కన్నడ స్టార్ హీరో సుదీప్ ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలే చేస్తున్నాడు. ‘ఈగ’ తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన సుదీప్ ఆతర్వాత ‘బాహుబలి’, ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రాలలోను నటించాడు. నేడు ఆయన పుట్టినరోజు సందర్బంగా ఆయన నటిస్తున్న K3-‘కోటికొక్కడు’ సినిమా దసరా కానుకగా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఓటీటీ వార్తలకు చెక్ పెడుతూ థియేటర్లోనే కలుద్దామన్నారు. శివ కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం పూర్తిగా కమర్షియల్ ఎంటర్ టైనర్ గా రానుంది. ఈ చిత్రానికి హీరో […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్బంగా కాపు సంక్షేమసేన ఆధ్వర్యంలో బర్త్ డే వేడుకలు హైదరాబాద్ లో ఘనంగా జరిగాయి. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా మాజీ ఎంపీ, ఆంధ్రప్రదేశ్ మాజీ హోమ్ మంత్రి చేగొండి హరిరామ జోగయ్యతో పాటు ప్రముఖ నిర్మాత బన్నీ వాసు, నిర్మాత అడ్డాల చంటి, రత్నం, రాఘవేంద్ర రెడ్డి, గంగయ్య నాయుడు, విఠల్, ఎంవి రావ్, చందు జనార్దన్, నిర్మాత వానపల్లి బాబురావు, వడ్డీ సుబ్బారావు, దర్శకుడు రాజేంద్ర […]
కెప్టెన్ విశాల్ బత్రా జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘షేర్షా’ని ప్రతి భారతీయుడు తప్పక చూడాలి అని స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అంటున్నారు. బన్నీ బుధవారం షేర్షాను వీక్షించారు. సినిమా ఎంతగానో నచ్చటంతో తన భావోద్వాగాన్ని ట్విటర్ లో పంచుకున్నారు. అంతే కాదు యూనిట్ లో భాగమైన ప్రతి ఒక్కరినీ ప్రశంసించారు. “షేర్షా బృందానికి అభినందనలు. హృదయానికి హత్తుకునే సినిమా ఇది. టైటిల్ పాత్ర పోషించిన సిద్ధార్ధ్ మల్హోత్రా తన కెరీర్ లో ఉత్తమ ప్రదర్శన […]
(సెప్టెంబర్ 2తో పవన్ కళ్యాణ్ కు 50 ఏళ్ళు పూర్తి) పవన్ కళ్యాణ్ – ఈ పేరు వింటే చాలు అభిమానుల మదిలో ఆనందం అంబరమంటుతుంది. నవతరం టాప్ స్టార్స్ లో అందరికంటే వయసులో సీనియర్ పవన్ కళ్యాణ్. అదే తీరున ఇతరుల కన్నా మిన్నగా పవన్ సినిమాలు వసూళ్ళు చూపిస్తూంటాయి. జయాపజయాలతో నిమిత్తం లేకుండా పవన్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తుంటాయి. ఈ ప్యాండమిక్ లో ఫస్ట్ వేవ్ తరువాత ఈ యేడాదే ‘వకీల్ […]
(సెప్టెంబర్ 2న నందమూరి హరికృష్ణ జయంతి) తెలుగు చిత్రసీమలో తొలి నటవారసునిగా నందమూరి హరికృష్ణ నిలిచారు. మహానటుడు నటరత్న యన్టీఆర్ తన తనయుల్లో మూడవవాడైన హరికృష్ణను బాలనటునిగా ‘శ్రీకృష్ణావతారం’లోనే పరిచయం చేశారు. అందులో బాలకృష్ణునిగా హరికృష్ణ ముద్దుగా మురిపించారు. ఆ తరువాత మరికొన్ని చిత్రాలలో నటించినా, ‘డ్రైవర్ రాముడు’తో నిర్మాతగా మారారు హరికృష్ణ. అప్పటి నుంచీ చిత్ర నిర్మాణంపైనే దృష్టిని కేంద్రీకరించిన హరికృష్ణ దాదాపు 21 సంవత్సరాలకు మళ్ళీ కెమెరా ముందుకు వచ్చారు. అనూహ్యంగా కొన్ని సినిమాల్లో […]
రేపు ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి తెలంగాణ సీఎం భూమి పూజ చేయనున్నారు. ఇప్పటికే తెరాస ముఖ్య నేతలందరూ ఢిల్లీకి చేరుకున్నారు. కాగా ఢిల్లీలోనే వున్నా మంత్రి కేటీఆర్ రాష్ట్ర సమస్యలపై కేంద్ర మంత్రి పియూష్ గోయల్ కలిశారు. ఆయన వెంట మంత్రి గంగుల కమలాకర్ కూడా వున్నారు. ఈ సందర్బంగా కేటీఆర్ ఏమన్నారంటే.. ‘రైతు సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ చేపట్టిన చర్యలు ఫలాలిస్తున్నాయి. రికార్డు స్థాయిలో ఎఫ్.సి.ఐకు ధాన్యం అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ.. ఇప్పుడిప్పుడే […]
వ్యవసాయరంగంపై నేడు సీఎం వైయస్ జగన్ సమీక్ష నిర్వహించారు.రాష్ట్రంలో వర్షపాతం, పంటలసాగు, ఇ–క్రాపింగ్, వ్యవసాయ సలహామండళ్ల సమావేశాలు, ఎరువుల పంపిణీ, వ్యవసాయ విస్తరణ కార్యక్రమాలు, ఆర్బీకేల నిర్మాణ ప్రగతి తదితర అంశాలపై సీఎం సమీక్షించారు. రాష్ట్రవ్యాప్తంగా వర్షపాతం వివరాలను, సాగు వివరాలను అధికారులు సీఎంకు వివరించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ ఏమన్నారంటే.. ‘చిరుధాన్యాల సాగును ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాలి. చిరుధాన్యాల సాగును ప్రోత్సహించాలని సీఎం ఆదేశం ఆదేశించారు. బోర్లకింద, వర్షాధార భూములలో చిరుధాన్యాలు సాగుచేసేలా […]
తన తదుపరి సినిమా థియేటర్ లో విడుదల కాకపోతే సినీ పరిశ్రమను వదిలేస్తానని టాలీవుడ్ హీరో నాని సంచలన ప్రకటన చేశారు. నేడు టక్ జగదీష్ ట్రైలర్ ఈవెంట్ సందర్బంగా నాని ఈ కామెంట్స్ చేశారు. ఆయన మాట్లాడుతూ.. ‘టక్ జగదీష్ విడుదల విషయంలో నన్ను బయటి వాడిలా చూడటం బాధ కలిగించింది. బయట పరిస్థితులు బాగున్నప్పుడు కూడా నా సినిమా థియేటర్ కు వెళ్లకపోతే ఎవరో నన్ను బ్యాన్ చేయడం కాదు నన్ను నేనే బ్యాన్ […]
మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో కీలక అనుమానితుడిగా భావిస్తున్న సునీల్ యాదవ్ ను నార్కో పరీక్షలకు అనుమతి కోసం జమ్మలమడుగు కోర్టులో ప్రవేశపెట్టారు. నార్కో పరీక్షలు జరపాలంటే న్యాయస్థానం అనుమతించడంతో పాటు, నార్కో పరీక్షలు చేయించుకునే వ్యక్తి అంగీకారం కూడా అవసరం. ఈ నేపథ్యంలో, న్యాయమూర్తి స్పందిస్తూ, నార్కో పరీక్షలకు సమ్మతమేనా? అని సునీల్ యాదవ్ ను అడిగారు. నార్కో పరీక్షలకు తాను అంగీకరించబోనని సునీల్ యాదవ్ […]