పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఆదివారం జాతీయ సెలక్షన్ కమిటీని తొలగించింది. 2024 టీ20 ప్రపంచ కప్ ప్రారంభానికి ఇంకా కొన్ని నెలల సమయం మాత్రమే ఉంది. ఈ క్రమంలో.. కొత్త సెలక్షన్ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. శుక్రవారం లాహోర్‌లోని పీసీబీ ప్రధాన కార్యాలయంలో పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ, మాజీ చీఫ్ సెలెక్టర్ వాహబ్ రియాజ్ మధ్య జరిగిన సమావేశం అనంతరం పీసీబీ ఈ నిర్ణయం తీసుకుంది.
MI vs GT: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్..
పీసీబీ తెలిపిన వివరాల ప్రకారం.. ఇటీవల ముగిసిన పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL 2024)లో పలువురు ఆటగాళ్ల ప్రదర్శనపై రియాజ్ వివరణాత్మక నివేదికను సమర్పించాడు. మెరిట్ ఆధారంగా ఆటగాళ్లను ఎంపిక ఉంటుందని నఖ్వీ చెప్పారు. ప్రస్తుత సెలక్షన్ కమిటీని రద్దు చేసినట్లు పీసీబీ అధికార ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. త్వరలో సెలక్షన్ కమిటీని ప్రకటించనున్నారు. త్వరలో స్వతంత్ర సంస్థగా వ్యవహరిస్తామని పీసీబీ ప్రకటించింది. అలాగే ఆటగాళ్ల ప్రదర్శనను పెంచేందుకు కృషి చేస్తామన్నారు. ఆటగాళ్లను న్యాయమైన పద్ధతిలో ఎంపిక చేస్తామని పీసీబీ ప్రకటించింది. మెరిట్, పనితీరుకు కూడా ప్రాముఖ్యత ఇస్తామని.. ఈ కొత్త సెలక్షన్ కమిటీని సోమవారం ప్రకటించే అవకాశముంది.
Kaliyuga Pattanam Lo: సస్పెన్స్ థ్రిల్లర్ తో పాటు అది కూడా ఉంటుందంట
ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2024లో పాకిస్థాన్ జట్టు తన మొదటి మ్యాచ్‌ని డల్లాస్‌లో ఆతిథ్య అమెరికాతో ఆడడం గమనార్హం. ఆ తర్వాత.. న్యూయార్క్‌లో పాకిస్థాన్ జట్టు చిరకాల ప్రత్యర్థి భారత్‌తో తలపడనుంది. లీగ్ మ్యాచ్‌లలో ఐర్లాండ్, కెనడాతో కూడా పాకిస్తాన్ ఆడనుంది. టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ జూన్ 29న బ్రిడ్జ్‌టౌన్‌లో జరుగనుంది.