Chhattisgarh : నేడు ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవం. ఇందులో దేశ ప్రధాని నరేంద్ర మోడీతో పాటు 6 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, నలుగురు కేంద్ర మంత్రులు రాజధాని రాయ్‌పూర్‌కు వస్తున్నారు.
MP : నేటి నుంచి మధ్యప్రదేశ్‌లో మోహన్ యాదవ్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఉజ్జయిని సౌత్ ఎమ్మెల్యే మోహన్ యాదవ్ బుధవారం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
Road Accident : ఫరూఖాబాద్‌లోని బదౌన్ రోడ్డులో బుధవారం ఉదయం పెను ప్రమాదం తప్పింది. ఓవర్ టేక్ చేస్తుండగా ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న 37 మంది చిన్నారులు తృటిలో బయటపడ్డారు.
Virtual Hearing : ఆన్‌లైన్ కోర్టు విచారణల సమయంలో అశ్లీల వీడియోలు ప్లే అవుతున్న కేసులు చాలా ఉన్నాయి. వారం రోజుల క్రితమే కర్ణాటక హైకోర్టు విచారణలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అసభ్యకర వీడియోలను ప్రదర్శించిన ఘటన వెలుగులోకి వచ్చింది.
Stock Market Opening: భారతీయ స్టాక్ మార్కెట్ మంచి ఊపుతో ప్రారంభమైంది. ITC షేర్లు ఈరోజు తిరిగి పుంజుకున్నాయి. ఐటీ షేర్లలో టీసీఎస్ బ్రేక్ పడింది. దీంతో అపోలో హాస్పిటల్స్, భారతీ ఎయిర్‌టెల్‌లో క్షీణత నెలకొంది.
Dhiraj Sahu : నేడు దేశం మొత్తం కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ ధీరజ్ సాహు పేరు మార్మోగిపోతుంది. అతడి కుటుంబం స్వాతంత్య్ర సమరయోధులే.. అయినా కొన్నాళ్లుగా తన బ్లాక్ మనీని భారీగా పోగేశాడు.
Joe Biden: రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యేందుకు అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ వచ్చే నెలలో భారత్‌కు వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. వచ్చే ఏడాది జనవరిలో కాకుండా వేరే తేదీలో క్వాడ్ కాన్ఫరెన్స్‌ను నిర్వహించాలని భారతదేశం పరిశీలిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
Delhi Weather : డిసెంబర్ నెలలో ఉత్తర భారతదేశంలో తీవ్రమైన చలి మొదలైంది. ఉదయం, సాయంత్రం వేళల్లో ఉష్ణోగ్రతల్లో భారీ తగ్గుదల కనిపిస్తోంది. ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా, ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లలో ఉదయం పొగమంచు కనిపిస్తోంది.