Viral Video: మహారాష్ట్రలోని పూణే ప్రాంతానికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇందులో అర్ధరాత్రి రోడ్డుపై కొంతమంది వ్యక్తుల నుండి కారులో ఉన్న కుటుంబం తప్పించుకుంటుంది. ఈ ఘటన సెప్టెంబర్ 29న జరిగింది. లావలే – నాందే రహదారిపై ప్రయాణిస్తుండగా కొందరు వ్యక్తులు కుటుంబంపై దాడి చేసి వాహనాల్లో చాలా దూరం వెంబడించారని బాధితుడు ఇంజనీర్ రవికర్ణానీ ఆరోపించారు. పోలీసులు కూడా తనకు సహాయం చేయలేదని చెప్పాడు.
Israel-Iran War: ఇజ్రాయెల్‌కు రక్షకుడిగా మారిన ముస్లిం దేశం.. మండిపడుతున్న ప్రజలు
పూణేలోని సుస్‌గావ్‌లో నివాసం ఉంటున్న రవి కిర్నాని సెప్టెంబర్ 29న తెల్లవారుజామున 1:56 గంటలకు లావలే – నాందే రోడ్డులో ఉండగా కారులో వెళ్తున్న కుటుంబానికి, మోటార్‌సైకిల్‌పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు ఆపమని సంకేతాలిచ్చారు. అయితే అక్కడ ఆగకపోవడంతో కర్ణాని వెంటాడటం మొదలుపెట్టారు. దాంతో వారు కారుపై పలుచోట్ల వ్యక్తులు ఆయుధాలతో దాడి చేస్తున్న దృశ్యాలు వీడియోలో కనిపిస్తున్నాయి. కారులో కూర్చున్న మహిళ భయంతో దేవుడి నామస్మరణ చేయడం వినిపిస్తోంది.
Road-Rage Kalesh (Shocking incident in Pune! Ravi Karnani, an IT engineer, claims he and his family were attacked by a mob of 40 on Lavale-Nande Road. Armed with sticks & stones, the mob targeted their vehicle)
pic.twitter.com/ycyMTa43If— Ghar Ke Kalesh (@gharkekalesh) October 2, 2024
స్థానిక మీడియా ప్రకారం, ఆ ప్రాంతంలో గస్తీ తిరుగుతున్న పోలీసులు కూడా తనకు సహాయం చేయలేదని కర్ణాని చెప్పారు. ఎలాగోలా ప్రాణాలు కాపాడుకుని అక్కడి నుంచి తప్పించుకున్నాము. అతని ఫిర్యాదు మేరకు పాడు పోలీసులు గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ వీడియో చూసిన నెటిజన్స్ ఇలాంటి వల్ల ఎంతమంది బాధపడ్డారో అని కామెంట్స్ చేస్తున్నారు