ఇటీవల కాలంలో బుల్లెట్టు బండి పాట ఎంత ఫేమస్ అయిందో చెప్పక్కర్లేదు. ఓ నవ వధువు ఈ పాటకు చేసిన డ్యాన్స్‌తో పాట హైలైట్ అయింది. ఆ వీడియో ఫేమస్ కావడంతో ఆ పాటకు అనేక మంది డ్యాన్స్ చేస్తూ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అయితే, ఈ పాట మాములు జనాలకు మాత్రమే కాదు, అటు జంతువులకు కూడా విపరీతంగా నచ్చుతున్నది. ఎంతగా అంటే, ఆ పాట వింటేనే పాలు తాగేంతగా నచ్చుతుందట. మహబూబాబాద్ లోని కంబాలపల్లె గ్రామంలో ఓ వ్యక్తి కిరాణా దుకాణం నడుపుతున్నాడు. కోతుల బెడద ఎక్కువగా ఉండడంతో కొండముచ్చును తెచ్చి పెంచుతున్నాడు. దానికి ఓ పిల్ల కూడా ఉంది. కొన్ని రోజుల క్రితం తల్లి అనారోగ్యంతో మరణించింది. అప్పటి నుంచి ఆ పిల్ల పాలు తాగడం మానేసింది. ఓ రోజు మొబైల్‌లో బుల్లెట్టు బండి పాట విన్నది. ఆ పాట వింటూనే ఆ కొండముచ్చు పాలు తాగేసిందట. అప్పటి నుంచి కొండముచ్చుకు పాలు ఇవ్వాలి అనుకున్నప్పుడు ఆ పాటను ప్లే చేస్తున్నారు.
Read: వైరల్: ఇది డ్రోన్ కాదు… చిలుకే… వీడియో ఎలా తీసిందో చూశారా…!!