Bigg Boss 6: బిగ్ బాస్ రియాలిటీ షో అంటే గేమ్‌తో పాటు ఎమోషన్, రిలేషన్ కూడా ఉంటుంది. అయితే తెలుగులో ప్రసారమవుతున్న సీజన్ 6 చూసిన వారికి ఆశ్చర్యం కలుగుతోంది. ఎందుకంటే ఈ సీజన్‌లో కంటెస్టెంట్లు అందరూ ఎవరికి వారే తోపులా బిహేవ్ చేస్తున్నారు. ముఖ్యంగా హౌస్‌లో కొంచెం బలంగా కనిపిస్తున్న రేవంత్, గీతూ, ఆదిరెడ్డి, శ్రీహాన్, ఫైమా, శ్రీసత్య విషయంలో నేనే తోపురా అనే డైలాగ్ వినిపిస్తోంది. గతంలో ప్రసారమైన ఐదు సీజన్‌లలో రిలేషన్ షిప్స్ లేదా గ్రూప్స్ కనిపించేవి. కానీ ఈ సీజన్‌లో అది మిస్ అయ్యిందని క్లారిటీగా కనిపిస్తోంది. గతవారం ఆర్జే సూర్య-ఇనయా మాధ్య ఏదో బంధం చిగురిస్తుందని ప్రేక్షకులు భావించారు. కానీ ఈ వారం నామినేషన్స్ చూస్తే ఆ విషయం తుస్సుమంది. శ్రీసత్యను ఫ్లర్ట్ చేయడానికి అర్జున్ కళ్యాణ్ ప్రయత్నిస్తున్నా.. శ్రీసత్య అతడిని పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు.
Read Also: Tesla Pi Phone: అదిరిపోయే ఫీచర్స్‌తో మార్కెట్లోకి టెస్లా స్మార్ట్‌ఫోన్.. లాంచింగ్ ఎప్పుడంటే..?
అటు నామినేషన్స్ సందర్భంగా కంటెస్టెంట్లు సిల్లీ రీజన్స్ చెప్పడం కూడా ఈ సీజన్‌లో ఆడియన్స్‌కు చికాకు తెప్పిస్తోంది. బిగ్‌బాస్ రివ్యూవర్‌గా హౌస్‌లోకి అడుగుపెట్టిన ఆదిరెడ్డి అక్కడ కూడా రివ్యూవర్‌లాగే ఆడుతున్నాడు. నువ్వు సరిగ్గా ఆడలేదని.. నీకంటే నేనే ఆడుతున్నానని ప్రతివారం నామినేషన్స్‌లో నోరేసుకుని అందరినీ అరిచేస్తున్నాడు. హౌస్‌లో శాంతపరుడు రోహిత్‌ను కూడా ఈ విషయంలోనే ఆదిరెడ్డి రెచ్చగొట్టాడంటే అతడి పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు. మరోవైపు భార్యాభర్తలుగా అడుగుపెట్టిన రోహిత్-మెరీనా జంట కూడా ఆకట్టుకోవడం లేదు. గతంలో వరుణ్ సందేశ్-వితికా జంట తమ ఆట, పాటలతో హౌస్‌లో సందడి చేసింది. ఆ తరహాలో రోహిత్-మెరీనా జంట ఆడకుండా ఎవరికి వారే యమునా తీరే అన్న విధంగా వ్యవహరిస్తున్నారు. సీజన్-5లో మానస్, సన్నీ, కాజల్ గ్రూప్‌గా ఆడి అందరి మనసులను గెలుచుకున్నారు. చివరకు ఓటీటీ సీజన్‌లోనూ కొందరు కంటెస్టెంట్లు గ్రూప్‌గా ఆడినట్లు కనిపించారు. కానీ ఈ సీజన్‌లో ఒక గ్రూప్ లేదు.. ఎమోషన్ లేదు.. రిలేషన్ లేదు అంటూ ప్రేక్షకులు చర్చించుకుంటున్నారు.