మహేశ్ హీరోగా నటిస్తున్న ‘సర్కారువారి పాట’ అనుకున్న టైమ్ కంటే ముందుగానే విడుదల కాబోతోందా? అంటే అనుననే అంటున్నాయి సినిమా వర్గాలు. ఇటీవల కాలంలో బడా హీరోల సినిమాల విషయంలో పలు మార్పులు చేర్పులు చోటుచేసుకుంటున్నాయి. అందులో భాగంగా మహేశ్ నటిస్తున్న ‘సర్కారువారి పాట’ ముందు అనుకున్నట్లు వచ్చే ఏడాది సంక్రాంతికి కాకుండా ఈ ఏడాది దసరా తర్వాత ఆడియన్స్ ముందుకు వస్తుందట. ఆ వెంటనే త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాను మొదలెట్టి 2022 సమ్మర్ కి వచ్చేలా ప్లాన్ చేస్తున్నాడట మహేశ్. అప్పుడు రాజమౌళితో అనుకున్న విధంగా ఫారెస్ట్ యాక్షన్ సినిమా మొదలైపోతుందన్నమాట. ఎన్టీఆర్ 30 నుంచి త్రివిక్రమ్ తప్పుకోవడం… కొరటాల ఎంట్రీ ఇవ్వటం… కొరటాల-బన్నీ సినిమా 2022 సమ్మర్ కి మొదలవటం వంటివి కూడా ఈ మార్పులు చేర్పులలో భాగమే. సో మహేశ్ కి ఈ ఏడాది గ్యాప్ ఉండదన్న మాట. ఇది మహేశ్ ఫ్యాన్స్ కి ఎంత సంతోషాన్ని కలిగించే వార్త.