Vaazha 2: తెలుగులోకి మలయాళ 100 కోట్ల బాక్సాఫీస్ షేకర్ ‘వాళా 2’.. రిలీజ్ డేట్ ఫిక్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vaazha 2: టాలీవుడ్ ప్రేక్షకులకు ఎప్పుడూ వైవిధ్యమైన సినిమాలను అందించడంలో ముందుండే షైన్ స్క్రీన్స్ సాహు గారపాటి, మరో క్రేజీ ప్రాజెక్ట్‌తో మన ముందుకు వస్తున్నారు. సాహు సహ నిర్మాతగా వ్యవహరించగా కేరళలో రికార్డులు సృష్టించి, కేవలం వారం రోజుల్లోనే 100 కోట్ల క్లబ్‌లో చేరిన మలయాళ బ్లాక్ బస్టర్ ‘వాళా 2’ ఇప్పుడు తెలుగులో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. మలయాళంలో యువతను ఉర్రూతలూగించిన ఈ సినిమాని ఏప్రిల్ 24న తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నట్లు నిర్మాత సాహు గారపాటి అధికారికంగా వెల్లడించారు. ఇప్పటికే ఈ ఫ్రాంచైజీలోని మొదటి భాగం ఓటీటీలో తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అందులోని సహజమైన హాస్యం, నేటి తరం Gen X ఆలోచనలకు తగ్గట్టుగా ఉండే కథనం తెలుగు రాష్ట్రాల్లో ఒక బలమైన ఫ్యాన్ బేస్‌ను క్రియేట్ చేసింది. దీంతో సీక్వెల్ కోసం టాలీవుడ్ ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
INDIA Bloc: ఇండియా కూటమి సంచలన నిర్ణయం.. డీలిమిటేషన్ బిల్లు వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటన
Also Read
సావిన్ ఎస్.ఏ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హషీర్ హెచ్, అలన్ బిన్ సిరాజ్, అజిన్ జాయ్, వినాయక్ వి వంటి యంగ్ టాలెంట్ తమ నటనతో అదరగొట్టారు. వీరి మధ్య పండిన కెమిస్ట్రీ, కామెడీ టైమింగ్ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. విపిన్ దాస్ కథను అందించగా, ఐకాన్ స్టూడియోస్ మరియు షైన్ స్క్రీన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. విడుదలైన తొలి వారంలోనే మలయాళంలో 100 కోట్ల మైలురాయిని దాటి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది. అఖిల్ లైలాసురన్ విజువల్స్, కన్నన్ మోహన్ ఎడిటింగ్ సినిమా స్థాయిని పెంచాయి. తెలుగు బాక్సాఫీస్ వద్ద కూడా ఈ మలయాళ సెన్సేషన్ అదే స్థాయి మ్యాజిక్ రిపీట్ చేస్తుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి ఈ సమ్మర్‌లో ‘వాళా 2’ మన కుర్రాళ్లను ఏ మేరకు అలరిస్తుందో చూడాలంటే ఏప్రిల్ 24 వరకు వేచి చూడాల్సిందే.
Rohith Sharma: ముంబయ్ ఇండియన్స్‌కు బిగ్ షాక్.. రోహిత్ శర్మ దూరం..
తాజావార్తలు
-
OTR: సీఎం టూర్లో బయటపడ్డ కాంగ్రెస్ విభేదాలు
-
Nara Lokesh: నెల రోజుల్లో డీఎస్సీ 2.0 నోటిఫికేషన్.. ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి లోకేష్!
-
Maharashtra Tragedy: బీచ్ ట్రిప్‌లో విషాదం.. నీటిలో మునిగి 8 మంది స్టూడెంట్స్ మృతి..
-
OTR: ఉమ్మడి నల్గొండలో రెడ్డి ఆధిపత్యం? కాంగ్రెస్‌లో బీసీ నేతల అసంతృప్తి!
-
Common Pass : హైదరాబాద్ నగరవాసులకు గుడ్ న్యూస్.. మెట్రో, ఆర్టీసీకి ఒకే పాస్
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?