Diabetes: మధుమేహం అనేది అధిక రక్త చక్కెరకు కారణమయ్యే జీవక్రియ వ్యాధి. ఈ వ్యాధిలో, మీ శరీరం తగినంత ఇన్సులిన్‌ను తయారు చేయదు. అలాగే అది తయారుచేసే ఇన్సులిన్‌ను సమర్థవంతంగా ఉపయోగించుకోలేకపోతుంది. మధుమేహ వ్యాధిని చక్కెర వ్యాధి అని కూడా అంటారు. ఈ వ్యాధి జన్యుపరంగా, చెడు జీవనశైలి కారణంగా కూడా వస్తుంది. అర్ధమయ్యే విధంగా చెప్పాలంటే.. మధుమేహం అనేది మీ రక్తంలో చక్కెర స్థాయి చాలా ఎక్కువగా ఉండే పరిస్థితి. ఇది మీ రక్త నాళాలను […]
School Bus Caught Fire: ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్ లోని కౌశాంబి ప్రాంతంలో గురువారం ఉదయం పెను ప్రమాదం తప్పింది. ఉదయం 7:30 గంటల సమయంలో శ్రీశ్రీ రెసిడెన్సీ వెనుక ఆగి ఉన్న స్కూల్ బస్సులో మంటలు చెలరేగినట్లు సమాచారం. ఘటన గురించి సమాచారం అందిన వెంటనే ఫైర్ స్టేషన్ వైశాలి నుండి చీఫ్ ఫైర్ ఆఫీసర్, అతని బృందం వెంటనే రెండు అగ్నిమాపక వాహనాలతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ తర్వాత కాలిపోతున్న బస్సుకు మంటలను అదుపులోకి […]
IND vs SA Records: దక్షిణాఫ్రికాతో బుధవారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 11 పరుగుల తేడాతో విజయం సాధించి నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 2-1 ఆధిక్యంలో నిలిచింది. తిలక్ వర్మ అద్భుత ఇన్నింగ్స్‌తో అజేయంగా 107 పరుగులు, అభిషేక్ శర్మ 50 పరుగులతో భారత్ భారీ స్కోరు 219/6 చేయగలిగింది. ఇక లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికా తరఫున మార్కో జాన్సెన్ అద్భుత ప్రదర్శన చేసాడు. అతడు కేవలం 17 బంతుల్లో 54 పరుగులు చేశాడు. అయితే […]
Ambulance Blast: మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాలో బుధవారం సాయంత్రం జరిగిన ఈ ప్రమాదంలో ఓ గర్భిణి, ఆమె కుటుంబ సభ్యులు తృటిలో బయటపడ్డారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. అయితే, అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. గర్భిణిని, ఆమె కుటుంబాన్ని ఎరండోల్ ప్రభుత్వ ఆసుపత్రి నుండి జల్గావ్ జిల్లా ఆసుపత్రికి అంబులెన్స్‌లో తరలిస్తుండగా దాదా వాడి ప్రాంతంలోని జాతీయ రహదారిపై ఫ్లై ఓవర్‌పై ఈ ఘటన జరిగింది. ఉన్నటుండి […]
Atrocious Case: ఐదేళ్ల బాలికను చిత్రహింసలకు గురిచేసి హత్య చేసిన కేసులో సవతి తండ్రికి పతనంతిట్ట అదనపు సెషన్స్ కోర్టు మరణశిక్ష విధించింది. తమిళనాడు రాజపాళయం నివాసి అలెక్స్ పాండియన్ (26)కు కోర్టు మరణశిక్ష విధించింది. నిందితుడిపై క్రూరమైన లైంగిక వేధింపులు, హత్యల అభియోగాలు రుజువైనట్లు కోర్టు పేర్కొంది. హత్య, అత్యాచారం, ఘోరమైన శారీరక హాని, పోక్సో, జువెనైల్ జస్టిస్ యాక్ట్‌తో సహా జువైనల్ జస్టిస్ యాక్ట్‌లోని మొత్తం 16 సెక్షన్ల కింద నిందితుడిని కోర్టు నవంబర్ […]
Cochin Shipyard Jobs: ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న యువతకు సువర్ణావకాశం. కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ 50 స్కాఫోల్డర్, 21 సెమీ స్కిల్డ్ మెకానిక్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానించింది. 10, 4వ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్ సంబంధించిన అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు కొచ్చిన్ షిప్‌యార్డ్ అధికారిక వెబ్సైట్ cochinshipyard.in సందర్శించడం ద్వారా రిక్రూట్మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు . దరఖాస్తు ఫారమ్‌లను నవంబర్ 29 […]
GAIL Recruitment 2024: గెయిల్ ఇండియా లిమిటెడ్ సీనియర్ ఇంజనీర్, ఇతర పోస్టుల కోసం రిక్రూట్‌మెంట్‌ను ప్రకటించింది. ఇందులో అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు కంపెనీ అధికారిక వెబ్సైట్ gailonline.com ని సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు . దీనికి దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ డిసెంబర్ 11, 2024. గెయిల్ ఇండియా లిమిటెడ్ ద్వారా మొత్తం 261 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈ రిక్రూట్మెంట్ ద్వారా మొత్తం 261 వేర్వేరు పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో సీనియర్ […]
First Ball SIX In T20I: సాధారణంగా ఏ ఒక్క క్రీడాకారుడికైనా తన దేశం తరఫున ఆడడానికి కష్టపడతాడు. అలా దేశానికి ప్రాతినిధ్యం వహించాలంటే అంత ఆషామాష విషయం కాదు. ఎంతోమంది ట్యాలెంటెడ్ ప్లేయర్లను అధిగమించి వారి ట్యాలెంటును నిరూపించుకొని నేషనల్ టీంలో స్థానాన్ని సంపాదించుకుంటారు. అలా స్థానం సంపాదించుకున్న తర్వాత వారు ఆడిన మొదటి గేమునే విజయం తీరాలవైపున నడిపిస్తే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో ఆలోచించండి. అలాంటిది మరి భారతదేశం లాంటి దేశాలలో ఎంతో […]
Tulsi Gabbard: డొనాల్డ్ ట్రంప్ మంత్రివర్గంలోకి మరో హిందూ నేత చేరారు. అమెరికా కొత్త నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్‌గా భారత సంతతికి చెందిన తులసీ గబ్బార్డ్ను ట్రంప్ నియమించారు. మాజీ కాంగ్రెస్ సభ్యురాలు తులసి గబ్బార్డ్ అమెరికా తొలి హిందూ కాంగ్రెస్ మహిళగా కూడా గుర్తింపు పొందారు. తులసి గబ్బార్డ్ కూడా సైనికురాలిగా పనిచేసింది. మిడిల్ ఈస్ట్, ఆఫ్రికాలోని యుద్ధ ప్రాంతాలకు వివిధ సందర్భాలలో ఆమె పని చేసారు. ఆమె కొంతకాలం క్రితం డెమొక్రాట్ పార్టీ నుండి […]
Eye Operation: గ్రేటర్ నోయిడాలో వైద్యులు నిర్లక్ష్యానికి పాల్పడ్డారు. మొత్తం వైద్యరంగం సిగ్గుపడేలా సంఘటన జరిగింది. నిజానికి, ఎడమ కన్ను చికిత్స కోసం ఆసుపత్రికి వచ్చిన 7 ఏళ్ల చిన్నారికి మత్తుమందు ఇచ్చి కుడి కంటికి ఆపరేషన్ చేశారు. అంతే కాదు.. ఈ ఆపరేషన్ కోసం చిన్నారి కుటుంబం నుంచి రూ.45 వేలు కూడా వసూలు చేశారు వైద్యులు. ఆపరేషన్ అనంతరం డిశ్చార్జి అయ్యి ఇంటికి చేరుకోగానే పిల్లాడిని కుటుంబ సభ్యులు గమనించారు. అనంతరం ఈ విషయమై […]