సిట్రోయెన్ ఇండియా మార్చి నెలలో ఎంట్రీ లెవల్ కారు C3 పై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. మార్చి 31, 2025 వరకు ఈ ప్రత్యేక తగ్గింపులు అందుబాటులో ఉంటాయి. ఈ ఆఫర్లను ఉపయోగించుకుని కస్టమర్లు తమకు నచ్చిన మోడళ్లను చాలా తక్కువ ధరకు కొనుగోలు చేసే అవకాశం పొందవచ్చు. సిట్రోయెన్ C3 హ్యాచ్‌బ్యాక్ కారుపై రూ. 1 లక్ష వరకు తగ్గింపు లభిస్తోంది.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచిన టీమిండియాకు బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది. రూ.58 కోట్ల ప్రైజ్ మనీ ఇవ్వనుంది. ఆటగాళ్లతో పాటు సిబ్బంది, సెలక్షన్ కమిటీకి ఈ నగదు అందజేయనున్నట్లు తెలిపింది.
టీమిండియా క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్, ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మల వివాహ బంధానికి ఎండ్ కార్డ్ పడింది. వీరికి ముంబైలోని ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది.
మరో రెండ్రోజుల్లో ఐపీఎల్ సంగ్రామం ప్రారంభం కానుంది. ఇప్పటికే అన్ని జట్లు తమ తమ హోంగ్రౌండ్‌లలో ప్రాక్టీస్‌లలో మునిగి తేలుతున్నారు. ఈ క్రమంలో.. లక్నో సూపర్ జెయింట్స్ (LSG) మెంటర్, భారత మాజీ ఫాస్ట్ బౌలర్ జహీర్ ఖాన్ మీడియాతో మాట్లాడారు.
బీసీసీఐ నిర్ణయంపై టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఫైర్ అయ్యాడు. క్రికెటర్స్ విదేశీ టూర్‌లో ఉన్నప్పుడు వారి వెంట కుటుంబ సభ్యులను తీసుకెళ్లొద్దు అంటూ బీసీసీఐ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ నిర్ణయాన్ని కోహ్లీతో పాటు ఇతర సీనియర్ ఆటగాళ్లు తప్పుబట్టారు. ఈ క్రమంలో.. ఈ నిర్ణయాన్ని సవరించేందుకు బీసీసీఐ సిద్ధమైనట్లు తెలుస్తోంది.
గుమ్మడికాయ గింజలు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో ఎంతో ఉపయోగపడతాయి. గుమ్మడికాయ గింజల్లో ఉన్న పోషకాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, ప్రోటీన్, మెగ్నీషియం, జింక్, యాంటీఆక్సిడెంట్లు శరీరానికి ఎంతో మేలుచేస్తాయి. వీటిలో ఉండే మోనోఅన్‌శాచురేటెడ్, పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వులు చెడు కొలెస్ట్రాల్ (LDL) ను తగ్గించడంలో.. మంచి కొలెస్ట్రాల్ (HDL) ను పెంచడంలో సహాయపడతాయి.
టెస్ట్ క్రికెట్‌లో టీమిండియా తడబడుతోంది. ఇటీవలే 2025 ఛాంపియన్స్ ట్రోఫీ, అంతకుముందు టీ20 వరల్డ్ కప్ సాధించిన భారత్.. టెస్ట్ క్రికెట్‌లో విఫలమవుతుంది. భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ టెస్ట్ క్రికెట్‌లో మార్పులు అవసరమని అభిప్రాయపడ్డారు. భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఈ మార్పులకు బాధ్యత వహించాల్సిన అవసరం ఉందని గంగూలీ చెప్పారు. రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్‌లో ఇంకా మెరుగ్గా ఆడగలడని అన్నారు.
కన్నడ నటి రన్యా రావు బంగారు స్మగ్లింగ్ కేసు దర్యాప్తులో షాకింగ్ విషయాలు బయటికొచ్చాయి. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) తాజా వివరాలను వెల్లడించింది. మంగళవారం కోర్టు విచారణ సందర్భంగా రన్యా రావు, ఆమె స్నేహితుడు తరుణ్ రాజు దుబాయ్‌కు 26 ట్రిప్పులు చేసి వారు బంగారాన్ని అక్రమంగా రవాణా చేసినట్లు ఆధారాలు ఉన్నాయని డీఆర్ఐ కోర్టుకు తెలిపింది.
నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ అంతరిక్షం నుంచి భూమ్మీదకు బయల్దేరింది. మరికొన్ని గంటల్లో ఆమె భూమ్మీద ల్యాండ్ కాబోతుంది. ఆమెతో పాటు మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ కూడా రానున్నారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 కోసం కౌంట్‌డౌన్ మొదలైంది. 18వ సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభంకానుంది. అన్ని ఫ్రాంచైజీలు తమ జట్లను బలోపేతం చేసుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) సోమవారం నిర్వహించిన "అన్‌బాక్సింగ్ ఈవెంట్" ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.