రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. బద్ధ శత్రువులు కూడా మిత్రులై పోతారు. ఆప్త మిత్రులు కూడా శత్రువులుగా మారిపోతారు. అందుకే శాశ్వత మిత్రత్వం, శాశ్వత శత్రుత్వం రాజకీయాలకు పనికిరాదంటారు. అమరావతిలో ప్రారంభమయిన రైతుల మహాపాదయాత్ర సందర్భంగా అరుదైన సంఘటన జరిగింది. అమరావతి రైతుల మహా పాదయాత్రకు సంఘీభావం తెలిపాయి వైసీపీయేతర పార్టీలు. మాజీకేంద్రమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరి ర్యాలీగా బయలుదేరారు. ఈ క్రమంలో రేణుకా చౌదరికి స్వాగతం పలికేందుకు, హారతి పట్టేందుకు మూలపాడులో కాంగ్రెస్ మహిళా […]
అమరావతిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా సీఎం వైఎస్ జగన్.. ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. పొట్టి శ్రీరాములు త్యాగఫలంతో పాటు అనేక మంది పోరాట ఫలితంతో ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మనందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. అదే అంకితభావం, చిత్తశుద్ధి, దృఢ సంకల్పం కొనసాగించడం ద్వారా రాష్ట్రాన్ని సంక్షేమం, అభివృద్ధి పరంగా ముందుకు తీసుకెళ్దామన్నారు. అనంతరం […]
ఇండియాలోని అరుణాచల్ ప్రదేశ్‌పై చైనా ఎప్పటి నుంచో కన్నేసింది. ఎలాగైనా ఆ రాష్ట్రాన్ని తన దేశంలో కలిపేసుకొవాలని చూస్తున్నది. లద్దాఖ్ లో కిరికిరి చేస్తూనే, చైనా అరుణాచల్ ప్రదేశ్ బోర్డర్‌లో బలగాలను మొహరిస్తూ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. అయితే, చైనా ఇప్పడు కొత్త ఎత్తులు వేస్తున్నది. చైనా నుంచి ఇండియాలోని అరుణాచల్ ప్రదేశ్‌లోకి ప్రవేశంచే నదులను కలుషితం చేస్తున్నది. దీని వలన నదులు నల్లగా మారిపోతున్నాయి. అందులో నివశించే చేపలు, ఇతర జీవులకు ఆక్సీజన్ అందక వేల […]
ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ ప్రభత్వం ఏర్పాటయ్యి మూడు నెలలు గడిచినా ఇప్పటి వరకు ప్రపంచంలోని ఏ దేశం కూడా అధికారికంగా తాలిబన్ ప్రభుత్వాన్ని గుర్తించలేదు. ఆఫ్ఘన్ ప్రజా ప్రభుత్వాన్ని కూల్చివేసి తాలిబన్లు దేశాన్ని ఆక్రమించుకున్నారు. అమెరికా సైన్యం పూర్తిగా నిష్క్రమించక ముందే తాలిబన్లు ఆ దేశాన్ని ఆక్రమించుకున్నారు. పాక్, చైనా, రష్యా దేశాలు మాత్రమే ప్రస్తుతం ఆ దేశంతో సంబంధాలు కొనసాగిస్తున్నాయి. ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నాయి. అయితే, ఆఫ్ఘన్ ప్రజా ప్రభుత్వం కూలిపోయిన వెంటనే అంతర్జాతీయంగా ఆ దేశానికి […]
ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి ప్రారంభం కానుంది. ఈ ఏడాది మే 31న ఎమ్మెల్సీల పదవీ కాలం ముగిసింది. ఈ స్థానాలకు గతంలోనే ఎన్నికలు జరగాల్సి ఉంది. కరోనా వ్యాప్తి కారణంగా ఎన్నికలను వాయిదా వస్తూ వచ్చింది. ఏపీలో మూడు స్థానాలకు ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను విడుదల చేసింది. నవంబరు 9న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. నవంబరు 19న పోలింగ్ జరుగుతుంది. అదే రోజున ఫలితాలను ప్రకటిస్తారు. ఏపీలో మే 31న ఎమ్మెల్సీల పదవీ కాలం […]
హైదరాబాద్ లో రోడ్డు ప్రమాదాలు బాగా పెరిగిపోయాయి. మితిమీరిన వేగంతో వాహనాలను నడపడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయి. రాజేంద్రనగర్ పీవీ ఎక్స్‌ప్రెస్ రోడ్డుపై కారు బీభత్సం కలిగించింది. 120 పిల్లర్ వద్ద డివైడర్ ను ఢీ కొట్టి రోడ్డు పై పల్టీలు కొట్టి రోడ్డుకు అడ్డంగా పడిపోయింది ఓ కారు. దీంతో అందులో ప్రయాణిస్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. రోడ్డుకు అడ్డంగా కారు పడి పోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ […]
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉప పోరు రసవత్తరంగా సాగింది. అయితే, తెలంగాణలోని హుజురాబాద్ తో పోలిస్తే ఏపీలోని బద్వేలులో అంతగా జనం ఆసక్తి చూపించలేదు. బద్వేల్ లో టీడీపీ, జనసేన పోటీ నుంచి తప్పుకోవడంతో పోటీ అంతగా కనిపించలేదు. అధికార వైసీపీ అభ్యర్ధిని పరిగణనలోకి తీసుకున్నారు. గత ఎన్నికలతో పోలిస్తే 9 శాతం తక్కువగా పోలింగ్ నమోదైంది. 2019 ఎన్నికల్లో 76.37 శాతం నమోదు కాగా.. ఈ ఉప ఎన్నికల్లో పోలింగ్ శాతం 68.12గా నమోదైంది. బద్వేలు […]
ఆరోగ్యమే మహాభాగ్యం. ఉదయపు నడక ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. అందుకే డాక్టర్లు ఉదయం వాకింగ్ చేయాలంటున్నారు. స్వంత రాష్ట్ర పర్యటనలో వున్న భారత ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు మార్నింగ్ వాక్ చేశారు. విజయవాడ పర్యటనలో ఉన్న వెంకయ్యనాయుడు ఉదయపు నడకతో ఉత్సాహంగా కనిపించారు. ఆత్కూరు స్వర్ణభారత్ ట్రస్ట్ లో శిక్షణ పొందుతున్న విద్యార్థులతో కలిసి వ్యాయామం చేశారు. వారికి నడక ప్రాధాన్యతను వివరించారు. ఎంత బిజీగా వున్న ఉదయం నడక సాగించాలని వెంకయ్య వారికి సూచించారు. ఆయనే […]
కర్నూలు జూపాడుబంగ్లాలో అతిసార వ్యాధి ప్రబలింది. దీంతో వందలాదిమంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాంతులు,విరోచనాలు తీవ్ర అస్వస్థతకు గురైన 20 మందిని నందికొట్కూరు ఆసుపత్రికి తరలించారు. వారిలో ఆరుగురు పిల్లలు వున్నారు. వీరి పరిస్థితి విషమంగా వుందని డాక్టర్లు చెబుతున్నారు.జూపాడుబంగ్లాలోని నీలిపల్లె పేటకు చెందిన 20 మంది నందికొట్కూరు ఆసుపత్రిలో చేరారు. ఆరుగురు ఆందోళనకరంగా వుండడంతో వారి తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. మంచి నీరు కలుషితం కావడం వల్లే అతిసార ప్రబలుతోందని స్థానికులు చెబుతున్నారు.
తెలంగాణలో చిరుతలు అలజడి కలిగిస్తున్నాయి. ప్రతి రోజూ ఏదో ఒక జిల్లాలో చిరుతలు నడిరోడ్లపైకి, వ్యవసాయ క్షేత్రాల్లోకి వస్తున్నాయి. సంగారెడ్డి జిల్లా, కల్హేరు మండలం నగాధర్ శివారులో చిరుత పులి తిరుగుతున్నట్టు రైతులు తెలిపారు. దీంతో ఆ ప్రాంతంలో కలకలం రేగింది. సీసీ కెమెరాలో రికార్డ్ అయిన చిరుత పులి కదలికలను రైతులు విడుదల చేయడంలో సమీపంలోని రైతులు ఆందోళనకు గురవుతున్నారు. రైతు రామయ్య కు చెందిన లేగదూడను చంపేసింది ఆ చిరుత పులి. కల్హేరు సిర్గాపూర్ […]