Sankranthiki Vasthunam: 2025 సంక్రాంతి పండగ సందర్భంగా విడుదలైన సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’. సినిమా విడుదలైన ప్రతిచోటా విజయవంతంగా దూసుకుపోతుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజ్ నిర్మించగా.. డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ ఫుల్ కామెడీ ఎంటర్టైన్మెంట్కు ప్రేక్షకుల నుంచి మంచి పాజిటివ్ రివ్యూస్ రావడంతో బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురుస్తోంది. జనవరి 14న విడుదలైనప్పటి నుంచి ఫ్యామిలీ అడియన్స్ నుంచి సినిమా మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. చిత్రంలో విక్టరీ […]
Gaza Ceasefire: ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని భారతదేశం స్వాగతించింది. ఒప్పందం తర్వాత గాజాలో శాంతి, మానవతా సహాయం పెరుగుతాయని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆశాభావం వ్యక్తం చేసింది. గాజాలో బందీల విడుదల, కాల్పుల విరమణ ఒప్పందం ప్రకటనను స్వాగతిస్తున్నామని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇది గాజా ప్రజలకు సురక్షితమైన, నిరంతర మానవతా సహాయం అందించడానికి దారి తీస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపింది. అన్ని రకాల బందీల విడుదల, కాల్పుల విరమణ, […]
Fishermen Released: శ్రీలంక జైలు నుంచి విడుదలైన 15 మంది భారతీయ మత్స్యకారులు గురువారం ఉదయం చెన్నై విమానాశ్రయానికి చేరుకున్నారు. సముద్రంలో అంతర్జాతీయ సరిహద్దులు దాటుకొని వెళ్లి చేపలు పట్టినందుకు మత్స్యకారులను అరెస్టు చేశారు. తమిళనాడు మత్స్యశాఖ అధికారులు విమానాశ్రయంలో వారికి స్వాగతం పలికి స్వగ్రామాలకు పంపించారు. ఫిషరీస్ డిపార్ట్మెంట్ ప్రకారం, ఎనిమిది మంది మత్స్యకారుల బృందం 2024 సెప్టెంబర్ 27న మన్నార్ ద్వీపం ప్రాంతానికి సమీపంలో చేపలు వేడుతుండగా, శ్రీలంక నావికాదళం సరిహద్దు దాటి చేపలు […]
ISRO: భారతదేశం అంతరిక్ష పరిశోధనలో మరో చారిత్రాత్మక విజయం సాధించింది. ఇండియన్ స్పేస్ రీసర్చ్ ఆర్గనైజేషన్ (ISRO) స్పాడెక్స్ మిషన్ ను విజయవంతం చేసి రికార్డు సృష్టించింది. ఈ మిషన్ ద్వారా ఇస్రో తొలిసారిగా భూకక్ష్యలో రెండు ఉపగ్రహాలను విజయవంతంగా ప్రవేశపెట్టింది. ఇది భారతదేశానికి గర్వకారణం. ఎందుకంటే.. అమెరికా, రష్యా, చైనా తర్వాత ఈ ఘనత సాధించిన నాలుగో దేశంగా భారతదేశం అవతరించింది. గత ఆదివారం, స్పాడెక్స్ ఉపగ్రహాలు చెజర్, టార్గెట్ ఒకదానికొకటి దగ్గరగా చేరడం ద్వారా […]
BMI: భారతదేశంలో రోజురోజుకి ఊబకాయం ఒక ప్రధాన ఆరోగ్య సమస్యగా మారుతోంది. ఇది చిన్న పెద్ద అని తేడా లేకుండా విస్తృతంగా కనిపిస్తోంది. ఊబకాయం కారణంగా అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులు ఎదురుకావచ్చు. ఈ సమస్యను గణించడానికి శరీర బరువు అలాగే ఎత్తును ఆధారంగా బాడీ మాస్ ఇండెక్స్ (BMI) అనే కొలమానం ఉపయోగిస్తారు. ఒకవేళ బిఎంఐ 23 కంటే ఎక్కువ ఉంటే మీరు ఊబకాయంతో ఉన్నారని అర్థం. తాజాగా జరిగిన ఓ పరిశోధనలో, BMI 23 […]
Whatsapp Update: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన యూజర్ల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను పరిచయం చేస్తూనే ఉంటుంది. ఈ అప్డేట్స్ మీ చాటింగ్ అనుభవాన్ని మరింత సజావుగా, క్రియేటివ్‌గా మార్చేందుకు దోహద పడుతాయి. తాజాగా రాబోయే అప్డేట్ లో ఫోటో ఎడిటింగ్, సెల్ఫీ స్టిక్కర్ల తయారీ, మెసేజ్‌లకు త్వరగా రియాక్ట్ అయ్యే ఆప్షన్లతో ఈ కొత్త ఫీచర్లు ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. వాట్సాప్ కొత్త అప్డేట్స్లో భాగంగా, ఫోటోలు, వీడియోలకు ప్రత్యేక హంగులు జోడించే ఫీచర్ […]
Maha Kumbh Mela 2025 Masani Gorakh: ప్రతి నాలుగేళ్లకు ఒకసారి జరుగుతున్న మహా కుంభమేళా ఈసారి మరింత వైభవంగా ప్రారంభమైంది. తొలి రోజే రికార్డు స్థాయిలో దాదాపు రెండు కోట్లకు పైగా భక్తులు తరలిరావడంతో, ఈ ఆధ్యాత్మిక వేడుక ప్రపంచ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. సాధువులు, బాబాలు, ఆధ్యాత్మిక గురువులతో కళకళలాడే ఈ కుంభమేళ ఈసారి ఓ ప్రత్యేక వ్యక్తి ద్వారా మరింత ప్రసిద్ధి చెందింది. ఆయనే ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చదివిన అభయ్ సింగ్. […]
Honda Dio: కొత్త సంవత్సరంలో భారత టూవీలర్ మార్కెట్లో స్కూటర్ల వరుస లాంచ్‌లు జరుగుతున్నాయి. టూవీలర్ తయారీలో ప్రసిద్ధి పొందిన కంపెనీలు తమ మార్కెట్ వాటాను పెంచుకోవడానికి కొత్త మోడళ్లను విడుదల చేస్తూ పోటాపోటీగా వ్యవహరిస్తున్నాయి. ఈ పోటీ మధ్య హోండా కంపెనీ తన కొత్త స్కూటర్ 2025 హోండా డియోను మార్కెట్లోకి విడుదల చేసింది. మరి ఈ కొత్త 2025 హోండా డియో ఫీచర్లు, ధరల వివరాలను వివరంగా చూద్దాం. Also Read: Australian Open […]
Hindenburg Shutdown: అదానీ గ్రూప్‌ను షేక్ చేస్తున్న అమెరికా షార్ట్ సెల్లింగ్ సంస్థ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ మూతపడుతోంది. సంచలనాత్మక ఆర్థిక పరిశోధనల శకానికి ముగింపు పలికిన కంపెనీని మూసివేయాలని నిర్ణయించుకున్నట్లు దాని వ్యవస్థాపకుడు నాథన్ ఆండర్సన్ బుధవారం ప్రకటించారు. హిండెన్‌బర్గ్ వ్యవస్థాపకుడు తన ప్రయాణం, పోరాటాలు, విజయాల గురించి ఎమోషనల్ X పోస్ట్ ద్వారా తెలిపాడు. మేము పని చేస్తున్న ఆలోచనలను పూర్తి చేసిన తర్వాత దాన్ని మూసివేయాలనేది మా ప్రణాళిక అని, ఆ రోజు ఈ […]
Dollar Vs Rupee: డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి మారకం విలువ భారీగా పడిపోయింది. మంగళవారం నాడు రూపాయి ఏకంగా 66 పైసలు క్షీణించింది. గత రెండేళ్లలో ఇంత స్థాయిలో రూపాయి విలువ పడిపోవడం ఇదే మొదటిసారి. అంతేకాకుండా, గతంలో 2023 ఫిబ్రవరి 6న రూపాయి 68 పైసలు తగ్గింది. ఇప్పుడు మళ్లీ ఆ స్థాయిలో క్షీణించి ఇంటర్ బ్యాంక్ ఫారిన్ ఎక్సేంజ్ వద్ద రూపాయి విలువ 86.70 స్థాయికి చేరింది. ఇది రూపాయి చరిత్రలో అతి […]