IND vs SA Records: మూడో టీ20 మ్యాచ్‌లో రికార్డుల జోరు.. ఎవరెవరు ఏ రికార్డ్స్ సృష్టించారంటే?
- మూడో టీ20 మ్యాచ్‌లో రికార్డుల జోరు..
- దక్షిణాఫ్రికాలో అత్యధిక టి20 స్కోరు.
- తిలక్ వర్మ సెంచరీ.
- అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND vs SA Records: దక్షిణాఫ్రికాతో బుధవారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 11 పరుగుల తేడాతో విజయం సాధించి నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 2-1 ఆధిక్యంలో నిలిచింది. తిలక్ వర్మ అద్భుత ఇన్నింగ్స్‌తో అజేయంగా 107 పరుగులు, అభిషేక్ శర్మ 50 పరుగులతో భారత్ భారీ స్కోరు 219/6 చేయగలిగింది. ఇక లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికా తరఫున మార్కో జాన్సెన్ అద్భుత ప్రదర్శన చేసాడు. అతడు కేవలం 17 బంతుల్లో 54 పరుగులు చేశాడు. అయితే లక్ష్యాన్ని చేరుకోవడానికి ఆతిథ్య జట్టుకు అది సరిపోలేదు. అర్ష్‌దీప్ సింగ్ తన అద్భుతమైన స్పెల్‌లో 3 వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో భారత్ దక్షిణాఫ్రికాలో అత్యధిక T20 స్కోరు చేయడంతో సహా అనేక రికార్డులు బద్దలయ్యాయి. మరి వీటి విశేషాలు చూద్దామా..
దక్షిణాఫ్రికాలో అత్యధిక టి20 స్కోరు:
Also Read
- Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
- OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
- OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
- Tirupati Corporation: తిరుపతి కార్పొరేషన్లో పెరిగిన వార్డులు.. 50 నుంచి 66కి పెంపు..
దక్షిణాఫ్రికా గడ్డపై టి20 ఫార్మాట్‌లో అత్యధిక స్కోరు సాధించిన రికార్డును భారత్ సృష్టించింది. జట్టు 17 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టింది. అంతకుముందు, T20 ప్రపంచ కప్ 2007లో డర్బన్‌లో ఇంగ్లాండ్‌పై చేసిన 218 పరుగులు అత్యధిక స్కోరు.
#TeamIndia emerge victorious in a high-scoring thriller in Centurion 🙌
They take a 2⃣-1⃣ lead in the series with one final T20I remaining in the series 👏👏
Scorecard – https://t.co/JBwOUChxmG#SAvIND pic.twitter.com/StmJiqhI7q
— BCCI (@BCCI) November 13, 2024
తిలక్ వర్మ సెంచరీ:
తిలక్ వర్మ 56 బంతుల్లో 7 సిక్సర్లతో అజేయంగా 107 పరుగులు చేసాడు. ఈ నేపథ్యంలో తిలక్ వర్మ సెంచరీ సాధించిన రెండో భారత ఆటగాడిగా నిలిచాడు. ఈ ఇన్నింగ్స్‌తో ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్ 22 సంవత్సరాల 5 రోజుల వయస్సులో టి20లో సెంచరీ చేసిన రెండవ అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు. 21 ఏళ్ల 279 రోజుల వయసులో నేపాల్‌పై సెంచరీ చేయడం ద్వారా టీ20లో సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడైన భారతీయుడుగా యశస్వి జైస్వాల్ రికార్డ్ సృష్టించాడు.
YOUNGEST INDIAN PLAYERS TO SCORE HUNDRED FOR INDIA IN T20I:
Yashasvi Jaiswal – 21 years.
Tilak Varma – 22 years.
Shubman Gill – 23 years. pic.twitter.com/qjjC56qQSH
— Johns. (@CricCrazyJohns) November 13, 2024
అర్ష్‌దీప్ సింగ్:
అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో అత్యధిక వికెట్లు తీసిన రెండో ఫాస్ట్ బౌలర్ అయ్యాడు. భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రాలను దాటి టి20లో అత్యధిక వికెట్లు తీసిన భారత ఫాస్ట్ బౌలర్‌గా నిలిచాడు. అర్ష్‌దీప్ ఇప్పుడు టి20 ఫార్మాట్‌లో 92 వికెట్లు నేలకూల్చాడు. భారతదేశం తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో యుజ్వేంద్ర చాహల్ (96 వికెట్లు) తర్వాత అతను రెండవ స్థానంలో ఉన్నాడు.
Most wickets for India in men's T20is:
Yuzvendra Chahal – 96 wickets.
Arshdeep Singh – 91 wickets*.
Bhuvneshwar Kumar – 90 wickets.– ARSHDEEP MADE HIS DEBUT IN 2022…!!! 🤯🇮🇳 pic.twitter.com/L7Wyk3NWuu
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 13, 2024
మ్యాచ్‌లో ఇతర రికార్డులు:
* ఒక క్యాలెండర్ ఇయర్‌లో టీ20లో అత్యధిక స్కోరు 200+ సాధించిన జట్టుగా భారత్ నిలిచింది. 2024లో 8వ 200+ స్కోర్‌ని సాధించింది.
* టి20 కెరీర్‌లో తొలి బంతికి సిక్స్ కొట్టడంతో రమన్దీప్ సింగ్ రికార్డ్ లలోకి ఎక్కాడు. ఆ లిస్ట్ లో 8వ ఆటగాడిగా రికార్డ్ సృష్టించాడు.
* ద్వైపాక్షిక టీ20 సిరీస్‌లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసినవారిలో వరుణ్ చక్రవర్తి 10 వికెట్లతో మొదటి స్థానంలో ఉన్నాడు.
* టి20లలో భారత్‌పై వేగవంతమైన అర్ధ సెంచరీ (ఎదుర్కొన్న బంతులు) చేసిన వ్యక్తిగా మార్కో జెన్సన్ 16 బంతులతో చేసి రికార్డ్ సృష్టించాడు.
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?