Honda Dio: కొత్త సంవత్సరంలో భారత టూవీలర్ మార్కెట్‌లో స్కూటర్ల వరుస లాంచ్‌లు జరుగుతున్నాయి. టూవీలర్ తయారీలో ప్రసిద్ధి పొందిన కంపెనీలు తమ మార్కెట్ వాటాను పెంచుకోవడానికి కొత్త మోడళ్లను విడుదల చేస్తూ పోటాపోటీగా వ్యవహరిస్తున్నాయి. ఈ పోటీ మధ్య హోండా కంపెనీ తన కొత్త స్కూటర్ 2025 హోండా డియోను మార్కెట్లోకి విడుదల చేసింది. మరి ఈ కొత్త 2025 హోండా డియో ఫీచర్లు, ధరల వివరాలను వివరంగా చూద్దాం.
Also Read: Australian Open 2025: దూసుకెళ్తున్న అల్కరాస్.. యుకి, బోపన్న జోడీలు ఔట్!
2025 డియో 109.51 cc సింగిల్ సిలిండర్, PGM-FI ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇది 7.8 bhp పవర్, 9.03 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. స్కూటర్ CVT ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్‌ను కలిగి ఉంది. ఈ స్కూటర్ OBD2B ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించబడింది. దీని వల్ల తక్కువ కాలుష్య ఉద్గారాలు వెలుబడుతాయి. అలాగే, ఐడ్లింగ్ స్టాప్ ఫీచర్ ఇంధన వినియోగాన్ని మరింత మెరుగుపరుస్తుంది. అలాగే ఈ హోండా డియో 1808 mm పొడవు, 723 mm వెడల్పు, 1150 mm ఎత్తు కలిగి ఉంది. దీని గ్రౌండ్ క్లియరెన్స్ 160 mm, వీల్‌బేస్ 1260 mm. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 5.3 లీటర్లు. ఈ కొత్త డియో స్పోర్టీ డిజైన్, ప్రాక్టికల్ స్ట్రక్చర్‌తో మరింతగా ఆకట్టుకుంటుంది.
ఇక హోండా విడుదల చేసిన కొత్త డియో ప్రారంభ ధర రూ. 74,930 గా ఉంది. ఇది ప్రధానంగా రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఇందులో స్టాండర్డ్ మోడల్ ధర రూ. 74,930, అదే డిలెక్స్ మోడల్ ధర రూ. 85,648 గా నిర్ణయించింది కంపెనీ. ఇక 2025 డియో స్కూటర్ పలు ఆకర్షణీయమైన రంగుల్లో అందుబాటులో ఉంది. మ్యాట్ యాక్సిస్ గ్రే మెటాలిక్, పెర్ల్ ఇగ్నియస్ బ్లాక్ + పెర్ల్ డీప్ గ్రౌండ్ గ్రే, ఇంపీరియల్ రెడ్ మెటాలిక్, మ్యాట్ మార్వెల్ బ్లూ రంగులలో అందుబాటులో ఉంది.
Also Read: Hindenburg Shutdown: మూతపడనున్న హిండెన్‌బర్గ్ రీసెర్చ్..
ఇక ఈ సరికొత మోడల్ లో ఇతర ఫీచర్ల విషయానికి వస్తే.. ఇందులో 4.2 అంగుళాల TFT డిజిటల్ డిస్‌ప్లే, ట్రిప్ మీటర్, మైలేజ్ ఇండికేటర్, ఎకో ఇండికేటర్ ఉంటాయి. USB టైప్-సి ఛార్జింగ్ పోర్ట్, అల్లాయ్ వీల్స్ (DLX మోడల్‌లో ప్రత్యేకంగా) ఉంటాయి. హోండా సేల్స్, మార్కెటింగ్ డైరెక్టర్ యోగేష్ మాథుర్ మాట్లాడుతూ.. 2025 హోండా డియో యువతను బాగా మెప్పిస్తుందని అన్నారు. మెరుగైన సాంకేతికత, తక్కువ కాలుష్య ఉద్గారాలతో ఇది రైడర్లకు సరికొత్త అనుభవాన్ని అందిస్తుందని తెలిపారు. 2025 హోండా డియో లాంచ్, స్కూటర్ విభాగంలో కొత్త ఒరవడి సృష్టించే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.