తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. కేసులు భారీ స్థాయిలో నమోదవుతున్న నేపథ్యంలో ఆంక్షలను కఠినం చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలో మాస్క్ ను తప్పనిసరి చేశారు. మాస్క్ లేకుండా బయట కనిపిస్తే భారీ జరిమానా విధిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటె తాజాగా రాష్ట్ర ప్రభుత్వం కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో కొత్తగా 3307 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య […]
ఇండియాలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజువారీ పాజిటివ్ కేసులు రికార్డ్ స్థాయిలో నమోదవుతున్నాయి. ఈరోజు ఎప్పుడు లేనంతంగా కేసులు నమోదయ్యాయి. కేంద్రం రిలీజ్ చేసిన కరోనా బులెటిన్ ప్రకారం దేశంలో కొత్తగా 2,00,739 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,40,74,564కి చేరింది. ఇందులో 1,24,29,564 మంది దేశంలో కోలుకొని డిశ్చార్జ్ కాగా, 14,71,877 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో ఇండియాలో 93,528 మంది కోలుకొని […]
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు భారీ స్థాయిలో నమోదవుతున్నాయి. కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్న నేపథ్యంలో టీకాలను వేగంగా అందించాలని, కరోనా కట్టడికి టీకా వేయడం ఒక్కటే సురక్షిత మార్గం అని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొన్నది. ఆక్స్ ఫర్డ్ అస్త్రజెనకా టీకా తో పాటుగా మరికొన్ని టీకాలు అందుబాటులోకి వచ్చాయి. అయితే, ఆక్స్ ఫర్డ్ టీకా వినియోగంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. టీకా తీసుకుంటే రక్తం గడ్డగడుతుందని పలు నివేదికలు పేర్కొన్న సంగతి తెలిసిందే. దీంతో ఐరోపాలోని కొన్ని దేశాలు ఈ టీకా […]
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. కరోనా కేసులు భారీ స్థాయిలో నమోదవుతున్న నేపథ్యంలో అధికారులు ప్రజలను అలర్ట్ చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటె వరంగల్ జిల్లాలోని పర్వతగిరి మండలంలోని ఏనుగల్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మంగళవారం రాత్రి మరణించాడు. మరణించిన వ్యక్తికీ బుధవారం రోజున అంత్యక్రియలు నిర్వహించారు. అయితే, అంత్యక్రియలు నిర్వహించిన తరువాత ఆశా వర్కర్ మొబైల్ కు ఓ మెసేజ్ వచ్చింది. మరణించిన వ్యక్తికీ కరోనా పాజిటివ్ వచ్చినట్టు మెసేజ్ వచ్చింది. అయితే, అప్పటికే మరణించిన వ్యక్తికీ అంత్యక్రియలు నిర్వహించడం, ఆ […]
విశాఖపట్నంలోని మధురవాడలో ఓ ప్రమాదం చోటు చేసుకుంది. ఆదిత్య ఫార్చూన్ టవర్లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. ఆదిత్య ఫార్చూన్ టవర్ లోని ప్లాట్ నెంబర్ 505 లో ఈ ప్రమాదం జరిగింది. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులుగా గుర్తించారు. మృతులు బంగారునాయుడు, నిర్మల, దీపక్, కశ్యప్ లుగా గుర్తించారు. అయితే, ఘటనా స్థలంలో రక్తపు మరకలు ఉండటంతో స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. హత్యచేసి ప్రమాదంగా చిత్రీకరించి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు […]
పందెం కట్టాలన్నా, చప్పట్టు కొట్టాలన్నా లేక సవాళ్లు చేయాలన్నా ఇరు పక్షాలు ఉండాలి. ఒకరిని ఒకరు సవాలు చేయగరు. అంతేగాని మనకు మనమే సవాలు విసిరి అవతలి వారు అందుకోలేదు గనక పై చేయి సాధించినట్టు హడావుడి చేస్తే సమాజంలో చెల్లుబాటు కాదు. ఒక వివాదంలో తమ పాత్ర గురించిన ప్రమాణం చేయడం అవతలివారిని చేయమని సవాలు చేయడం అలాటిదే. ఇంతకూ ఏ దేవత మీద దేవుని మీద ప్రమాణం చేసినా చట్టం ముందు చెల్లుబాటు కాదు. ఈ లోగా […]
హరిద్వార్ లో ప్రస్తుతం కుంభమేళా జరుగుతున్నది. ప్రపంచంలోనే అత్యంత పెద్ద వేడుకల్లో కుంభమేళా కూడా ఒకటి. ఇలాంటి వేడుకలకు కోట్లాది మంది భక్తులు హాజరవుతుంటారు. నాలుగు నెలలపాటు ఈ వేడుక జరగాల్సి ఉన్నా, కరోనా కారణంగా నెలకు కుదించారు. కరోనా నిబంధనలు పాటిస్తూ కుంభమేళాను నిర్వహిస్తున్నారు. అయితే, కుంభమేళలో శాహిస్నాన్ ముఖ్యమైనది. ఈ శాహి స్నాన్ వేడుకలో లక్షలాది మంది సాధువులు పాల్గొంటారు. బుధవారం రోజున జరిగిన ఈ రాజస్నానం వేడుకలో సుమారుగా 13.5 లక్షల మంది సాధువులు, నాగా సాధువులు పాల్గొన్నారని అధికారులు చెప్తున్నారు. అయితే, […]
వైఎస్ షర్మిల ఏప్రిల్ 9 వ తేదీన ఖమ్మంలో కొత్త పార్టీని ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. తన పార్టీ పేరు, జెండా అజెండాను వైఎస్ఆర్ జయంతి రోజున ప్రకటిస్తానని చెప్పారు. ఇక నిరుద్యోగుల కోసం ఆమె ఈరోజు నుంచి మూడు రోజులపాటు నిరాహారదీక్ష చేయబోతున్నారు. ప్రభుత్వం వెంటనే నోటిఫికేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆమె దీక్షకు దిగుతున్నారు. ఇక ఇదిలా ఉంటె, త్వరలోనే రాష్ట్రంలో ఖమ్మం మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని వైఎస్ షర్మిల […]
మేషం : ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, మెకానికల్ రంగాల వారికి పనిభారం అధికం. వృత్తి ఉద్యోగాల్లో గణనీయమైన పురోభివృద్ధి సాధిస్తారు. మీ చిత్తశుధ్ధి నిజాయితీలకు మంచి గుర్తింపు లభిస్తుంది. వృత్తులవారికి బాధ్యతలు పెరుగుతాయి. మీ ప్రయత్నాలను కొంతమంది పక్కదారి పట్టించే ఆస్కారం ఉంది. జాగ్రత్త వహించండి. వృషభం : ఆర్థిక, కుటుంబ సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. గృహ మరమ్మతులు, మార్పులు, చేర్పులు అనుకూలిస్తాయి. ప్రతి విషయంలోనూ ఆచితూచి వ్యవహరించడం మంచిది. స్త్రీలు పనివారలతో సమస్యలు ఎదుర్కొంటారు. రుణం […]