ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీద తొలిసారి ‘గాడ్ ఆఫ్ బాక్సింగ్’ మైక్ టైసన్ దర్శనం ఇవ్వబోతున్నాడు. విజయ్ దేవరకొండ హీరోగా డేరింగ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న ‘లైగర్’లో కీలక పాత్రను టైసన్ పోషించబోతున్నాడు. గత కొంతకాలంగా ఈ విషయమై సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నా, చిత్ర బృందం ఇంతవరకూ పెదవి విప్పలేదు.
తాజాగా విజయ్ దేవరకొండ… టైసన్ ఆగమనాన్ని తెలియచేస్తూ, అధికారికంగా ట్వీట్ చేశాడు. ‘మీకు పిచ్చెక్కిస్తామని హామీ ఇచ్చాం. అదిప్పుడు మొదలు కాబోతోంది. ఇండియన్ స్క్రీన్ పై తొలిసారి టైసన్ కనిపించబోతున్నాడు’ అని విజయ్ దేవరకొండ తెలిపాడు. ‘ద బ్యాడెస్ట్ మ్యాన్ ఆన్ ప్లానెట్, గాడ్ ఆఫ్ బాక్సింగ్, వన్ అండ్ ఓన్లీ లెజెండ్, ది బీస్ట్… టైసన్’ తమ చిత్రంలో నటిస్తున్నటు విజయ్ దేవరకొండ ప్రకటించారు. ఈ సందర్భంగా చిత్రబృందం ఓ పోస్టర్ తో పాటు స్మాల్ వీడియోనూ విడుదల చేసింది.
మైక్ టైసన్ రాకతో ఈ ప్రాజెక్ట్ అంచనాలు కూడా మారిపోయాయి. మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్‌లో ఎంతో నైపుణ్యం కలిగిన ఐరన్ మైక్ పాత్రలో టైసన్ కనిపించబోతున్నాడు. ఆయనతో పాటు మరి కొందరు విదేశీ ఫైటర్లు ఈ సినిమాలో నటిస్తున్నారు. ప్రస్తుతం ‘లైగర్’ షూటింగ్ గోవాలో జరుగుతోంది. హై ఆక్టేన్ యాక్షన్ సీన్స్ ను ఈ షెడ్యూల్ లో చిత్రీకరిస్తున్నారు. బ్లడ్, స్వెట్, వయలెన్స్ అనే క్యాప్షన్‌తో ఈ షెడ్యూల్‌ను పూరి ప్రాణం పెట్టి చేస్తున్నారు. థాయిలాండ్ స్టంట్ డైరెక్టర్ కెచ్చా యాక్షన్ సీక్వెన్స్‌ను కంపోజ్ చేస్తుండగా, విష్ణు శర్మ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
విజయ్ దేవరకొండ సరసన అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో రమ్యకృష్ణ, రోనిత్ రాయ్, విష్ణురెడ్డి, ఆలి, మకరంద్ దేశ్ పాండే, గెటప్ శ్రీను ఇతర ప్రధాన పాత్రలలో కనిపించబోతున్నారు. పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా కలిసి ‘లైగర్’ మూవీని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 28 పూరి జగన్నాథ్ బర్త్ డే సందర్భంగా మైక్ టైసన్ కు సంబంధించిన అనౌన్స్ మెంట్ రావడం విశేషం.
We promised you Madness!
— Vijay Deverakonda (@TheDeverakonda) September 27, 2021
We are just getting started 🙂
For the first time on Indian Screens. Joining our mass spectacle – #LIGER
The Baddest Man on the Planet
The God of Boxing
The Legend, the Beast, the Greatest of all Time!
IRON MIKE TYSON#NamasteTYSON pic.twitter.com/B8urGcv8HR