హోల్ సమ్ ఎంటర్ టైనింగ్ షోలో భాగం కావడం సంతోషం: నాగార్జున
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వినోద ప్రియులు, మరీ ముఖ్యంగా రియాల్టీ షో ప్రియులు అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న, స్టార్ మా ప్రతిష్టాత్మక రియాల్టీ షో బిగ్‌బాస్ మరో మారు తెలుగు ప్రేక్షకులకు ఆనందాశ్చర్యాలను కలిగించడానికి సిద్ధమైంది. బిగ్ బాస్ ఐదవ సీజన్ గ్రాండ్ ప్రీమియర్ స్టార్ మా ఛానెల్‌పై సెప్టెంబర్ 05, సాయంత్రం 6 గంటలకు ప్రసారం కానుంది. బిగ్‌బాస్ తెలుగుకు సంబంధించి ఓ సీజన్ ముగింపు రాత్రే తరువాత సీజన్‌కు సంబంధించిన చర్చ కూడా ఆరంభమవుతుంటుంది. ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 ప్రచారాన్ని రూపొందించారు. ఈ షో తిరిగి ఎప్పుడు ప్రారంభమవుతుందోనంటూ ఎదురుచూసున్న అభిమానుల జీవితాలలో పూర్తి వినోదాన్ని తీసుకువస్తామంటూ ఈ ప్రచారం జరిగింది. అక్కినేని నాగార్జున ఈ సీజన్‌కు హోస్ట్‌గా వ్యవహరిస్తుండటంతో పాటుగా డ్రామా, రొమాన్స్, యాక్షన్, వినోదంను నూతన టాస్క్‌లు, ఆసక్తికరమైన పోటీదారులతో మొత్తం కుటుంబానికి సమగ్రమైన వినోదం అందించనున్నారు.
బిగ్ బాస్ ఐదవ సీజన్‌కు హోస్ట్ చేయడం గురించి నాగార్జున మాట్లాడుతూ ‘‘గత కొద్ది నెలలు ప్రతి ఒక్కరికీ సవాల్‌గా నిలిచాయి. ఈ షోతో మా అభిమానుల జీవితాలలో ఆనందం, ఉల్లాసం తిరిగి తీసుకురావాలనేది మా ప్రయత్నం. ఓ నటునిగా, పోటీదారుల వాస్తవ భావాలను వెలుపలికి తీసుకురావడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. తద్వారా వారిని మరింతగా ప్రేక్షకులు అర్థం చేసుకోగలరు. కుటుంబంలోని ప్రతి ఒక్కరికీ వినోదాన్ని అందించే ఈ షోలో భాగం కావడం పట్ల నేను సంతోషంగా ఉన్నాను’’ అని అన్నారు.
Also Read
- Kaaka vs Vishwambhara:'కాకా' vs 'విశ్వంభర'… సంక్రాంతి 2027 రేసులో మెగాస్టార్ ఏం చేయబోతున్నారు?
- Irumudi OTT: ఓటీటీలోకి మాస్ మహారాజా రవితేజ ‘ఇరుముడి’.. ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చు అంటే?
- Bigg Boss Telugu 10: 'బిగ్ బాస్ తెలుగు 10'లో ఎవరు ఎంత సంపాదిస్తున్నారో తెలుసా?.. టాప్ లో ఆటో రామ్ ప్రసాద్..
- Hanuman Ansh: రూ.2 కోట్ల బడ్జెట్.. రూ.200 కోట్ల వసూళ్లు.. ఆ ఒక్క పొరపాటుతో ఆస్కార్ ఛాన్స్ మిస్
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5, స్టార్ మాలో సెప్టెంబర్ 5వ తేదీ సాయంత్రం 6 గంటలకు తొలిసారి ప్రసారం అవుతుంది. అనంతరం 15 వారాల పాటు రాత్రి 10 గంటలకు సోమవారం నుండి శుక్రవారం వరకూ, అలానే శని, ఆది వారాలలో రాత్రి 9 గంటలకు ప్రసారమవుతుందని నిర్వాహకులు తెలిపారు.
తాజావార్తలు
-
Explainer: వి*షం తింటున్నాం…! ప్యాకేజ్డ్ ఫుడ్‌పై ప్రభుత్వం ఉక్కుపాదం?
-
Kaaka vs Vishwambhara:’కాకా’ vs ‘విశ్వంభర’… సంక్రాంతి 2027 రేసులో మెగాస్టార్ ఏం చేయబోతున్నారు?
-
Top 5 Expensive Phones: భారత్‌లో అత్యంత ఖరీదైన 5 స్మార్ట్ఫోన్లు.. 2TB స్టోరేజ్, ధరలు తెలిస్తే షాక్!
-
Putin-Ajit Doval: పుతిన్‌కు అజిత్ దోవల్ అంటే రెస్పెక్టో చూడండి.. ‘స్పై-టు-స్పై సెల్యూట్’ వీడియో వైరల్
-
Yolo Travels Bus : కంచికచర్ల వద్ద బస్సు ప్రమాదం.. 36 మందికి తప్పిన పెను ముప్పు
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!