టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘సర్కారు వారి పాట’. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే దుబాయ్‌లో మేజర్ షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు కరోనా సెకండ్ వేవ్ కారణంగా బ్రేక్ పడింది. ఇదిలావుంటే, ఈనెల 31న కృష్ణ పుట్టినరోజు సందర్భంగా సర్కారు వారి పాట సినిమాలోని మహేష్ లుక్ తో చిన్నపాటి టీజర్ నే చిత్ర యూనిట్ ప్లాన్ చేశారని తెలుస్తోంది. దీంతో మహేష్ ఫ్యాన్స్ అప్పుడే సోషల్ మీడియా ట్రెండ్స్ కు రెడీ అవుతున్నారు. రికార్డ్స్ కి రెడీగా ఉండండంటూ పోస్టులు షేర్ చేస్తున్నారు. మహేశ్ మాస్ లుక్‌లో కనిపిస్తున్న ఈ సినిమాను 2022 సంక్రాంతికి రిలీజ్ కానుంది. మరోవైపు త్రివిక్రమ్-మహేష్ సినిమాకు సంబంధించి ఏదైనా సర్ ప్రైజ్ వస్తుందేమో చూడాలి!