Ponnala Lakshmaiah: పీసీసీ మాజీ చీఫ్, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్ పార్టీకి ఈరోజు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తన రాజీనామా లేఖను కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గేకు పంపించారు. పార్టీలో తనకు అవమానం జరిగిందంటూ లేఖలో పేర్కొన్నారు. అంతేకాకుండా బాధతో పార్టీకి రాజీనామా చేస్తున్నానని ఆయన అన్నారు. 2014 ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా పార్టీ ఓడిపోయిందని తెలిపారు. కానీ తనను రాజీనామా చేయించి పార్టీ బలి పశువును చేసిందంటూ భావోద్వేగానికి గురయ్యారు.
ఇదిలా ఉంటే.. తాజాగా ఆయన మాట్లాడుతూ, 45 ఏళ్ల రాజకీయ జీవితం తనదని పొన్నాల అన్నారు. 45 ఏండ్ల తర్వాత ఈ చర్య బాధాకరంగా ఉందని తెలిపారు. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది మీకు తెలియంది కాదని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ సభ్యుడిగా ఉన్నందుకు గర్వంగా ఉందని పొన్నాల కంటతడి పెట్టారు. పేద కుటుంబం నుండి వచ్చి ఈ స్థాయికి వచ్చానని ఆయన తెలిపారు. వరుసగా మూడు సార్లు గెలిచిన బీసీ నేతను అయినా.. పార్టీలో అవమానం కలిగిందని చెప్పుకొచ్చారు. 40 ఏండ్లలో మూడు సార్లు మాత్రమే కాంగ్రెస్ అధికారంలో ఉన్నదని.. వచ్చిన మూడు సార్లు కూడా తెలంగాణలో బలంగా లేమని చెప్పారు.
పదవుల కోసం తాను రాజీనామా చేయలేదని పొన్నాల తెలిపారు. భవిష్యత్ పై సమాధానము లేదని.. ఎవరెవరో ఏదో ఊహిస్తున్నారన్నారు. బీఆర్ఎస్ లో చేరుతున్న అనే ప్రచారం బాగానే జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్ గురించి ఏం నిర్ణయం జరగలేదని.. టికెట్లు అమ్ముతున్నారు అనేది మీకు తెలియదా అని పొన్నాల చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ లో చేరాలని సలహా ఇస్తున్నారా అని ప్రశ్నించారు.?