రాబోయే 2024-25 పూర్తిస్థాయి కేంద్ర బడ్జెట్‌కు సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో సన్నాహక సమావేశం నిర్వహించారు.ఢిల్లీలో రాష్ట్రల ఆర్థిక మంత్రులతో కేంద్ర ఆర్థిక మంత్రి సమావేశమయ్యారు. తెలంగాణ నుంచి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఏపీ నుంచి పయ్యావుల కేశవ్ హాజరైయ్యారు. బడ్జెట్ రూప కల్పనపై రాష్ట్రాల ఆర్ధిక మంత్రులతో సంప్రదింపులు జరపనున్నారు వారి నుంచి వార్షిక బడ్జెట్ పై సలహాలు, సూచనలు తీసుకున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు నిర్మలా సీతారామన్ అధ్యక్షతన 53వ జిఎస్టి కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఆన్‌లైన్ గేమింగ్‌పై పన్ను వేయడంతోపాటు ఎరువుల పై పన్నులను తగ్గించాలనే పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ప్రతిపాదనపై చర్చ జరిగే అవకాశం ఉంది.