AP Collectors Conference Day 2: కలెక్టర్ల సదస్సు రెండో రోజు.. ఈ-గవర్నెన్స్ నుంచి భూ పరిపాలన వరకు కీలక చర్చలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Collectors Conference Day 2: ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో 8వ కలెక్టర్ల సదస్సు రెండో రోజు కొనసాగనుంది.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరుగుతున్న ఈ సదస్సులో రాష్ట్ర పరిపాలనకు సంబంధించిన పలు కీలక అంశాలపై సమీక్ష నిర్వహించనున్నారు. రెండు రోజులుగా చర్చించిన అంశాలను సమీక్షిస్తూ, ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా జిల్లా కలెక్టర్లకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. రెండో రోజు సమావేశంలో ఈ-గవర్నెన్స్, ఆర్టీజీఎస్, పీజీఆర్ఎస్ పనితీరుపై ముఖ్యమంత్రి సమీక్ష చేయనున్నారు. అలాగే భూ పరిపాలనకు సంబంధించిన అంశాలపై జిల్లా కలెక్టర్లతో చర్చించనున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరు, వాటి కోసం కేటాయించిన నిధులను సమర్థవంతంగా సద్వినియోగం చేస్తున్న విధానంపైనా సమీక్ష జరగనుంది.
జిల్లాల వారీగా క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలపై ఓపెన్ ఫోరంలో చర్చించనున్నారు. కలెక్టర్ల నుంచి నేరుగా సమస్యలు, వాటి పరిష్కారానికి తీసుకుంటున్న చర్యల గురించి సీఎం చంద్రబాబు వివరాలు తెలుసుకోనున్నారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత వేగంగా, సమర్థవంతంగా అందేలా అవసరమైన సూచనలు చేయనున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై ఎస్పీలతో సీఎం సమీక్ష నిర్వహించనున్నారు. జిల్లాల్లో నెలకొన్న పరిస్థితులు, ప్రజా భద్రత, క్షేత్రస్థాయి సమస్యలపై అధికారులతో చర్చించనున్నారు. రెండు రోజుల కలెక్టర్ల సదస్సులో చర్చించిన అన్ని అంశాలను సీఎం చంద్రబాబు సమీక్షించనున్నారు. సదస్సు ముగింపు సందర్భంగా ఆయన ప్రసంగించి, భవిష్యత్‌లో జిల్లా పరిపాలన ఎలా ఉండాలి, ప్రజలకు మరింత మెరుగైన సేవలు ఎలా అందించాలనే అంశాలపై కలెక్టర్లు, అధికారులకు కీలక దిశానిర్దేశం చేయనున్నారు.
Also Read
- AP Drought Mandals 2026: కరువు కోరల్లో ఏపీ.. 21 జిల్లాల్లో 388 మండలాలు.. ప్రభుత్వం కీలక ఆదేశాలు
- Amaravati Construction: అమరావతి నిర్మాణంలో కీలక సమస్య..! కార్మికులపై అధికారుల దృష్టి
- AP Liquor Shops: మద్యం దుకాణాల దరఖాస్తుల గడువు పెంపు.. ఫీజులు, తేదీలు ఇవే
- Botsa Satyanarayana : బీసీ రిజర్వేషన్లపై బొత్స ఫైర్.. చంద్రబాబుకు సూటి ప్రశ్న
తాజావార్తలు
-
Adarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ రూమర్లు నిజమేనా?
-
Jantar Mantar Protest 2026: జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత.. ఇంటర్నెట్ సేవలపై ఆంక్షలు.. పలువురు నిరసనకారులు అదుపులోకి
-
Abhijeet Dipke: అభిజీత్ దీప్కే అరెస్ట్..? ‘చాయ్ తాగుదాం రండి’ అంటూ..
-
AP Drought Mandals 2026: కరువు కోరల్లో ఏపీ.. 21 జిల్లాల్లో 388 మండలాలు.. ప్రభుత్వం కీలక ఆదేశాలు
-
RC17 : రామ్ చరణ్ – సుకుమార్ సినిమా షూటింగ్, రిలీజ్‌కు పక్కా ప్లాన్
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?