Delhi: ఢిల్లీలో స్కూళ్లకు బాంబ్ బెదిరింపులు.. విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన
- ఢిల్లీలో స్కూళ్లకు బాంబ్ బెదిరింపులు
- విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి స్కూళ్లకు బాంబ్ బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది. సోమవారం ఉదయం పలు స్కూళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు భయాందోళనకు గురయ్యారు. ఇక సమాచారం అందుకున్న పోలీసులు, భద్రతా సిబ్బంది డాగ్‌స్క్వాడ్స్‌తో తనిఖీలు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Radhakrishnan: ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా రాధాకృష్ణనే ఎందుకు? బీజేపీ వ్యూహమిదేనా?
Also Read
స్కూళ్ల అధికారిక మెయిల్స్‌కి బాంబు బెదిరింపులు వచ్చాయి. స్కూళ్లను పేల్చేస్తున్నట్లుగా మెసేజ్ పంపిస్తున్నారు. దీంతో స్కూళ్ల దగ్గర పెద్ద ఎత్తున టెన్షన్ నెలకొంటోంది. ఢిల్లీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వసంత్ కుంజ్‌లోని డీపీఎస్ స్కూల్ (DPS), స్ప్రింగ్ డేల్ స్కూల్‌తో పాటు మరికొన్ని పాఠశాలలకు ఈ-మెయిల్ ద్వారా బాంబు బెదిరింపు మెసేజ్‌లు వచ్చాయని అధికారులు తెలిపారు. ప్రస్తుతం స్కూల్ నుంచి పిల్లలను బయటకు పంపి తనిఖీలు చేస్తున్నారు. బాంబు స్క్వాడ్‌లతో తనిఖీలు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Monday Test : కూలీ, వార్ 2కు నేటి నుండి అసలు పరీక్ష
ఢిల్లీ స్కూళ్లకు బాంబు బెదిరింపు మేసేజ్‌లు రావడం ఇదే మొదటిసారి కాదు. గత కొన్ని నెలలుగా ఈ బెదిరింపులు వస్తూనే ఉన్నాయి. డిసెంబర్‌లో సౌత్ ఢిల్లీలోని ఒక ప్రైవేట్ స్కూల్‌కు.. ఆ తర్వాత జూన్ 19న సౌత్ ఢిల్లీ లోని మరొక ప్రైవేట్ స్కూల్‌కు బాంబు బెదిరింపులు వచ్చాయని ఢిల్లీ పోలీసులు తెలిపారు. వరుస బాంబు బెదిరింపుల నేపద్యంలో ఇప్పటికే సైబర్ వింగ్ రంగంలోకి దిగింది. మెయిల్స్ ఎక్కడి నుంచి పంపుతున్నారని దానిపై దర్యాప్తు చేస్తున్నారు. ఇతర దేశాల నుంచి మెయిన్స్ వస్తున్నట్లు గుర్తించారు.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
-
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
-
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్‌లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
-
CM Revanth Reddy : ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ నూతన విద్యావిధానం
-
Pakistan: బ్రిక్స్‌లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?