కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ కు టాలీవుడ్ లోను మంచి మార్కెట్ వున్నా విషయం తెలిసిందే.. ఆయన ప్రతి సినిమాను తెలుగులోనూ డబ్ అయ్యేలా చూసుకుంటాడు. ‘పందెం కోడి, పొగరు, భరణి, వాడు వీడు, అభిమన్యుడు, డిటెక్టివ్ వంటి సినిమాలతో తెలుగు అభిమానులను అలరించాడు. ప్రస్తుతం ఆయన వరుస సినిమాల్లో నటిస్తుండగా.. తాజాగా విశాల్ తన 32వ చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకెళ్లారు. ఆగస్ట్ 29న విశాల్ పుట్టినరోజు సందర్భంగా చెన్నైలోని ప్రముఖ సాయిబాబా ఆలయంలో ఈ […]
గత కొంతకాలంగా వరుస పరాజయాలతో బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కెరీర్ గ్రాఫ్ కిందకి పోతోంది. దానిని పైకి లేపాలని ఎంత ప్రయత్నిస్తున్నా షారుఖ్ వల్ల కావడం లేదు. అయినా పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ప్రస్తుతం షారుఖ్ ఖాన్ తన ఆశలన్నీ సిదార్థ్ ఆనంద్ తెరకెక్కిస్తున్న ‘పఠాన్’మూవీపై పెట్టుకున్నాడు. అంతేకాదు… ఆ తర్వాత తమిళ దర్శకుడు అట్లీతో చేయబోతున్న సినిమా కూడా తనకు కలసి వస్తుందనే విశ్వాసంతో ఉన్నాడు. ఈ సినిమాను షారుఖ్ హిందీతో […]
ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకురాలు ఫరాఖాన్ లో సెన్సాఫ్ హ్యూమర్ తక్కువేం లేదు. తాజాగా చేయించుకున్న కరోనా పరీక్షలో ఫరాఖాన్ కు కోవిడ్ 19 పాజిటివ్ రిజల్డ్ వచ్చిందట. ఈ విషయాన్ని కూడా ఆమె కాస్తంత సెటైరిక్ గానే వ్యక్తం చేసింది. ‘రెండు డోసులు వేసుకున్న వ్యక్తులతోనే నేను ఇటీవల పని చేశాను. అలానే నేను కూడా వాక్సినేషన్ డబుల్ డోస్ కంప్లిట్ చేశాను. అయినా కూడా నాకు కరోనా వచ్చింది. బహుశా నేను దిష్టి చుక్క పెట్టకపోవడం […]
తమిళ చిత్రసీమలో కమెడియన్ సంతానంకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అతనికంటూ కొంతమంది అభిమానులు ఉన్నారు. దాంతో సంతానం హీరోగానూ తన అదృష్టం పరీక్షించుకునే పనిలో పడ్డాడు. అలా మూడేళ్ళ క్రితం ‘సర్వర్ సుందరం’ అనే సినిమా తెరకెక్కింది. కానీ గ్రహచారం బాగోక ఆర్థికపరమైన ఇబ్బందుల కారణంగా అది ఇప్పటి వరకూ విడుదలకు నోచుకోలేదు. అయితే… గత యేడాది ఈ సినిమా దర్శకుడు ఆనంద్ బల్కీ ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయడంపై అభిప్రాయం చెప్పమని నెటిజన్లను కోరాడు. […]
నాచురల్ స్టార్ నాని హీరోగా శివ నిర్వాణ డైరక్షన్ లో వస్తున్న సినిమా ‘టక్ జగదీష్’.. నాని సరసన రీతు వర్మ, ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. నాజర్, జగపతిబాబు, నరేశ్, రావురమేశ్, రోహిణి కీలక పాత్రలు పోషించారు. వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 10న ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను చిత్ర బృందం విడుదల చేసింది. ట్రైలర్ మొత్తం […]
ఇటీవల ఆంధ్రప్రదేశ్ సమాచార, రవాణ శాఖా మంత్రి పేర్ని నాని మెగా స్టార్ చిరంజీవికి ఫోన్ చేసి… సినిమా రంగానికి సంబంధించిన సమస్యలను డైరెక్ట్ గా ముఖ్యమంత్రి జగన్ కు నివేదించాల్సిందిగా కోరారు. దాంతో చిరంజీవి తెలుగు సినిమా రంగానికి చెందిన ప్రముఖ నిర్మాతలు సురేశ్ బాబు, ‘దిల్’ రాజు, అక్కినేని నాగార్జున, బీవీఎస్ఎన్ ప్రసాద్, సుప్రియ, దామోదర ప్రసాద్, నారాయణ దాస్ నారంగ్ తదితరులతో కలిసి సమావేశమయ్యారు. చిత్రసీమకు చెందిన ఏ యే సమస్యలను జగన్ […]
తమిళనాడు సీఎం స్టాలిన్ ను టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కలిశారు. మర్యాదపూర్వకంగా కలిసిన చిరు కాసేపు స్టాలిన్ తో ముచ్చటించారు. ఆ సమయంలోనే స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ కూడా వున్నారు. ప్రస్తుతం ఈ భేటీ ఆసక్తిని రేపుతోంది. నిన్న జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్టాలిన్ పై ప్రశంసల వర్షం కురిపించారు. ‘ఏ పార్టీ అయినా అధికారంలోకి వచ్చేందుకు రాజకీయాలు చేయాలే తప్ప.. అధికారంలోకి వచ్చాక చేయకూడదు. ఆ విషయాన్ని మీరు మాటల్లోనే కాకుండా చేతల్లోనూ […]
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ‘ఎవరు మీలో కోటీశ్వరుడు’ షోకి హోస్ట్ గా చేస్తున్నాడు. ఈ షోకి ప్రజాదరణ బాగానే ఉంది. ఎన్టీఆర్ వివాదాస్పద రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 1తో తెలుగులో బుల్లి తెరపై ఎంట్రీ ఇచ్చాడు. ఆ షో సక్సెస్ లో ఎన్టీఆర్ దే ప్రధాన భూమిక అనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇక ప్రస్తుతానికి వస్తే ‘ఎవరు మీలో కోటీశ్వరుడు’ కూడా కేవలం ఎన్టీఆర్ ఇమేజ్ తోనే నెట్టుకు వస్తోంది. ఈ […]
సినిమాల్లో అవకాశాలు లేని హీరోయిన్లు సోషల్ మీడియాలో గ్లామర్ స్టిల్స్ తో రచ్చ చేస్తుంటారు. కన్నుగీటు పిల్ల ప్రియా ప్రకాశ్ వారియర్ కూడా అందులో తక్కువేమీ కాదు. ఆమె నటించిన సినిమాలు ఒకదాని తర్వాత ఒకటి పరాజయం పాలు అవుతుంటే… అవేవీ పట్టించుకోకుండా నెటిజన్లకు తన అందాలను ఎరవేసి పాపులారిటీ పొందడానికి కృషి చేస్తోంది ప్రియా ప్రకాశ్. అంతేకాదు… అప్పుడప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడయాలోనూ బాగానే నానుతోంది. చిత్రం ఏమంటే… కేవలం ఇలా సోషల్ […]
‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’, ‘జాతి రత్నాలు’తో స్టార్ స్టేటస్ పొందాడు నటుడు నవీన్ పోలిశెట్టి. ప్రస్తుతం నవీన్ ఓకె అంటే సినిమా తీయటానికి టాప్ బ్యానర్ కూడా సిద్ధంగా ఉన్నాయి. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస’ తర్వాత బాలీవుడ్ లో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తో కలసి నవీన్ నటించిన ‘చిచ్చోరే’ కూడా విజయం సాధించటంతో బాలీవుడ్ లోనూ మంచి గుర్తింపు ఉంది. ఇక ‘జాతి రత్నాలు’ సూపర్ హిట్ తర్వాత, పలు అగ్ర నిర్మాణ […]