‘మేజర్’ కోసం అవినాష్ కొల్ల ఆరు భారీ సెట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘క్షణం, గూఢచారి, ఎవరు’ వంటి డిఫరెంట్ చిత్రాలతో వరుస విజయాలను అందుకున్న అడివి శేష్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న చిత్రం మేజర్. శశి కిరణ తిక్క దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మహేష్ బాబు జి.ఎం.బి. ఎంటర్టైన్మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్ సహకారంతో సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా నిర్మిస్తోంది. 26/11 ముంబై నగరంలో జరిగిన టెర్రర్ ఎటాక్స్‌లో తన ప్రాణాలను పణంగా ప్రజలను కాపాడిన ఆర్మీ ఆఫీసర్ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పాత్రను పోషిస్తున్నారు హీరో అడివి శేష్. రీసెంట్‌గా విడుదలైన ఈ సినిమా టీజర్ అన్ని భాషలలో ట్రెమండస్ రెస్పాన్స్‌తో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా ‘మేజర్’ విడుదలకు సిద్ధమవుతోంది. రియల్ ఇన్‌సిడెంట్స్‌ను ఆధారంగా చేసుకుని డైరెక్టర్ శశికిరణ్ తిక్క అండ్ టీమ్ ఈ స్క్రిప్ట్‌ను తయారు చేసుకున్నారు. అందుకు తగినట్లు భారీ సెట్స్‌ను వేసి సినిమాను చిత్రీకరిస్తున్నారు. ‘మహానటి’ వంటి నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీకి ప్రొడక్షన్ డిజైనర్‌గా పనిచేసిన అవినాష్ కొల్ల, ‘మేజర్’ సినిమాలోని సన్నివేశాలను రియలిస్టిక్‌గా కళ్లకు కట్టినట్లు చూపించబోతున్నారు. అందుకోసం ఆరు భారీ సెట్స్ వేశారు. అందులో ముంబైలోని గేట్ వే ఆఫ్ ఇండియా సెట్, ఎన్ఎస్‌జీ కమాండో సెట్‌లను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు స్టూడియోలో వేశారు. ఇక ఈ సినిమాకు వేసిన భారీ సెట్స్‌లో తాజ్ మహాల్ ప్యాలెస్ సెట్ హైలెట్ అని చెప్పొచ్చు. 2008లో జరిగిన టెర్రర్ ఎటాక్ తాజ్ హోటల్‌లోనే జరిగింది. ఈ సన్నివేశాలను చిత్రీకరించేటప్పుడు ప్రేక్షకులకు రియల్ లొకేషన్ ఫీలింగ్ కలిగించడానికి రియల్ హోటల్ ఎలా ఉందో అలాంటి సెట్‌నే అవినాష్ కొల్ల వేశారు. నాలుగైదు రోజుల పాటు చిత్ర యూనిట్ తాజ్ హోటల్ ఆర్కిటెక్చర్‌ను పరిశీలించారు. ప్రతి చిన్న విషయాన్ని కూడా సునిశితంగా పరిశీలించడమే కాకుండా, సెట్‌ను వేయడానికి ఎంతో రీసెర్చ్ చేశారు. ఐదు వందల మంది దాదాపు పది రోజుల పాటు శ్రమించి ఈ భారీ సెట్‌ను నిర్మించారు. ఈ సందర్భంగా ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్ల మాట్లాడుతూ – ‘‘అడివి శేష్, స్టోరీని నెరేట్ చేసేటప్పుడు తాజ్ హోటల్ ప్రాధాన్యతను వివరించారు. సినిమాలో అదొక సెట్ ప్రాపర్టీలాగా కాకుండా క్యారెక్టర్‌లా ఊహించుకోవాలని చెప్పాడు. శేష్, చెప్పిన ప్రతి చిన్న విషయాన్ని నోట్ చేసుకుని, రియల్ తాజ్ ప్యాలెస్‌లా మా సెట్‌ను వేశాం. తాజ్‌లో గ్రాండ్ స్టెయిర్ కేస్, టాటా ఐకానిక్ ఇమేజ్, ఎం.ఎఫ్. హుస్సేన్ పెయిటింగ్స్ వంటి వాటిని రీ క్రియేట్ చేశాం. 120 అడుగుల ఎత్తుతో ఐదు ఫ్లోర్స్ హోటల్ సెట్‌ను ఫైబర్, ఉడ్, ఐరన్ ఉపయోగించి తయారు చేశాం. ఈ సెట్స్ ఆడియన్స్‌కి సరికొత్త అనుభూతిని పంచనున్నాయి“ అని అన్నారు.
Also Read
- Kona Venkat : ఆ డైరెక్టర్లను బ్యాన్ చేయాలి.. సంచలన కామెంట్లపై కోన వెంకట్ క్లారిటీ
- Yash : డేవిడ్ రెడ్డి డైరెక్టర్'తో యష్.. అంతా ఒట్టిదేనట!
- Vijay Deverakonda : నా సినిమాలకు టికెట్ ధరలు ఎప్పటికీ పెంచబోను.. విజయ్ దేవరకొండ కీలక నిర్ణయం!
- Vijay Deverakonda: 'రణబాలి'లో హింస ఎక్కువే.. కానీ ఆనాటి వాస్తవాలతో పోలిస్తే తక్కువే:
- Tags
- Adivi Sesh
- Major
తాజావార్తలు
-
Kona Venkat : ఆ డైరెక్టర్లను బ్యాన్ చేయాలి.. సంచలన కామెంట్లపై కోన వెంకట్ క్లారిటీ
-
Gyanesh Kumar: జ్ఞానేశ్ కుమార్, ఈసీకి 124 మంది మాజీ-బ్యూరోక్రాట్ల మద్దతు.!
-
Telangana Govt: వియత్నాంకు 40 మంది ఉపాధ్యాయులు, అధికారుల బృందం.. ఎందుకంటే..
-
BJP: ‘‘దేశాన్ని పార్లమెంటే పాలిస్తుంది, వీధులు కాదు’’.. కాంగ్రెస్, కాక్రోచ్‌లపై బీజేపీ ఫైర్..
-
Yash : డేవిడ్ రెడ్డి డైరెక్టర్’తో యష్.. అంతా ఒట్టిదేనట!
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!