తమిళనాడులో ఓ దారుణం చోటుచేసుకుంది. కొడుకుకి దెయ్యం పట్టిందని ఓ తల్లి కొట్టి చంపింది. ఈ సంఘటన తిరువణ్ణామలై జిల్లాలోని అరణిలో జరిగింది. ఏడేళ్ల బాలుడికి దెయ్యం పట్టిందని, తల్లితో పాటుగా మరో ముగ్గురు మహిళలు కలిసి బాలుడిని చిత్రహింసలు పెట్టారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చేలోపే చిత్రహింసలతో బాలుడు మృతి చెందాడు. దీంతో తల్లితో సహా ముగ్గురు మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాలుడి తల్లి మానసిక పరిస్థితి సరిగా లేదని, అందుకే ఆమె అలా ప్రవర్తించినట్టు బంధువులు చెబుతున్నారు.