హైదరాబాద్ TGPSC ముందు ఉద్రిక్తత నెలకుంది. TGPSC వద్ద ఆందోళనకు దిగిన బీజేపీ నాయకులు 25వేల పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. అలానే జాబ్ క్యాలెండరు వెంటనే విడుదల చేయాలని నినాదాలు చేసారు. ప్రస్తుతం పోలీసులు వారిని అడ్డుకుని ఆందోళనకారులను అక్కడ నుంచి తరలించారు. మరిన్ని వివరాల కోసం కింద వీడియో చుడండి..
రాబోయే 2024-25 పూర్తిస్థాయి కేంద్ర బడ్జెట్‌కు సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో సన్నాహక సమావేశం నిర్వహించారు.ఢిల్లీలో రాష్ట్రల ఆర్థిక మంత్రులతో కేంద్ర ఆర్థిక మంత్రి సమావేశమయ్యారు. తెలంగాణ నుంచి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఏపీ నుంచి పయ్యావుల కేశవ్ హాజరైయ్యారు. బడ్జెట్ రూప కల్పనపై రాష్ట్రాల ఆర్ధిక మంత్రులతో సంప్రదింపులు జరపనున్నారు వారి నుంచి వార్షిక బడ్జెట్ పై సలహాలు, సూచనలు తీసుకున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు నిర్మలా సీతారామన్ అధ్యక్షతన […]
బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపూరుపాలెంలో యువతి హత్యకు గురైన ఘటనపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ ఘటనలో నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో పోలీసులు కేసును ప్రతిష్టాత్మకంగ తీసుకున్నారు. ఐదు ప్రత్యేక బృందాలతో నిందితుడు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 48 గంటల్లో కేసును ఛేదించేందుకు కసరత్తు చేస్తున్నారు.హోంమంత్రి వంగలపూడి అనిత సంఘటనా స్థలాని పరిశీలించారు. బాధిత కుటుంబాన్ని కలిసి ప్రభుత్వం అండగా ఉంటుంది అని హామీ ఇచ్చారు […]
ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, సినీ పరిశ్రమపై చర్చ మళ్ళీ ప్రారంభమైంది. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం, ఆయన పార్టీ కి చెందిన ఎంమ్మెల్యే కందుల దుర్గేష్ సినిమాటోగ్రాఫర్ మంత్రిగ నియమితులయ్యారు. గత ప్రభుత్వాల్లో సినిమా నిర్మాణానికి సరైన మద్దతు లేకపోయినా, పవన్ సినీ రంగాన్ని ఏపీలో అభివృద్ధి చేయాలని భావిస్తున్నారు. ఈ నెల 26న విజయవాడలో సినీ కళాకారుల సదస్సు జరగనుంది. దీనిలో పరిశ్రమ అభివృద్ధి చర్యలపై చర్చించనున్నారు. మరికొన్ని వివరాల కోసం వీడియో […]
జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శ్రీ అమర్నాథ్ “ప్రథమ పూజ”లో పాల్గొని, జూన్ 29 నుండి తీర్థయాత్ర ప్రారంభమవుతుందని తెలియజేశారు.లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా మాట్లాడుతూ సందర్శకులు మరియు సేవా ప్రదాతలకు ఉత్తమమైన ఆరోగ్య సంరక్షణ మరియు అవసరమైన సౌకర్యాలను అందించడమే ప్రభుత్వ ప్రధాన కర్తవ్యమని పేర్కొంటూ, భక్తులందరికీ సునాయాసంగా మరియు అవాంతరాలు లేని యాత్రకు పరిపాలన హామీ ఇచ్చింది.యాత్ర అనంత్‌నాగ్ జిల్లాలోని పహల్గామ్ ట్రాక్ మరియు గందర్బల్ జిల్లాలోని […]
విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని కేంద్ర గనుల శాఖ మంత్రి చెబుతుండగా, ప్లాంట్ ఆస్తుల విక్రయం చాపకింద నీరులా జరుగుతోంది. వర్కింగ్ క్యాపిటల్ కోసం విశాఖ స్టీల్‌ప్లాంట్ విలువైన 25 ఎకరాల స్థలాలను ప్లాట్లుగా మార్చి ఇప్పటికే అమ్మకానికి పెట్టారు. తాజాగా, ఆర్ఐఎన్ఎల్కు ఇతర రాష్ట్రాల్లో ఉన్న కార్యాలయ భవనాలు, యార్డు స్థలాలు రూ.475 కోట్లకు విక్రయించేందుకు అనుమతులు కోరారు. ఈ ఆస్తుల విక్రయంపై కార్మిక సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మరికొన్ని వివరాల కోసం […]
Raidurgam Police: హైదరాబాద్ పలుచోట్ల బైక్ రేసింగ్స్తో యువకులు వీరంగం సృష్టిస్తున్నారు. భయంకరమైన శబ్ధాలతో టీ హబ్, ఐటీసీ కొహినూర్, నాలెడ్జ్ పార్క్, సాత్వా బిల్డింగ్ ప్రాంతాలో బైక్ రేసింగ్స్తో యువకులు హచ్‌చల్ చేస్తున్నారు. దీంతో రాయదుర్గం పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేపట్టి.. రేసింగ్స్కి పాల్పడిన 50మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి బైకులను స్వాధీనం చేసుకొని.. ఆర్టీఏ అధికారులకు అప్పగించారు. రేసింగ్‌తో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న యువకులపై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక […]
సీఎం చంద్రబాబు రెండు సంవత్సరాల తర్వాత అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. 2021లో ఆయన సీఎంగానే మళ్లీ సభలో అడుగు పెడతానని శపథం చేశారు. దానిని నిలబెట్టుకుంటూ, శుక్రవారం అసెంబ్లీలో అడుగుపెట్టారు. అక్కడి మెట్ల వద్ద ప్రణమిల్లి లోపలికి వెళ్లారు. అనంతరం అసెంబ్లీలోని తన ఛాంబర్లో కూర్చిన చంద్రబాబు భావోద్వేగానికి గురిఅయ్యినట్టు తెలుస్తుంది . సీఎం గా చంద్రబాబు, ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేసారు.
బొగ్గు గనుల ప్రైవేట్ పరంపై బీజేపీ బిల్ పెడితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఓటేసి మద్దతు ఇచ్చిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. బిల్‌కు ఆమోదం చెప్పిన బీఆర్ఎస్ నేడు కాంగ్రెస్‌పై ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, సింగరేణి బొగ్గు బావి వేలం పాటలో పాల్గొనకుండా సింగరేణి సంస్థకు నష్టం తీసుకుని వచింది. తమ అనుచర కాంట్రాక్టర్ల కోసమే బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బీఆర్ఎస్ వల్లనే రెండు బొగ్గు గనుల […]