Viral: డెలివరీ బాయ్ కు మద్దతుగా సోనూ సూద్.. బండబూతులు తిడుతున్న జనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Viral: ప్రముఖ బాలీవుడ్ నటుడు సోనూసూద్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. కోవిడ్ సంక్షోభ సమయంలో సోనూ సూద్ చేసిన కృషి మరువలేనిది. నిరుపేదలకు అన్ని విధాలుగా సహాయం చేసిన సోను సూద్ తన సేవను ఇప్పటికీ కొనసాగిస్తున్నాడు. సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ఎక్స్‌లో సోనూసూద్ పెట్టిన ఓ పోస్ట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇటీవల గురుగ్రామ్‌లో ఒక స్విగ్గీ డెలివరీ బాయ్ కస్టమర్ ఇంటికి డెలివరీ చేయడానికి వెళ్లి షూ దొంగిలించడం సిసి కెమెరాలో బంధించబడి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Read Also:Supreme Court: కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ స్వీకరణ.. విచారణ ఎప్పుడంటే..!
Also Read
- Botsa Satyanarayana: 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాం.. ఒకరు పోతే వంద మంది వస్తారు...
- UP Politics: అఖిలేశ్ ముందే ఎస్పీ నేతల బూతులు.. రెండు జిల్లా కమిటీలు రద్దు
- RVNL New Order: నవరత్న కంపెనీకి రూ. 404 కోట్ల రైల్వే ప్రాజెక్ట్.. సోమవారం ఈ షేర్లలో కదలికలు..
- BJP: ‘‘కాంగ్రెస్ జోకర్ల పార్టీ’’.. రాహుల్ గాంధీపై బీజేపీ ఫైర్..
If Swiggy’s delivery boy stole a pair of shoes while delivering food at someone’s house. Don’t take any action against him. In fact buy him a new pair of shoes. He might be really in need. Be kind ❤️🙏
— sonu sood (@SonuSood) April 12, 2024
దీనిపై సోనూసూద్ స్పందిస్తూ.. స్విగ్గీ డెలివరీ బాయ్‌పై ఎలాంటి చర్యలు తీసుకోవద్దు. అది అవసరం కాబట్టే తీసుకుని ఉండవచ్చు. తద్వారా మానవత్వం వర్ధిల్లుతుందని అన్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఆయన పోస్టుపై వ్యతిరేక అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సోనూసూద్ వైఖరికి ఒక వర్గం మద్దతు తెలుపగా, మరో వర్గం వ్యతిరేకిస్తోంది. సోనూసూద్ అభిప్రాయం తప్పని నిరసన తెలుపుతున్న వారు దొంగతనాన్ని సమర్థించడం ఎంతవరకు సరైందని ప్రశ్నించారు. భారతదేశంలోని లక్షలాది మంది ప్రజలు స్విగ్గీ డెలివరీ బాయ్ కంటే పేదలున్నారని అన్నారు.
Read Also:Arvind Kejriwal : ఢిల్లీ లిక్కర్ స్కాం.. ఏప్రిల్ 15న సుప్రీంకోర్టులో విచారణ
కస్టమర్‌కు సరుకులు డెలివరీ చేసిన తర్వాత డోర్ బయట ఉంచిన షూలను స్విగ్గీ డెలివరీ బాయ్ దొంగిలించిన వీడియో వైరల్ అవుతోంది. గురుగ్రామ్‌లో జరిగిన ఈ చోరీ ఘటనకు సంబంధించిన వీడియో బయటకు రావడంతో ప్రజలు ఈ అంశంపై తీవ్రస్థాయిలో చర్చించుకుంటున్నారు. బాలీవుడ్ నటుడు సోనూ సూద్ కూడా డెలివరీ బాయ్‌కు మద్దతు ఇచ్చాడు. అయితే తాను చేసిన పోస్టుపై ట్రోల్‌లను ఎదుర్కోవలసి వచ్చింది. ఈ ట్వీట్ తర్వాత చాలా మంది వినియోగదారులు సోనూ సూద్‌ను ట్రోల్ చేయడం ప్రారంభించారు. “అతడు పేదరికంలో ఉండొచ్చు కానీ దొంగతనం నేరం. చైన్ స్నాచర్ మీ బంగారు గొలుసును దొంగిలించినట్లయితే, అతనిపై చర్య తీసుకోరా అంటూ వినియోగదారులు కామెంట్స్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Botsa Satyanarayana: 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాం.. ఒకరు పోతే వంద మంది వస్తారు…
-
Harish Rao : రాష్ట్రంలో రైతు రాజ్యం పోయి రాక్షస రాజ్యం వచ్చింది
-
UP Politics: అఖిలేశ్ ముందే ఎస్పీ నేతల బూతులు.. రెండు జిల్లా కమిటీలు రద్దు
-
RVNL New Order: నవరత్న కంపెనీకి రూ. 404 కోట్ల రైల్వే ప్రాజెక్ట్.. సోమవారం ఈ షేర్లలో కదలికలు..
-
Khairatabad Ganesh : ఖైరతాబాద్‌లో గణపయ్య సందడి.. క్యూలైన్లన్నీ ఫుల్.!
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!