ప్రముఖ దర్శకుడు శంకర్ – మెగా పవర్ స్టార్ రాంచరణ్ సినిమా సెప్టెంబర్ 8న భారీ ఎత్తున లాంచ్ చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్ ను ప్రత్యేక అతిథిగా రానున్నట్లు సమాచారం. కాగా, శంకర్- రణ్వీర్ సింగ్ కాంబోలో ‘అపరిచితుడు 2’ పాన్ ఇండియా సినిమాగా రానున్న విషయం తెలిసిందే. ఇక చరణ్ కెరీర్‌లో 15వ చిత్రంగా వస్తున్న ఈ సినిమాని నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్‌తో […]
సినీ ఆర్టిస్ట్ ఏ.కృష్ణం అలియాస్ హీరో కృష్ణుడు అరెస్ట్ అయ్యారు. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శిల్పాపార్క్ విల్లాలో పేకాట ఆడుతున్న కృష్ణుడును ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన నిర్వాహకుడు పెద్ది రాజుతో పాటు మొత్తం ఎనిమిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం అర్థరాత్రి పేకాట స్థావరాలపై దాడులు చేసిన పోలీసులు..ఈ విషయాన్ని బయటకు రానివ్వలేదు. టాలీవుడ్ ఎన్నో చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసిన కృష్ణుడు ‘వినాయకుడు’ సినిమాలో హీరోగా నటించాడు.
‘ఆర్ఎక్స్ 100’ హీరో కార్తికేయ భిన్నమైన సినిమాలను చేస్తూ ముందు వెళ్తారు. ‘గుణ 369, 90ML, చావు కబురు చల్లగా’ లాంటి సినిమాలతో అలరించిన ఈ హీరో ప్రస్తుతం ‘రాజావిక్రమార్క’ సినిమా చేస్తున్నారు. శ్రీసరిపల్లి అనే కొత్త దర్శకుడు ఈ సినిమాతో పరిచయం కాబోతున్నాడు. రీసెంట్‌గా రిలీజ్ చేసిన ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకోగా తాజాగా టీజర్ విడుదల చేశారు. చాలా డిఫరెంట్ గా సాగిన ఈ టీజర్ లో కార్తికేయ […]
సూపర్ స్టార్ మహేష్ బాబు – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా త్వరలోనే ప్రారంభం కానుంది. ఇందులో బ్యూటీ పూజా హెగ్డే హీరోయిన్ గా నటించనుంది. అయితే మరో కథానాయికకు కూడా ఛాన్స్ ఉండటంతో నభా నటేష్ నటించనుందని తెలుస్తోంది. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ బ్యూటీ ప్రస్తుతం నితిన్ మాస్ట్రో సినిమాలో నటిస్తోంది. ఇక త్రివిక్రమ్ సినిమాలో సెకండ్ హీరోయిన్ కి ఎంతటి ప్రాధాన్యత ఉంటుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. తక్కువ […]
వినోద ప్రియులు, మరీ ముఖ్యంగా రియాల్టీ షో ప్రియులు అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న, స్టార్ మా ప్రతిష్టాత్మక రియాల్టీ షో బిగ్‌బాస్ మరో మారు తెలుగు ప్రేక్షకులకు ఆనందాశ్చర్యాలను కలిగించడానికి సిద్ధమైంది. బిగ్ బాస్ ఐదవ సీజన్ గ్రాండ్ ప్రీమియర్ స్టార్ మా ఛానెల్‌పై సెప్టెంబర్ 05, సాయంత్రం 6 గంటలకు ప్రసారం కానుంది. బిగ్‌బాస్ తెలుగుకు సంబంధించి ఓ సీజన్ ముగింపు రాత్రే తరువాత సీజన్‌కు సంబంధించిన చర్చ కూడా ఆరంభమవుతుంటుంది. ఈ అంశాలను […]
ఒక్క ఉపఎన్నిక లోకల్ లీడర్స్‌కు పండగ తీసుకొచ్చింది. రోజుల వ్యవధిలోనే లక్షలకు.. కోట్లకు పడగలెత్తుతున్నారు. నోటి వెంట లక్షలు.. కోట్లు తప్ప మరో ముచ్చట లేదు. జంపింగ్ జపాంగ్‌లకైతే జాక్‌పాట్. వేగంగా చేతులు మారుతున్న నోట్ల కట్టల కథేంటో ఈ స్టోరీలో చూద్దాం. రాత్రికి రాత్రే లక్షాధికారులు.. కోటీశ్వరులు అవుతున్నారా? తెలంగాణ రాజకీయాలు హుజురాబాద్ ఉపఎన్నిక చుట్టూ తిరుగుతుంటే.. అక్కడి లోకల్ లీడర్స్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాయి ప్రధాన పార్టీలు. బైఎలక్షన్ పుణ్యమా అని స్థానికంగా ఉన్న […]
తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో భాగంగా ఇవాళ ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. ఇరు రాష్ట్రాల జల వివాదాలు, కేంద్ర గెజిట్‌తో పాటు రాష్ట్రానికి సంబంధించిన ఇతర అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణకు రావాల్సిన పెండింగ్ నిధులపై ప్రధానితో చర్చినట్లు తెలుస్తోంది. అదే విధంగా ఢిల్లీలో తెలంగాణ రాష్ట్రానికి అధికారికంగా భవనం ఏర్పాటు స్థలాన్ని కేటాయించాలని మోడీని కేసీఆర్ కోరారు. ఈ అభ్యర్థనలకు ప్రధాని సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. యాదాద్రి పుణ్యక్షేత్రం ప్రారంభోత్సవానికి […]
ఆ మాజీ మంత్రి సొంత నియోజకవర్గంలో దూకుడు పెంచారా? వచ్చే ఎన్నికలకు ఇప్పుటి నుంచే వర్కవుట్ చేస్తున్నారా? సెంటిమెంట్‌ను రగిలించడంతోపాటు.. వారసులకు రాజకీయంగా తగిన ఉపాధి చూపించే పనిలో పడ్డారా? సీటు ఖాళీలేని చోట ఆయన ప్రయత్నాలు ఎంత వరకు ఫలిస్తాయి? ఎవరా మాజీ మంత్రి? తాండూరు టికెట్ తనదే అని పట్నం ప్రచారం! పట్నం మహేందర్‌రెడ్డి. టీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి. ప్రస్తుతం ఎమ్మెల్సీ. టీఆర్‌ఎస్ తొలి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన మహేందర్‌రెడ్డి.. 2018 ముందస్తు […]
ఒకప్పుడు ఆ నియోజకవర్గం ఆ పార్టీకి కంచుకోట. ఇప్పుడు అక్కడ అదేపార్టీ దిక్కులేకుండా పోయింది. మారిన రాజకీయ పరిణామాలు.. నేతల అవసరాలు మళ్లీ ఆ పార్టీకి గిరాకీ తెచ్చాయి. ఇప్పటికే ఓ నేత పాతగూటికి చేరేందుకు దారులు వెతుకుతుంటే.. మరో కొత్త నేత తన రాజకీయ భవిష్యత్ కోసం ఆ పార్టీని భుజానికి ఎత్తుకొనేందుకు రెడీ అవుతున్నారట. దేవగుడి ఫ్యామిలీ టీడీపీ వైపు చూస్తోందా? కడప జిల్లా జమ్మలమడుగు రాజకీయాలు ఆసక్తిగా మారుతున్నాయి. నాయకుడే లేకుండా దిక్కులేనిదైన […]