శర్వానంద్, సిద్దార్థ్ హీరోలుగా నటిస్తున్న చిత్రం ‘మహాసముద్రం’.. దర్శకుడు అజయ్ భూపతి డైరెక్షన్ లో ఓ డిఫరెంట్ కథతో ఈ సినిమా తెరకెక్కిస్తుంది. వైజాగ్ బ్యాక్‌డ్రాప్‌లో ఎ.కె.ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, ట్రైలర్ కు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ చిత్రంలోని ‘చెప్పాకే.. చెప్పాకే’ పాట మేకింగ్ వీడియోను విడుదల చేశారు. సముద్రంలో ఒడ్డున జరిగిన ఈ పాట షూటింగ్ విజువల్స్ ఆకట్టుకొంటున్నాయి. యువ […]
స్టార్ హీరోయిన్ సమంత హైదరాబాద్ వర్షంలో సరదాగా సన్నిహితులతో సైక్లింగ్ కు వెళ్లిన వీడియో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ‘బెస్ట్ కంపెనీతో వర్షంలో రైడింగ్’ అంటూ ఇన్‌స్టాగ్రామ్ లో క్యాప్షన్ ఇచ్చింది. మొదటి రోజే 21కిలోమీటర్లు తొక్కాను. త్వరలోనే వంద కిలో మీటర్లను చేరుకునేందుకు సిద్ధంగా ఉన్నాను అని పేర్కొంది. ఇక సోషల్ మీడియాలో యాక్టీవ్ గా వుండే సమంత.. ఫిట్నెస్ విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. క్రమం తప్పకుండా జిమ్ కు వెళ్తుంది. ఇక సమంత […]
ప్రామిసింగ్ యంగ్ హీరో నాగశౌర్య తాజా చిత్రం ‘లక్ష్య’ విడుదల తేదీ ఖరారైంది. నవంబర్ 12వ తేదీని అతని 20వ చిత్రమైన ‘లక్ష్య’ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ను జరుపుకుంటోంది. ఇందులో కేతికా శర్మ కథానాయికగా నటిస్తోంది. సోనాలి నారంగ్ సమర్పణలో నారాయణ దాస్ కె. నారంగ్, పుస్కర్ రామ్మోహన్ రావ్, శరత్ మరార్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిన్న […]
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో నటుడు బండ్ల గణేష్ స్వతంత్రంగా జనరల్ సెక్రటరీ పదవికి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.. మా ఎన్నికల్లో జనరల్ సెక్రెటరీ గా ఈరోజు నామినేషన్ దాఖలు చేశాడు. మా కార్యాలయంలో ఎన్నికల అధికారి కృష్ణమోహన్ కు బండ్ల గణేష్ నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడారు. ‘మహానుభావులు అందరూ కూర్చొని 28 సంవత్సరాల క్రితం మా అసోసియేషన్ పెట్టారు. ప్రతి అధ్యక్షుడు బాగానే చేసారు. గత ప్రెసిడెంట్ […]
(సెప్టెంబర్ 27న యశ్ రాజ్ చోప్రా జయంతి) భారతీయ సినిమా రంగంలో అరుదైన అన్నదమ్ములు కొందరున్నారు. వారంతా ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్నవారు. వారిలో బి.యన్.రెడ్డి – బి.నాగిరెడ్డి, రాజ్ కపూర్ – శశికపూర్, బి.ఆర్.చోప్రా – యశ్ రాజ్ చోప్రా సుప్రసిద్ధులు. అన్న బి.ఆర్.చోప్రా బాటలోనే పయనిస్తూ ఆయన సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన యశ్ రాజ్ చోప్రా తరువాతి రోజుల్లో దర్శకునిగా తనదైన బాణీ పలికించారు. రొమాంటిక్ మూవీస్ తెరకెక్కించడంలో మేటిగా […]
హైదరాబాద్ నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. అరగంట నుంచి కుండపోతగా వర్షం కురుస్తోంది. కురుస్తున్న వర్షం.. నల్లటి మేఘాలతో చిమ్మ చీకటిగా హైదరాబాద్ నగరం మారిపోయింది. సాయంత్రం నాలుగు గంటల సమయంలోనే రాత్రి వాతావరాణాన్ని తలపించింది. పలు ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. అత్యవసరమైతే తప్ప బయటకి రావద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. పలు ప్రాంతాల్లో రోడ్లమీద వరద నీరు భారీగా చేరుకొంది. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా గులాబ్ తుఫాన్ తీవ్ర ప్రభావాన్నే చూపుతోంది. నిర్మల్, నిజామాబాద్, […]
తనిష్క్ రెడ్డి, అంకిత సాహు జంటగా నటిస్తున్న తొలి చిత్రం షూటింగ్ సోమవారం రామానాయుడు స్టూడియోస్ లో మొదలైంది. రిచా భట్నాగర్, విజయలక్ష్మీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి తనిష్క్ రెడ్డి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు. ‘జెర్సీ, మళ్ళీ రావా’ చిత్రాలకు అసోసియేట్ డైరెక్టర్ గా పనిచేసిన మాధవ్ మూర్తి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ‘చిత్ర నిర్మాతలు బ్యాక్ ఎండ్ లో ఉండటంతో తాను ఈ మూవీని ఎగ్జిక్యూట్ చేస్తున్నట్టు తనిష్క్ రెడ్డి తెలిపాడు. ‘యదార్థ […]
ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీద తొలిసారి ‘గాడ్ ఆఫ్ బాక్సింగ్’ మైక్ టైసన్ దర్శనం ఇవ్వబోతున్నాడు. విజయ్ దేవరకొండ హీరోగా డేరింగ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న ‘లైగర్’లో కీలక పాత్రను టైసన్ పోషించబోతున్నాడు. గత కొంతకాలంగా ఈ విషయమై సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నా, చిత్ర బృందం ఇంతవరకూ పెదవి విప్పలేదు. తాజాగా విజయ్ దేవరకొండ… టైసన్ ఆగమనాన్ని తెలియచేస్తూ, అధికారికంగా ట్వీట్ చేశాడు. ‘మీకు పిచ్చెక్కిస్తామని హామీ ఇచ్చాం. అదిప్పుడు మొదలు కాబోతోంది. […]
ప్రముఖ నటుడు మాధవన్ తొలిసారి మెగా ఫోన్ పట్టి తెరకెక్కించిన సినిమా ‘రాకెట్రీ’. భారత అంతరిక్ష పరిశోధనా రంగంలో విశేష కృషి చేసిన సైంటిస్ట్ నంబి నారాయణ్ బయోగ్రఫీ ఇది. ఇప్పటికే తొలికాపీ సిద్దం చేసుకున్న ఈ మూవీ ట్రైలర్ ను చూసి ప్రధాని నరేంద్రమోదీ మాధవన్, నంబి నారాయణ్ లను ప్రత్యేకంగా అభినందించారు. మాధవన్ నంబి నారాయణ్ గా నటించిన ఈ సినిమా వచ్చే యేడాది ఏప్రిల్ 1న ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, […]