ఏపీలో సంక్షేమ పథకాలు వేగంగా అమలవుతున్నాయి. లాక్‌డౌన్ సమయంలో పేదలు ఇబ్బంది పడకుండా ఉండేందుకు వివిధ రకాల పథకాలను అమలుచేస్తున్నారు. ఇందులో భాగంగా వైఎస్ఆర్ చేయూత రెండో విడత పథకాన్ని ఈరోజు అమలు చేయబోతున్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి వర్చువల్‌గా సీఎం జగన్ ఈ పథకాన్ని ప్రారంభించబోతున్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో 23,14,342 మంది మహిళలకు లబ్ది చేకూరుతుంది. లబ్దిదారుల ఖాతాల్లో రూ.4,339.39 కోట్ల రూపాయలను సీఎం జగన్ జమచేయబోతున్నారు. గతేడాది ఈ […]
కరోనా మహమ్మారి నుంచి బయటపడాలి అంటే వ్యాక్సిన్ తీసుకోవడం తప్పనిసరి అన్న విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా కరోనా నుంచి బయటపడేందుకు అన్ని దేశాల్లో వ్యాక్సిన్ వేస్తున్నారు. కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండటంతో ప్రపంచ పర్యాటకులకు దేశాలు స్వాగతం పలుకుతున్నాయి. అయితే, ఒక్కోదేశం ఒక్కోదేశానికి ఒక్కోవిధంగా నిబంధనలు విధిస్తున్నది. ఈ నిబంధనల ప్రకారమే నడుచుకోవాలి. ఇండియా నుంచి వచ్చే పర్యాటకులకు కొన్ని నిబంధనలు విధించాయి. Read: మళ్లీ తెరపైకి థర్డ్ ఫ్రంట్..! మోడీని ఢీకొట్టే నేత కోసం వేట..? […]
భారతదేశంలోని అన్ని ప్రాంతాల్లోకి భారతీయులకు అనుమతి ఉంటుంది. అయితే, కొన్ని చోట్లకు మాత్రం భారతీయులను అనుమతించరు. ఆయా ప్రాంతాల్లో కేవలం విదేశీయులను మాత్రమే అనుమతిస్తారట. బెంగళూరులోని శాంతినగర్ ప్రాంతంలో యూనో ఇన్ అనే హోటల్ ఉన్నది. ఈ హోటల్ లోకి కేవలం జపనీయులకు మాత్రమే ప్రవేశం ఉంటుంది. మిగతా వారిని ఈ హోటల్‌లోకి అనుమతించరు. Read: గుడ్డివాడి పాత్రలో ‘ఐకాన్’ స్టార్! అదే విధంగా హిమాచల్ ప్రదేశ్‌లోని కాసోల్ ప్రాంతంలో ఫ్రీకాసోల్ కేఫ్ ఉన్నది. ఈ […]
ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధం తప్పితే చర్చలు లేవని చెప్పే కిమ్ నోటివెంట చర్చలమాట వచ్చింది. చర్చలకైనా, యుద్ధానికైనా సిద్దంగా ఉండాలని కిమ్ తన సేనలతో చెప్పినట్టు కొరియా అధికారిక మీడియా ప్రకటించింది. దీనిపై అమెరికా సానుకూలంగా స్పందించింది. కమ్ వ్యాఖ్యలు ఆసక్తికరమైన సంకేతంగా భావిస్తున్నామని, అయితే, అణ్వాయుధాలను త్యజించే అంశాలపై కొరియా రాజధాని ప్యాంగ్యాంగ్ నుంచి నేరుగా సంకేతాలు వచ్చేవరకు ఎదురు చూస్తామని అమెరికా పేర్కొన్నది. Read: హరి హర వీరమల్లు: […]
ఇటీవల పశ్చిమ బెంగాల్‌కు ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకున్నది. ఎన్నికల తరువాత రాష్ట్రంలో హింసాత్మక సంఘటనలు అనేకం చోటుచేసుకున్నాయి. ఈ సంఘటనలకు ప్రధానకారణం ప్రభుత్వమే అని, మమత సర్కార్ అండదండలతో తృణమూల్ గూండాలు రెచ్చిపోతున్నారని గతంలో ప్రతిపక్షస్థానంలో ఉన్న బీజేపీ ఆరోపించింది. Read: ఎన్టీఆర్, రామ్ చరణ్ చిత్రాలకు అతడే సంగీత దర్శకుడు! బెంగాల్ గవర్నకు ఫిర్యాదు కూడా చేశారు. దీనిపై గవర్నర్ […]
కేరళలోని కోచీ తీరంలో ఓ రహస్యదీవిని గూగుల్ మ్యాప్ గుర్తించింది. సముద్రగర్భంలో ఈ దీవి ఉండటంలో కనుగొనేందుకు చాలా సమయం పట్టింది. గూగుల్ మ్యాప్ ఈ దీవిని గుర్తించడంతో పరిశోధకులు ఈ దీవిపై దృష్టిసారించారు. కోచి తీరానికి 7 కిలోమీటర్ల దూరంలో ఈ దీవి ఉన్నట్టు చెల్లనమ్ కర్షిక టూరిజం సంస్థ తెలిపింది. తీరయెక్క అవక్షేపం, కోతకు గురికావడం వలన ఈ దీవి ఏర్పడి ఉండవచ్చని టూరిజం సంస్థ తెలిపింది. సుమారు 8 కిలోమీటర్ల పొడవు, 3.5 […]
తమిళనాడులో ఓ దారుణం చోటుచేసుకుంది. కొడుకుకి దెయ్యం పట్టిందని ఓ తల్లి కొట్టి చంపింది. ఈ సంఘటన తిరువణ్ణామలై జిల్లాలోని అరణిలో జరిగింది. ఏడేళ్ల బాలుడికి దెయ్యం పట్టిందని, తల్లితో పాటుగా మరో ముగ్గురు మహిళలు కలిసి బాలుడిని చిత్రహింసలు పెట్టారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చేలోపే చిత్రహింసలతో బాలుడు మృతి చెందాడు. దీంతో తల్లితో సహా ముగ్గురు మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాలుడి తల్లి మానసిక […]