మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో నటుడు బండ్ల గణేష్ స్వతంత్రంగా జనరల్ సెక్రటరీ పదవికి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.. మా ఎన్నికల్లో జనరల్ సెక్రెటరీ గా ఈరోజు నామినేషన్ దాఖలు చేశాడు. మా కార్యాలయంలో ఎన్నికల అధికారి కృష్ణమోహన్ కు బండ్ల గణేష్ నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడారు.
‘మహానుభావులు అందరూ కూర్చొని 28 సంవత్సరాల క్రితం మా అసోసియేషన్ పెట్టారు. ప్రతి అధ్యక్షుడు బాగానే చేసారు. గత ప్రెసిడెంట్ నీ నువ్వు దిగు దిగు అని అన్యాయంగా అయాన్ని దింపే ప్రయత్నం చేశారు. ఇప్పుడు కొందరు వచ్చి సభ్యులను ప్రలోభ పెడుతున్నారు. మన హీరోలందరినీ తీసుకొచ్చి ప్రోగ్రామ్ పెట్టీ ఫండ్ కలెక్ట్ చేసి 100 మంది సభ్యులకు ప్లాట్లు ఇస్తానని బండ్ల గణేష్ తెలిపారు.
నేను మా బిల్డింగ్ కట్టను ఇప్పుడున్న ఆఫీస్ చాలు.. మా బిల్డింగ్ కడతాను చార్మినార్ కడతాను, అది చేస్తా, ఇది చేస్తాను అంటున్నారు.. అవి ఏమి జరగవు అవన్నీ అబద్ధాలు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై మా ఎలక్షన్ తరువాత మాట్లాడతాను. ప్రజల్ని ఎంటర్టైన్మెంట్ చేసే మన ఆర్టిస్టులు వుండగా ఎవరినో ఫండ్ అడగడం ఏమిటి..? నా విజయాన్ని ఎవరు ఆపలేరు.. నా వెనుక ఎవరున్నారో మీకు తెలియదు. ఇంతకు ముందు చేసిన వాళ్ళు ఏమి చేసారు, ఏమి చెయ్యలేదు అది మీకు తెలుసా. సభ్యులందరూ మిగతా వాళ్ళు ఇచ్చే తాయిలాలు తీసుకోండి ఓటు మటుకు నాకే వెయ్యండి’ అంటూ బండ్ల పులునిచ్చారు.