రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వైసీపీ అడుగులు వెస్తోంది. మరోసారి అధికారాన్ని దక్కించుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. దీనిలో భాగంగానే వైసీపీ మ్యానిఫెస్టోను మెరుగులు దిద్దేందుకు పార్టీ నాయకులు పూనుకున్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో ఇవాళ అంతర్గత సమావేశాలు నిర్వహించనున్నారు.
Read Also: Ponnala Lakshmaiah : రేవంత్ రెడ్డి కి పాలన అనుభవం శూన్యం
ఈ రోజంతా సీఎం మ్యానిఫెస్టోపై చర్చిస్తారు. నూతన అంశాలు, కొత్త పథకాలపై కసరత్తు చేస్తారు. ఈ నేపథ్యంలో కొందరు ముఖ్య నేతలు జగన్ ను కలిశారు. నేటితో దాదాపు బీ ఫాంల అందజేత కూడా పూర్తవుతోంది. రేపు ఉదయం ముఖ్యమంత్రి సోషల్ మీడియా ప్రతినిధులతో సమావేశం కానున్నారు. ఉత్తరాంధ్రలో బస్సు యాత్రకు అనూహ్యంగా వస్తున్న స్పందన.. రేపు విజయనగరంలో సీఎం రోడ్ షో, బహిరంగ సభ గురించి చర్చించనున్నారు. ఐదేళ్లలో చేసిన అభివృద్ధి సంక్షేమం, ప్రజల అసరాలు తీర్చడమే మా మా మ్యానిఫేస్టో అని పార్టీ నాయకులు వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు.