అల్లు శిరీష్ చేసిన ఇండీ మ్యూజిక ఆల్బమ్ ‘విలయాటి షరాబ్’ గత మార్చి 24న విడుదలై యూట్యూబ్ లో దుమ్ము రేపుతోంది. దర్శన్ రావల్ నీతి మోహన్ పాడిన ఈ మ్యూజిక్ వీడియోను అల్లు శిరీష్, హేలీ దారువాలపై చిత్రీకరించారు. ఈ వీడియోకు యుట్యూబ్ లో 100 మిలియన్ వ్యూస్ లభించాయి. ఇప్పటి వరకూ ఆరు సినిమాల్లో హీరోగా నటించినా రాని గుర్తింపు శిరీష్ కి ఈ వీడియో ఆల్బమ్ ద్వారా లభించటం విశేషం. తన సోదరుడు నటించిన ఈ వీడియోకు 100 మిలియన్ వ్యూస్ రావటం పట్ల ఆనందాన్ని వక్యం చేస్తూ ఇన్ స్టాలో అభినందనలు తెలియచేశాడు అల్లు అర్జున్.