Australia : ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలోని వెస్ట్‌ఫీల్డ్ బోండి జంక్షన్ మాల్లో కత్తిపోట్లు, కాల్పుల కారణంగా భయాందోళనలు నెలకొన్నాయి. ఘటనా స్థలంలో పోలీసు ఆపరేషన్ కొనసాగుతోంది.
Viral: ప్రముఖ బాలీవుడ్ నటుడు సోనూసూద్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. కోవిడ్ సంక్షోభ సమయంలో సోనూ సూద్ చేసిన కృషి మరువలేనిది. నిరుపేదలకు అన్ని విధాలుగా సహాయం చేసిన సోను సూద్ తన సేవను ఇప్పటికీ కొనసాగిస్తున్నాడు.
Arvind Kejriwal : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్టు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై ఏప్రిల్ 15న సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తా ఈ కేసును విచారించనున్నారు.
Sanjay Singh : ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ శనివారం మరోసారి పెద్ద ఆరోపణ చేశారు. తీహార్ జైలు పరిపాలన బీజేపీ ఆదేశాల మేరకు నడుస్తోందన్నారు.
RJD Manifesto : బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ చిన్న కుమారుడు, ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్ 2024 లోక్‌సభ ఎన్నికల కోసం రాష్ట్రీయ జనతాదళ్(RJD) మేనిఫెస్టోను విడుదల చేశారు.
Kisan Reddy : పార్లమెంటు ఎన్నికలు బీజేపీకి ఎంతో ప్రతిష్టాత్మకంగా మారాయి. కేంద్రంలో వరుసగా మూడోసారి అధికారంలోకి రావాలని కమలం పార్టీ భావిస్తోంది. దేశవ్యాప్తంగా 400 ప్లస్ సీట్లు టార్గెట్‌గా పెట్టుకోగా తెలంగాణలో డబుల్ డిజిట్ స్థానాల్లో గెలవాలని భావిస్తోంది.
Patanjali Honey : ప్యాక్ చేసిన తేనె నమూనా పరీక్షలో విఫలమైన తర్వాత పతంజలి కంపెనీపై చర్య తీసుకోబడింది. నమూనా పరీక్షలో విఫలమవడంతో న్యాయనిర్ణేత అధికారి చర్య తీసుకున్నారు.
Gujarat : గుజరాత్‌కు చెందిన ఓ వ్యాపారి, అతని భార్య రూ.200 కోట్ల ఆస్తిని వదులుకుని సన్యాసులు కావాలని నిర్ణయించుకున్నారు. ఈ దంపతులు సబర్‌కాంత జిల్లాలోని హిమ్మత్‌నగర్ వాసులు.
Pakistan : పాక్ లోని పంజాబ్ ప్రావిన్స్ ప్రభుత్వం, ఆ దేశ సైన్యం శుక్రవారం ఓ అధికారిని అరెస్టు చేసిన తర్వాత పోలీసులకు, ఆర్మీ సిబ్బందికి మధ్య కొనసాగుతున్న వివాదంపై దర్యాప్తు చేయాలని నిర్ణయించాయి.
Bengaluru Blast : కర్ణాటక రాజధాని బెంగళూరులోని ప్రసిద్ధ రామేశ్వరం కేఫ్‌లో బాంబుతో భీభత్సం సృష్టించిన ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) శుక్రవారం (ఏప్రిల్ 12) పశ్చిమ బెంగాల్‌లో బాంబు పేలుడు సూత్రధారి సహా ఇద్దరు నిందితులను అరెస్టు చేసింది.