హ్యట్రిక్ విజయం కోసం బరిలో దిగిన మంత్రి ఆర్కే రోజాకు నగరి ఓటర్లు గుణపాఠం చెప్పారు. అవసరం ఉన్నా లేకున్నా ప్రతిపక్ష పార్టీ నేతలపై నోరేసుకుని పడిపోయి నియోజకవర్గ అభివృద్ధిని గాలికొదిలేసి APIIC ఛైర్మన్‌గా, మంత్రిగా అడ్డగోలుగా దోచిన తీరుపై తమ ఆగ్రహాన్ని ఓట్ల రూపంలో ప్రదర్శించారు.. రెండున్నరేళ్లు మంత్రిగా ఆధికారం చెలాయించినా నియోజకవర్గంలో ఎలాంటి ప్రగతి లేకపోవడం, కార్యకర్తలకు అందుబాటులో లేకపోవడం కూడా ఓటమికి బాటలు వేసింది. దీంతో నియోజకవర్గ వ్యాప్తంగా సొంత పార్టీ నేతలే […]
నీట్ ఫలితాల్లో అవకతవకలు చోటుచేసుకున్నాయని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఆరోపించారు. దీనిపై వస్తున్న ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకొని వెంటనే దర్యాప్తు చేపట్టాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ని డిమాండ్ చేస్తున్నారు. జూన్ 4న వెలువడిన నీట్ ఫలితాల్లో దేశవ్యాప్తంగా 67 మందికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఒకే కేంద్రంలో పరీక్ష రాసిన ఆరుగురు విద్యార్థులకు 720కి 720 మార్కులు రావడం మే 5న సాయంత్రం 4 గంటల సమయంలో ప్రశ్నపత్రం ఇంటర్నెట్లో హల్చల్ […]
ఈ నెల 12న చంద్రబాబు నాయుడు అమరావతిలో సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ క్రమంలోనే తన అధికారుల బృందాన్ని, కలెక్టర్లను ఎంపిక చేయడానికి చంద్రబాబు నాయుడు ఇప్పటికే కసరత్తు ప్రారంభించారు. . ఇప్పటికే ఆరోపణలు ఎదురుకుంటున్న జవహర్ రెడ్డి (సీఎస్) తో పాటు కొందరు అధికారులకు బదిలీలు జారీచేశారు కొత్త సీఎస్‌గా సీనియర్ ఐఏఎస్ అధికారులు నీరబ్‌కుమార్ ఎంపిక జరిగింది ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి ముద్దాడ రవిచంద్రను నియమించారు. మరిన్ని వివరాలు […]
బర్డ్ ఫ్లూ (H5N2) వైరస్ తో ఒక వ్యక్తి మరణించారని ప్రకటించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వెంటనే ఈ ప్రకటనను వెనక్కు తీసుకుంది. మరణించిన వ్యక్తికి ఇతర అనారోగ్య కారణాలు ఉన్నాయని ధృవీకరించింది. పూర్తి స్థాయి పరీక్షలు నిర్వహించిన ఆ వ్యక్తికి దీర్ఘకాలిక మూత్రపిండ సమస్యలు, టైప్ 2 మధుమేహం, రక్తపోటు సమస్యలు ఉన్నాయని వెల్లడించింది. మరోవైపు, దేశంలో కొన్ని రాష్ట్రాలలో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది.ఈ మరణం బహుళ-కారకాల కారణాలతో జరిగింది, H5N2కి […]
Ramoji Rao Death News: పత్రికా రంగంలో చెరగని ముద్ర వేసిన ఈనాడు గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు గుండె సంబంధిత సమస్యలతో హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఈ నెల 5న ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవడంలో ఆయన ఆసుపత్రిలో చేరారు. ఆరోగ్యం విషమంగా ఉండడంతో ఈ రోజు ఉదయం 4.50 గం.కు ఆయన కన్నుమూశారు. అనంతరం ఫిల్మ్‌సిటీలోని నివాసానికి ఆయన పార్థివదేహాన్ని తరలించారు. ఆయన మృతిపట్ల సినీ, […]
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వందేభారత్ రైళ్ల సరాసరి వేగం గత మూడేళ్లలో గంటకు 84.48 కి.మీ. నుంచి 76.25 కి.మీ.లకు పడిపోయినట్లు రైల్వేశాఖ వెల్లడించింది. 2020-21లో వందేభారత్ రైళ్ల సరాసరి వేగం గంటకు 84.48 కి.మీ. కాగా.. 2022-23 నాటికి ఆ వేగం 81.38 కి.మీ.లకు, 2023-24 (ప్రస్తుతం) నాటికి 76.25 కి.మీ.లకు పడిపోయింది. 2019, ఫిబ్రవరి 15న తొలిసారిగా వందేభారత్ రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చిన సమయంలో గరిష్ఠంగా గంటకు 160 కి.మీ. వేగంతో ప్రయాణించేలా […]
ప్రభుత్వ ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. ఉపాధ్యాయుల బదిలీ, పదోన్నతుల షెడ్యూల్‌ను శుక్రవారం సాయంత్రం విడుదల చేసింది. ఈ నెల 8 నుంచి ఉపాధ్యాయుల బదిలీ, పదోన్నతుల ప్రక్రియ ప్రారంభం కానుంది. పండిట్, పీఈటీ అప్‌గ్రేడేషన్, మల్టీజోన్ 2లో హెచ్ఎం ప్రమోషన్, మల్టీ జోన్ 1లో స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్‌తో షెడ్యూల్ ప్రారంభం కానుంది. 23 రోజుల్లో పూర్తి ప్రకియ జరగనుంది. అయితే పదవీ విరమణ 3 సంవత్సరాల లోపు ఉన్న వారికి తప్పనిసరి […]
Narendra Modi Speech: నేడు (శుక్రవారం) ఉదయం ఢిల్లీలోని సంవిధాన్ సదన్(పాత పార్లమెంట్) భవనంలో ఎన్డీయే కూటమి నేతలు మోదీని మూడోసారి ఎన్డీయే పక్షనేతగా ఏక్రగీవంగా ఎన్నుకున్నారు. మోదీ నాయకత్వాన్ని సమర్థిస్తూ బీజేపీ ఎంపీ రాజ్‌నాథ్ సింగ్ తీర్మానం ప్రవేశ పెట్టారు. అనంతరం ఎన్డీయే కూటమి పార్టీల నేతలంతా మోదీకి పూలమాల వేసి శుభాకాంక్షలు తెలిపారు. ఎన్డీయే పక్ష నేతగా ఎన్నిక కావడం సంతోషంగా ఉంది. నాపై విశ్వాసం ఉంచి ఎన్డీయే నేతగా ఎన్నుకున్నారు. దేశానికి ఇంకా […]