Gold Recycle: మీ ఇంట్లో పాత బంగారం ఉందా? ఈ ఒక్క ట్రిక్‌తో మన జీవితాలే మారిపోవచ్చు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gold Recycling Explained: ఆ మధ్య ప్రధాన మంత్రి మోడీ.. సంవత్సరం పాటు బంగారం కొనొద్దని పిలుపునిచ్చారు కదా…? మరి భారతీయులంతా కొనడం మానేశారా..? గోల్డ్ మార్కెట్లు కాస్త డల్ అయిన మాట వాస్తవమే గానీ పూర్తిగా పడిపోలేదు.. మరి ఇంత కాలం కొన్న బంగారం సంగతేంటి..? ఇంటి బీరువాల్లో… బ్యాంకు లాకర్లలో నిరుపయోగంగా పడి ఉన్న బంగారాన్ని వాడుకలోకి తెచ్చామా ? దీని వల్ల ఎంత ఉపయోగం ఉందో మీకు తెలుసా…? రండి…గోల్డ్ రీసైక్లింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం.
విదేశాల నుంచి కొత్తగా బంగారాన్ని కొనుగోలు చేసే బదులు… మన దగ్గర ఇప్పటికే ఉన్న పసిడిని రీసైకిల్ చేయాలనేది ప్రధానమంత్రి ఆలోచన. పరిశ్రమ వర్గాల అంచనాల ప్రకారం.. భారతీయ గృహాలు.. ఆలయ ట్రస్టుల వద్ద ఉమ్మడిగా సుమారు 30వేల నుంచి 32వేల టన్నుల నిరుపయోగ బంగారం ఉంది. దీని నికర విలువ సుమారు 3.8 ట్రిలియన్ డాలర్లు. మన దేశ జీడీపీలో ఇది దాదాపు 80-89 శాతానికి సమానం. కొన్ని అంచనాలైతే ఈ సంఖ్యను ఏకంగా 35వేల టన్నులుగా చెబుతున్నాయి. ఇందులో దాదాపు 90 శాతం ఇళ్లలోని లాకర్లు.. బీరువాల్లో నిరుపయోగంగానే పడి ఉంది. ఈ అపారమైన సంపదలో కొంత భాగం అధికారిక ఆర్థిక వ్యవస్థలోకి వచ్చినా సరే.. దాని ప్రభావం చాలా అద్భుతాలనే సృష్టిస్తుంది.
Also Read
- Nepal VS India Explained: భారత్-నేపాల్ మధ్య మళ్లీ మంటలు.. ఈ రాజకీయ భూకంపానికి కారణం ఏంటి?
- Trump VS Netanyahu: ఫోన్ కాల్లో నెతన్యాహును బండబూతులు తిట్టిన ట్రంప్..! స్నేహితుడితో అమెరికా ప్రెసిడెంట్‌కు ఎక్కడ చెడింది?
- RUPEE vs DOLLAR: క్షణాల్లో ఫుడ్ బుక్ చేసుకోకపోతే పస్తులుండాల్సిందే.. విదేశాల్లో దయనీయ దుస్థితిలో భారతీయ విద్యార్థులు.. కారణాలు ఇవే!
- Weather News: మరో 5ఏళ్లు నరకమే.. ఐక్యరాజ్యసమితి హెచ్చరిక.. UN రిపోర్ట్‌లో ఏముంది?
గోల్డ్ రీసైక్లింగ్ అంటే ఏంటి?
భారతీయులకు పసిడితో ఉన్న అటాచ్మెంట్ కారణంగా… వేల టన్నుల బంగారం ఇళ్లకే పరిమితమవుతుంది. గోల్డ్ రీసైక్లింగ్ విధానాన్ని పూర్తిగా అర్థం చేసుకుంటే.. ఇందులో కొంత బంగారమైనా మార్కెట్లలోకి వస్తుంది. పాత ఆభరణాలు.. విరిగిపోయిన నగలు.. నాణేలు, పారిశ్రామిక వ్యర్థాలు.. ఎలక్ట్రానిక్ వస్తువుల నుంచి సేకరించిన బంగారాన్ని శుద్ధి చేసి తిరిగి స్వచ్ఛమైన పసిడిగా మార్చడాన్నే గోల్డ్ రీసైక్లింగ్ అంటారు. పాత బంగారాన్ని శుద్ధి చేయడం ద్వారా 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారంగా మార్చి దాన్ని తిరిగి సప్లై చైన్‌లోకి తీసుకురావడమే రీసైక్లింగ్ విధానం. ముందుగా లోహం స్వచ్ఛతను పరీక్షిస్తారు. ఆ తర్వాత దాన్ని కరిగించి 99.9 శాతం స్వచ్ఛతతో శుద్ధి చేస్తారు. ఇలా తయారైన బంగారాన్ని కొత్త ఆభరణాలు.. నాణేలు తయారు చేయడానికి మార్కెట్లోకి విడుదల చేస్తారు. ఇది పర్యావరణానికి కూడా ఎంతగానో మేలు చేస్తుంది. కొత్తగా బంగారాన్ని తవ్వితీసేందుకు భారీగా విద్యుత్ అవసరమవుతుంది. దీని ద్వారా పర్యావరణంపై తీవ్ర ప్రభావం పడుతుంది. రీసైక్లింగ్ వల్ల కొత్త మైనింగ్ అవసరం తగ్గుతుంది.
ప్రభుత్వం గోల్డ్ రీసైక్లింగ్‌ను ఇంతలా ఎందుకు ప్రోత్సహిస్తోందంటే దానికి ప్రధాన కారణం మన దిగుమతుల బిల్లు. భారతదేశ ఆర్థిక వ్యవస్థపై దీని ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. కేవలం 2025-26 ఆర్థిక సంవత్సరంలో పసిడి డిమాండ్‌ను తీర్చేందుకు భారత్ ఏకంగా 71.98 బిలియన్ డాలర్లు ఖర్చు చేసింది. ఇది 2024-25తో పోలిస్తే ఏకంగా 24 శాతం అధికం. మనం వినియోగిస్తున్న బంగారంలో దాదాపు 99 శాతం.. అంటే సుమారు 721 టన్నుల మేర విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటున్నాం. విదేశాల నుంచి వచ్చే ప్రతి ఔన్సు బంగారానికి విదేశీ మారక ద్రవ్యం చెల్లించాల్సి ఉంటుంది. ఇది మన దేశ వాణిజ్య లోటుపై విపరీతమైన ఒత్తిడి పెంచుతోంది. రీసైక్లింగ్ వల్ల దిగుమతులపై ఆధారపడటం తగ్గుతుంది.. విదేశీ మారక ద్రవ్య నిల్వలపై ఒత్తిడి కూడా ఆ మేరకు తగ్గుతుంది..స్పాట్
ఇళ్లలో ఎందుకు నిరుపయోగంగా ఉంది?
మన ఇళ్లు.. ఆలయాల్లో ఉన్న బంగారంలో కేవలం 1 శాతం పసిడిని ప్రతి సంవత్సరం రీసైకిల్ చేస్తే.. దిగుమతులు 25-30 శాతం వరకు తగ్గే అవకాశం ఉంది. ఇలా కొనసాగిస్తే… కాలక్రమేణా 200 నుంచి 300 మెట్రిక్ టన్నుల దిగుమతులను ఆదా చేస్తుందని బులియన్ బ్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ నివేదిక చెబుతోంది. అయితే ఇంత బంగారం ఇళ్లలో ఎందుకు నిరుపయోగంగా ఉండిపోతోంది? ఈ ప్రశ్నకు సమాధానం మన సంప్రదాయాల్లో ఉంది. వ్యక్తిగతంగా బంగారం కలిగి ఉన్న వాళ్లకు అది చాలా విలువైన వస్తువే. ఆర్థిక భద్రతగా.. ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొనే ఆయుధంగా వాళ్లకి పనికివస్తుంది. తరతరాలుగా వివాహాల్లో బహుమతులు, పొదుపు రూపంలో ఈ అపారమైన సంపద పోగుపడుతూ వస్తోంది. పాతబడిన.. పాడైపోయిన నగలు ఉన్నప్పటికీ వాటి పట్ల ఉన్న సెంటిమెంట్ కారణంగా అలానే ఉంచుతారు తప్ప వాటిని బయటకు తీయరు.
భారతీయుల ఆలోచనా విధానంలో ఈ మధ్య కాస్త మార్పు కనిపిస్తోంది. పాత బంగారాన్ని మార్చుకునే విధానం పట్ల ప్రజల్లో ఆసక్తి పెరుగుతోంది. పాత బంగారాన్ని ఇచ్చి కొత్త డిజైన్లు తీసుకునే అలవాటు ముందు నుంచి ఉన్నప్పటికీ ఇప్పుడు అది మరింత పారదర్శకమైన ఎక్స్ఛేంజ్ స్కీమ్‌ల రూపంలోకి మారుతోంది. రికార్డు స్థాయిలో పెరిగిన బంగారం ధరలు.. అలాగే 6 శాతం నుంచి 15 శాతానికి పెరిగిన దిగుమతి సుంకాలు ఈ మార్పునకు ప్రధాన కారణాలు. ప్రముఖ జ్యువెలరీ సంస్థలు ఆకర్షణీయమైన ఎక్స్ఛేంజ్ ఆఫర్లు ప్రకటిస్తుండటంతో ప్రజలు రీసైక్లింగ్ వైపు మొగ్గు చూపుతున్నారు. జ్యువెలర్స్ ఎక్స్ఛేంజ్ శాతం గతంలో 25-30 శాతం ఉండగా ఇప్పుడు ఏకంగా 70 శాతానికి పెరిగింది.
రిలయన్స్ రిటైల్ .. తనిష్క్.. సెన్కో లాంటి సంస్థలు కూడా భారీ వృద్ధిని నమోదు చేశాయి. ఈ పరిణామాలతో కొత్త బంగారం కొనుగోళ్ల వాల్యూమ్ సుమారు 30 శాతం తగ్గిందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ సైతం 2026 నాటికి కొనుగోలు డిమాండ్‌లో 10 శాతం మేర… అంటే సుమారు 50-60 టన్నుల క్షీణత ఉండొచ్చని అంచనా వేస్తోంది. అందరూ ఒక్క విషయం మాత్రం గుర్తు పెట్టుకోవాలి. పాత బంగారాన్ని రీసైక్లింగ్ చెయిన్‌లోకి తీసుకురావడం అంటే.. ఒక రకంగా దేశానికి సేవ చేయడం లాంటిదే..!
:ఫణి కుమార్ (NTV DIGITAL)
తాజావార్తలు
-
Gold Recycle: మీ ఇంట్లో పాత బంగారం ఉందా? ఈ ఒక్క ట్రిక్‌తో మన జీవితాలే మారిపోవచ్చు!
-
Train Safety Tips: ట్రైన్లో ఫ్రీ వైఫై వాడేవారికి బిగ్ షాక్.. ఈ తప్పు చేస్తే మీ బ్యాంక్ అకౌంట్ ఖాళీ!
-
Peddi Nizam : పెద్ది నైజాం బుకింగ్స్ ఓపెన్.. కానీ ఆ థియేటర్స్ ఇంకా పెండింగ్
-
Pandu Master: విశాఖలో రోడ్డు ప్రమాదం.. డాన్స్ మాస్టర్ పండు రెండు కాళ్లకు తీవ్ర గాయాలు!
-
Obsession Collections : 7 కోట్ల బడ్జెట్ తో 1000కోట్లకు పైగా కలెక్షన్లు… బాక్సాఫీస్ లో అదరగొడుతన్న హారర్ థ్రిల్లర్
ట్రెండింగ్
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్‌తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!