Phani Kumar Ananthoju
Author- NTV Telugu-
China Robot: చైనా రోబోలు.. భారత్‌కు పొంచి ఉన్న ముప్పు..! డ్రాగన్ టార్గెట్ అదేనా?
చైనా నుంచి ప్రపంచానికి మరో భారీ షాక్ తగలనుంది. ఒకప్పుడు చవకైన ఎలక్ట్రానిక్ వస్తువులతో ప్రపంచ మార్కెట్లను ముంచెత్తిన డ్రాగన్ దేశం.. ఇప్పుడు సరికొత్త వ్యూహంతో ముందుకొస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాలు.. సోలార్ ప్యానెల్స్ తరహాలోనే.. హ్యూమనాయిడ్ రోబోల తయారీలో గుత్తాధిపత్యం సాధించేందుకు చైనా వేగంగా అడుగులు వేస్తోంది. దీన్ని యావత్ ప్రపంచం ‘ది నెక్ట్స్ చైనా షాక్’గా చూస్తోంది. ఇంతకీ చైనాలో రోబోటిక్స్ విప్లవానికి కారణాలేంటి…?? దీనివల్ల యూరప్.. భారత్ లాంటి దేశాలకు పొంచి ఉన్న ప్రమాదం […] -
AIR INDIA Crash: ఆ మూడు సెకన్లలో అసలేం జరిగింది? విమానం కూలి ఏడాది గడుస్తున్నా ఇప్పటికీ అంతుచిక్కని ప్రశ్నలు!
గాల్లోకి ఎగిరిన కేవలం మూడు సెకన్లలోనే ఒక భారీ విమానం కుప్పకూలింది. అందులోని ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. భారత ఏవియేషన్ చరిత్రలో అదొక చీకటి రోజు. ఆ ఘోరమైన ఎయిర్ ఇండియా 171 విమాన ప్రమాదం జరిగి ఇవాళ్టి(జూన్ 12)కి ఏడాది పూర్తయింది. ఇంతకీ అసలు ఆ రోజు కాక్‌పిట్‌లో ఏం జరిగింది? అత్యాధునిక విమానంలోని సాంకేతిక లోపమా? పైలట్ల తప్పిదమా? సమాధానం దొరకని ఎన్నో ప్రశ్నలు మృతుల కుటుంబాలను ఇప్పటికీ వేధిస్తున్నాయి. అసలు ఎయిర్ ఇండియా […] -
India Job Crisis: ఇంజనీరింగ్ చేసి స్వీపర్ పోస్టులకు అప్లై చేస్తున్నారు.. ఇక డిగ్రీలు దండగేనా?
ఉన్నత చదువులు చదివితే భవిష్యత్తులో మంచి ఉద్యోగం వస్తుందన్నది ఒకప్పటి మాట. ఇప్పుడు డిగ్రీలు.. పీజీలు.. ఇంజనీరింగ్ చేసిన వాళ్లు కూడా ప్యూన్.. స్వీపర్ పోస్టుల కోసం క్యూ కడుతున్నారు. ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక తీర్పు ఈ సమస్యను మళ్లీ తెరపైకి తెచ్చింది. తక్కువ విద్యార్హత అవసరమైన ఉద్యోగాలకు.. ఎక్కువ చదువుకున్న వాళ్లు పోటీ పడకూడదని కోర్టు స్పష్టం చేసింది. అయితే.. ఇక్కడ అసలు ప్రశ్న వేరే ఉంది. లక్షలాది మంది ఉన్నత విద్యావంతులు ఎందుకు […] -
Job Crisis Explained: ఇంజినీర్లు, డాక్టర్లు ఉన్నారు కానీ ప్లంబర్లు లేరు..ఇండియాలో ఈ సైలెంట్ సంక్షోభానికి కారణమేంటి?
ఒక్కసారి ఊహించుకోండి…! ఇంజినీర్లు.. డాక్టర్లు.. ఏఐ నిపుణులు.. ఒక్కరేంటి.. అన్ని రంగాలకు చెందిన నిపుణులు మనకు పిలిస్తే పలికేంత దూరంలోనే ఉంటారు… కానీ ఇంట్లో పైపు పగిలితే బాగు చేయడానికి ప్లంబర్ దొరకడు. కరెంటు పోతే ఎలక్ట్రీషియన్ దొరకడు. అలాంటి పరిస్థితి ఎదురైతే ఎలా ఉంటుంది..? రానున్న ఐదేళ్లలో మన దేశం ఈ తరహా సంక్షోభాన్నే చూడబోతోంది. ప్రపంచ లేబర్ మార్కెట్లలో రాబోతున్న మహా తుఫాను.. మన దేశంలో ఈ తరహా సర్వీసులకు తీవ్ర అంతరాయం కలిగించబోతోంది. […] -
Gold Recycle: మీ ఇంట్లో పాత బంగారం ఉందా? ఈ ఒక్క ట్రిక్‌తో మన జీవితాలే మారిపోవచ్చు!
Gold Recycling Explained: ఆ మధ్య ప్రధాన మంత్రి మోడీ.. సంవత్సరం పాటు బంగారం కొనొద్దని పిలుపునిచ్చారు కదా…? మరి భారతీయులంతా కొనడం మానేశారా..? గోల్డ్ మార్కెట్లు కాస్త డల్ అయిన మాట వాస్తవమే గానీ పూర్తిగా పడిపోలేదు.. మరి ఇంత కాలం కొన్న బంగారం సంగతేంటి..? ఇంటి బీరువాల్లో… బ్యాంకు లాకర్లలో నిరుపయోగంగా పడి ఉన్న బంగారాన్ని వాడుకలోకి తెచ్చామా ? దీని వల్ల ఎంత ఉపయోగం ఉందో మీకు తెలుసా…? రండి…గోల్డ్ రీసైక్లింగ్ అంటే […] -
Congress: సంచలన నిర్ణయాలు దిశగా కాంగ్రెస్.. భారీ నాయకత్వ మార్పుల వైపు అడుగులు?
కర్ణాటకలో నాయకత్వ మార్పిడి సాఫీగా ముగిసిన తర్వాత.. కాంగ్రెస్ అధిష్టానం ఇప్పుడు భారీ సంస్థాగత ప్రక్షాళనపై దృష్టి సారించింది. రాబోయే 2029 లోక్‌సభ ఎన్నికలే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టబోతోంది. ఏకంగా ఆరు రాష్ట్రాల పీసీసీ చీఫ్‌లను మార్చడంతో పాటు, ఏఐసీసీ స్థాయిలోనూ పెద్ద ఎత్తున ప్రక్షాళన చేయాలని అధిష్టానం భావిస్తోంది. అసలు కాంగ్రెస్ వ్యూహం ఏంటి? ఏయే రాష్ట్రాల్లో నాయకత్వ మార్పులు జరగబోతున్నాయి? పార్టీ భవిష్యత్తు కార్యచరణ ఎలా ఉండబోతోంది? పీసీసీ […] -
Abhishek Banerjee: రాళ్లు విసురుతున్నారు.. కోడిగుడ్లతో కొడుతున్నారు..మమత మేనల్లుడుపై ఎందుకింత కసి?
పశ్చిమ బెంగాల్ ప్రజలు ఒకప్పుడు కమ్యూనిస్టుల సుదీర్ఘ పాలనకు వ్యతిరేకంగా ఎలాగైతే మమతా బెనర్జీకి బ్రహ్మరథం పట్టారో… అదే ప్రజలు అంతే ఆగ్రహంతో తృణమూల్ కాంగ్రెస్‌ను పాతాళానికి తొక్కేశారు. అయితే ఎన్నికల్లో ఘోరంగా ఓడించినా బెంగాలీల ఆగ్రహం చల్లారినట్టు లేదు. అందుకే టీఎంసీ కార్యకర్తలు…నేతలు.. ఎక్కడ కనిపించినా దాడులకు దిగుతున్నారు. ముఖ్యంగా మమత హయాంలో ఓ రేంజ్లో చెలరేగిపోయిన ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్టీని టార్గెట్ చేసుకున్నారు. అభిషేక్ బెనర్టీ బెంగాల్ వీధుల్లో కనిపిస్తే చాలు..ఆయనపై రాళ్లు…కోడిగుడ్లు […] -
Suvendu Adhikari: బంగ్లాదేశ్ గుండెల్లో వణుకు పుట్టిస్తోన్న బెంగాల్ సీఎం.. అక్రమ వలసదారుల తాట తీస్తున్నాడుగా!
కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది..! జవాన్లు కాపలా కాస్తూనే ఉంటారు…! కానీ పదంటే పది నిమిషాల్లో మన దేశంలోకి చొరబడిపోతారు. బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా మన గడ్డపైకి వచ్చేస్తారు…! దశాబ్దాలుగా బంగ్లాదేశ్ నుంచి భారత్‌లోకి దర్జాగా అక్రమ చొరబాట్లు కొనసాగుతున్నాయి. అయితే ఇప్పుడు సీన్ మారిపోయింది. మమత పాలనపోయి సువేందు పగ్గాలు చేపట్టడంతో వలసదారులు పెట్టేబేడా సర్దుకుని పారిపోతున్నారు. ప్రభుత్వ కఠిన చర్యలకు తోడు.. డిటెన్షన్ క్యాంపులకు వెళ్లాల్సి వస్తుందన్న భయంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సరిహద్దుల వద్ద […] -
SIR Explained: ఓటరు జాబితా నుంచి మీ పేరు తొలగించారా? ఇకపై మీరు భారతీయులు కాదా?
Citizenship in India: ఓటరు జాబితాలో మీ పేరు లేదా? ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ – SIRలో భాగంగా జాబితా నుంచి మీ పేరును తొలగించారా? అయితే మీరు ఇకపై ఈ దేశ పౌరులు కారా? ఈ ప్రశ్నలన్నింటికీ సుప్రీంకోర్టు తాజాగా స్పష్టమైన సమాధానం ఇచ్చింది. ఓటర్ లిస్ట్ నుంచి పేరు తొలగించినంత మాత్రాన వారి పౌరసత్వం రద్దు అయినట్లు కాదని దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. అసలు సుప్రీంకోర్టు […] -
Bihar Election Results 2025: బీహార్‌లో ఎన్డీయే విజయానికి 10 కారణాలు ఇవే!
10 Reasons For NDA Grand Victory in Bihar: ఎంతో ఉత్కంఠగా సాగిన హైవోల్టేజ్ బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో.. ఎన్డీయే కూటమి మరోసారి జయభేరి మోగించింది. ఎగ్జిట్ పోల్ అంచనాలను నిజం చేస్తూ బీహార్ ఓటర్లు నితీశ్ కుమార్‌కు పట్టం కట్టారు. కాంగ్రెస్, ఆర్జేడీ నేతృత్వంలోని మహాఘట్ బంధన్ ను బీహార్ ప్రజలు తిరస్కరించారు. ఓవైపు వివాదాస్పద ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ, మరోవైపు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఫ్యాక్టర్.. ఇంకోవైపు కుల రాజకీయాలు.. […]
తాజావార్తలు
-
OTR: నేతల తన్నులాటలతోనే నందికొట్కూరులో టీడీపీ ఘోర ఓటమి?
-
Nagula Chavithi: నాగుల చవితి వేళ అద్భుతం.. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యక్షమైన నాగసర్పం!
-
CM Revanth Reddy : పిల్లల భవిష్యత్తే లక్ష్యం.. సీఎం రేవంత్ కీలక సందేశం
-
OTR: లెక్కలు మారుతున్నాయా? కంగారులో కూటమి.. వైసీపీ మాత్రం పక్కా లెక్కలతో ముందడుగు వేస్తుందా?
-
OTR: చంద్రబాబుకు జనసేన ఫిర్యాదు.. బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ కు అగ్నిపరీక్ష!
ట్రెండింగ్
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్‌పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!
-
Matt Henry: భారత్‌ను మడతెట్టెస్తున్న మాట్ హెన్రీ.. ఇది మూడోసారి.. ఏకంగా 8 వికెట్స్!
-
NZ vs IND 4th ODI: భారత్ ఖాతాలో చెత్త రికార్డు.. పాకిస్థాన్ సరసన టీమిండియా!
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్..!