Puja Tomar : భారత మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ఫైటర్ పూజా తోమర్ (Puja Tomar) సరికొత్త చరిత్ర సృష్టించింది. అల్టిమేట్ ఫైటింగ్ చాంపియన్‌షిప్‌లో (UFC) బౌట్ గెలిచిన మొదటి భారతీయురాలిగా రికార్డులకెక్కింది. బ్రెజిల్ లోని లూయిస్విల్లే వేదికగా జరిగిన గేమ్‌లో ఫైటర్ రేయాన్నే అమండా డోస్ శాంటోస్‌ను ఓడించి విజేతగా నిలిచింది. తొలి రౌండ్లో ప్రత్యర్ధిపై 30-27 స్కోర్‌తో పూజా పైచేయి సాధించింది. అయితే రెండో రౌండ్లో అమండా శాంటోస్.. పూజాను సమర్ధంగా ఎదుర్కొని 27-30 […]
రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్ రామోజీరావు (Ramoji Rao) అంతిమయాత్ర ఫిల్మ్‌సిటీలోని నివాసం నుంచి ప్రారంభమై రామోజీ గ్రూపు సంస్థల కార్యాలయాల మీదుగా స్మారక కట్టడానికి చేరింది. అంత్యక్రియలకు టీడీపీ అధినేత చంద్రబాబు హాజరయ్యారు. స్మృతి వనం వద్ద నివాళులర్పించిన అనంతరం రామోజీరావు పాడె మోశారు. వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నేతలు, సినీ ప్రముఖులు, రామోజీ గ్రూపు సంస్థల సిబ్బంది పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
జూన్ 9న ప్రధాని నరేంద్ర మోడీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్న సంగతి తెలిసిందే. అన్ని రహదారులు రాష్ట్రపతి భవన్‌కు దారి తీస్తాయి,ఇది మరోసారి ఆకర్షణీయంగా మారుతుంది. ఎన్నో చోట్ల నుంచి విదేశీ ప్రధానీలు మరియు అధ్యక్షులు హాజరు కానున్నారు. వచ్చే అతిథులకు దేశంలోని అన్ని ప్రధాన ప్రాంతాల నుండి రుచికరమైన వంటకాలతో సాంప్రదాయ శాఖాహారం థాలీని అందజేయనున్నట్లు రాష్ట్రపతి భవన్ వర్గాలు తెలిపాయి.ఆ వంటకాలు గురించి తెలియాలి అంటే ఈ వీడియో చుడాలిసిందే.
నేడు ప్రధానిగా నరేంద్ర మోదీ మూడోసారి ప్రమాణస్వీకారం చేయనున్నారు. దీంతో మోదీ క్యాబినెట్లో ఈసారి ఎవరికి చోటు దక్కుతుందనే ఆసక్తి నెలకుంది. అయితే, ఎన్డీయేలో బీజేపీ తర్వాత అతిపెద్ద పార్టీగా అవతరించిన టీడీపీకి మంత్రివర్గంలో ప్రాధాన్యత దక్కనుంది. కేంద్రమంత్రివర్గంలో ఇద్దరు టీడీపీ నేతలకు ఛాన్స్ దక్కినట్లు తెలుస్తోంది. అది ఎవరో తెలియాలి అంటే కింది వీడియో క్లిక్ చేసి చుడండి.
ఏపీ రాజధాని అమరావతిలో తిరిగి పనులు ప్రారంభమయ్యాయి. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి అధికారంలోకి రావటంతో, రోడ్ల వెంట చెట్లు, చెత్తను తొలగించే పనులు మొదలయ్యాయి. ఏపీసీఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్ శనివారం అమరావతి ప్రాంతంలో పనులను పరిశీలించారు. జేసీబీ యంత్రాలతో పారిశుద్ధ్యం పనులు చేపట్టారు. ఈనెల 12న చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్న నేపథ్యంలో, అమరావతిలో అభివృద్ధి పనులు మళ్లీ మొదలయ్యాయి. మరిన్ని వివరాలు కొరకు కింది వీడియో చుడండి.
మహారాష్ట్ర సతార జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు, పుణే పోర్షే కారు ప్రమాదంలో నిందితుడైన బాలుడి కుటుంబానికి చెందిన మహాబలేశ్వర్‌లోని లగ్జరీ రిసార్ట్‌లో అనధికారిక నిర్మాణాలు శనివారం కూల్చివేయబడ్డాయి. ఈ రిసార్ట్ సరైన అనుమతులు లేకుండా అభివృద్ధి చేయబడినట్లు తేలింది. మే19న నిందితుడు పోర్షే కారు అతివేగంగా, మద్యం సేవించి నడిపి, బైక్‌ను ఢీకొట్టి ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజినీరును చంపాడు. ప్రస్తుతం, నిందితుడు, అతని తల్లిదండ్రులు మరియు తాత యెరవాడ పరిశీలనా గృహంలో జైలులో ఉన్నారు.
కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ఇండియా కూటమి నుంచి జేడీయూ అధినేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌కు ప్రధానమంత్రి పదవి ఆఫర్ వచ్చినట్లు కేసీ త్యాగి తాజాగా వెల్లడించారు. అయితే ఇండియా నుంచి వచ్చిన ఆ ఆఫర్‌ను నితీష్ కుమార్ తిరస్కరించినట్లు త్యాగి స్పష్టం చేశారు. మేరకు తాజా ప్రస్తుతం జేడీయూ ఎన్డీఏ కూటమిలో ఉందని.. ఇలాంటి సమయంలో వెనుదిరిగి చూసే ప్రసక్తే లేదని జేడీయూ నేత కేసీ త్యాగి తేల్చి చెప్పారు. మరిన్ని వివరాలు కొరకు కింది […]
కేరళలోని వయనాడ్ నుంచి విజయం సాధించిన రాహుల్ గాంధీ ఆ స్థానం వైదొలగాలని భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. సార్వత్రిక ఎన్నికల్లో రాయ్‌బరేలి, వయనాడ్ నుంచి బరిలోకి దిగిన రాహుల్ రెండుచోట్లా విజయం సాధించారు. దీంతో ఏదో ఒక స్థానానికి రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాయ్‌బరేలీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ, వయనాడ్ స్థానానికి రాజీనామా చేయాలని రాహుల్ నిర్ణయించుకున్నట్లు సమాచారం . శనివారం జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో తన అభిప్రాయాన్ని వెల్లడించినట్టు తెలుస్తుంది […]
లోక్‌సభ ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీని నియమించాలని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ (CWC) నిర్ణయించింది. అందుకు రాహుల్ కూడా అంగీకరించవచ్చని పార్టీ నేతలు పేర్కొన్నారు. కాంగ్రెస్ 99 స్థానాలతో రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మనీష్ తివారీ, డీకే శివకుమార్, రేవంత్ రెడ్డి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోక్‌సభలో […]