తెలంగాణ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం ఆయన తొలి ప్రసంగంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నో త్యాగాల మీద తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుతో తెలంగాణ మొత్తం అభివృద్ది చెందుతుంది.. గత ప్రభుత్వం ప్రజల బాధలు పట్టించుకోలేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సమిధిగా మారి తెలంగాణ ఇచ్చింది.. అమరవీరుల ఆకాంక్షలను నెరవేరుస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఇక.. గత ప్రభుత్వం ప్రగతి భవన్ చుట్టు ఏర్పాటు చేసిన ఇనుప కంచెలను బద్దలు కొట్టించానని తెలిపారు. పదేళ్ల పాటు బాధలను ప్రజలు మౌనంగా భరించారు.. ప్రజాభవన్ లో ప్రజా పరిపాలన అందిస్తాం.. ప్రజాభవన్ కు ప్రజలు ఎప్పుడైనా రావొచ్చు.. తెలంగాణ ప్రభుత్వంలో ప్రజలే భాగస్వాములు అని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.
Read Also: Nizamabad PFI Case: PFI కేసులో మరో నిందితుడిపై NIA ఛార్జిషీట్ దాఖలు
ఈ క్రమంలో.. ప్రజాభవన్ కంచే తొలగిపోవడంతో సీఎం కార్యాలయం చూసేందుకు పెద్ద ఎత్తున జనాలు వెళ్లారు. కొందరు కళాకారులు ప్రజా భవన్ ఎదుట పాటలు పాడుతూ బై బై కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు. అంతేకాకుండా.. అటుగా పోయే వాహనదారులు కూడా ఆగి సీఎం కార్యాలయాన్ని చూసుకుంటూ వెళ్లారు. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి పూర్తిగా కంచే ఉండటం.. జనాల్లో సీఎం కార్యాలయం ఎలా ఉంటుంది అనే క్యూరియాసిటి ఎక్కువగా ఉండేది.. కానీ, ఇప్పుడు పూర్తిగా గేట్స్ ఓపెన్ అయ్యేసరికి జనాలు ఆసక్తిగా చూశారు.
Read Also: Nayanthara : చెన్నై వరద బాధితులకు నయనతార సాయం.. విమర్శలు చేస్తున్న నెటిజన్స్..