్రతను నిర్ధారించడానికి రూ. 1 లక్ష కోట్లతో రెండు ప్రధాన వ్యవసాయ పథకాలకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ పథకాల విషయానికి వస్తే.. ‘PM రాష్ట్రీయ కృషి వికాస్ యోజన (PM-RKVY)’ , ‘కృషి ఉన్నతి యోజన (KY)’. సుస్థిర వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి PM-RKVY, స్వయం సమృద్ధి కోసం ఆహార భద్రత సాధించడానికి కృషి ఉన్నతి యోజనకు […]
Diwali Bonus For Railway Employees: కేంద్ర మంత్రివర్గం పలు పథకాలకు ఆమోదం తెలిపింది. చెన్నై మెట్రో ఫేజ్ 2కి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని., మొత్తం 120 స్టేషన్లతో కూడిన ఈ దశలో కొత్తగా 3 కారిడార్లను నిర్మిస్తామని సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ కారిడార్‌ను చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ నిర్మిస్తుంది. దీని మొత్తం వ్యయం రూ.63,246 కోట్లు కాగా, ఇందులో సగం కేంద్రం, మిగితా సగం రాష్ట్రం […]
Vande Bharat Train: ఢిల్లీ నుంచి వారణాసి వెళ్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుపై గురువారం (అక్టోబర్ 3) రాళ్లదాడి జరిగింది. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రైలుపై రాళ్లు రువ్వడం చేసారు. ఈ ఘటనలో రైలు కోచ్ కిటికీలు పగిలిపోయాయి. అయితే ప్రయాణికులెవరూ గాయపడలేదు. వారణాసి నుండి ఢిల్లీకి వెళ్తున్న రైలు నంబర్ 22435 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ కాన్పూర్ లోని పంకీ స్టేషన్‌కు చేరుకున్నప్పుడు, కొంతమంది దానిపై రాళ్లు వేశారు. Biggboss 8: మిడ్ […]
Google Gemini Live: అమెరికాకు చెందిన ప్రముఖ టెక్ కంపెనీ గూగుల్ ‘గూగుల్ ఫర్ ఇండియా’ ఈవెంట్ నేడు ప్రారంభమైంది. ఈ ఈవెంట్లో గూగుల్ జెమిని లైవ్‌ను ఆవిష్కరించింది. దీనితో పాటు, కంపెనీ తన మేక్ ఇన్ ఇండియా చొరవను కూడా విస్తరించనుంది. భారతదేశంలో ఇంటర్నెట్ సదుపాయం, డిజిటల్ అక్షరాస్యత, సాంకేతికతతో నడిచే పరిష్కారాలను పెంచడం కోసం అమెరికన్ టెక్ కంపెనీ కొత్తగా ఏమి చేస్తుందో ప్రకటించింది. ఇది ఇప్పటికే ఇంగ్లీష్ లో అందుబాటులో ఉంది. ఇప్పుడు […]
Isha Foundation: సద్గురు జగ్గీ వాసుదేవ్‌కి చెందిన ఇషా ఫౌండేషన్‌పై దాఖలైన అన్ని క్రిమినల్ కేసులకు సంబంధించి తమిళనాడు పోలీసుల నివేదిక కోసం మద్రాస్ హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు తాత్కాలిక నిలుపుదల చేసింది. ఫౌండేషన్ తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ కోరిన అత్యవసర విచారణ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ అభ్యర్థనను కేంద్రం కూడా సమర్ధించింది. భారత సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా “హైకోర్టు చాలా జాగ్రత్తగా ఉండవలసింది” అని పేర్కొన్నారు. Womens T20 […]
Womens T20 World Cup 2024: ఈ ఏడాది భారత మహిళా క్రికెట్ జట్టు ప్రదర్శన మిశ్రమంగా ఉంది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ లపై సిరీస్ ఓటములను చవిచూసింది, కానీ బంగ్లాదేశ్‌పై సిరీస్‌ను గెలుచుకోవడంలో విజయం సాధించింది. జూలైలో దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ డ్రా అయింది. దీని తర్వాత, 2024 ఆసియా కప్‌లో భారత్ ఫైనల్‌కు చేరుకుంది. అయితే ఫైనల్లో అజేయంగా నిలిచిన భారత జట్టు శ్రీలంక చేతిలో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఇప్పుడు టీ20 ప్రపంచకప్ 2024 […]
Sarfaraz Khan: అరంగేట్ర సిరీస్ లోనే ఇంగ్లాండ్ ఆటగాళ్ల గుండెల్లో భయం సృష్టించిన సర్ఫరాజ్., ఇప్పుడు ఇరానీ కప్‌లో తెగ పరుగులు చేస్తున్నాడు. అద్భుత ఇన్నింగ్స్ ఆడి సరికొత్త రికార్డు సృష్టించాడు. ఇరానీ కప్‌లో సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్, రోహిత్ శర్మ వంటి దిగ్గజ ఆటగాళ్లు కూడా సాధించలేని ఈ రికార్డును సర్ఫరాజ్ ఖాన్ సృష్టించాడు. Akkineni : మంత్రి కొండా సురేఖకు అక్కినేని నాగార్జున లీగల్ నోటీసులు..? ముంబై బ్యాట్స్‌మెన్ సర్ఫరాజ్ ఖాన్ 2024 […]
Viral Video: మహారాష్ట్రలోని పూణే ప్రాంతానికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇందులో అర్ధరాత్రి రోడ్డుపై కొంతమంది వ్యక్తుల నుండి కారులో ఉన్న కుటుంబం తప్పించుకుంటుంది. ఈ ఘటన సెప్టెంబర్ 29న జరిగింది. లావలే – నాందే రహదారిపై ప్రయాణిస్తుండగా కొందరు వ్యక్తులు కుటుంబంపై దాడి చేసి వాహనాల్లో చాలా దూరం వెంబడించారని బాధితుడు ఇంజనీర్ రవికర్ణానీ ఆరోపించారు. పోలీసులు కూడా తనకు సహాయం చేయలేదని చెప్పాడు. Israel-Iran War: ఇజ్రాయెల్‌కు రక్షకుడిగా […]
Phani: డైరెక్టర్ డా. వీఎన్ ఆదిత్య రూపొందిస్తున్న పాన్ ఇండియా సినిమాకు ‘ఫణి’ అనే టైటిల్ ఖరారు చేశారు మూవీ మేకర్స్. ఈ థ్రిల్లర్ జోనర్ లో రాబోయే సినిమాను ఓ. ఎం. జీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై, ఏయు & ఐ స్టూడియో సమర్పణలో డాక్టర్ మీనాక్షి అనిపిండి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ కేథరీన్ ట్రెసా లీడ్ రోల్ లో నటిస్తోంది. సినిమా హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళంలో పాన్ ఇండియా […]
Azharuddin: మనీలాండరింగ్ కేసులో భారత మాజీ కెప్టెన్, దిగ్గజ బ్యాట్స్‌మెన్ మహ్మద్ అజారుద్దీన్‌కు ఈడీ సమన్లు జారీ చేసింది. 20 కోట్ల నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆయనపై ఆరోపణలు వచ్చాయి. ఈ విషయం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌కు సంబంధించినది. నేడు హైదరాబాద్ లోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎదుట హాజరు కావాలని అజారుద్దీన్‌ను ఆదేశించింది. ఆయనకి ఇదే తొలి సమన్లు. Virat-Anushka: ఇది ట్రయిల్ బాల్.. కోహ్లీకే రూల్స్ నేర్పించిన అనుష్క! నవ్వు ఆపుకోవడం కష్టమే ఇదివరకు అజారుద్దీన్ […]