టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ నేత విజయసాయిరెడ్డి మరోసారి ఫైర్ అయ్యరు. కుప్పం ప్రజలు తనకు వెన్నుపోటు పొడిచారంటూ చంద్రబాబు ఆరోపించడం ఏంటని ట్విట్టర్ వేదికగా విజయసాయిరెడ్డి చంద్రబాబుపై మండిపడ్డారు. వెన్నుపోటుల గురించి చంద్రబాబు చెప్పడమేంటని ఆయన అన్నారు. పార్టీ నేతలే కుప్పంలో తనకు వెన్ను పోటు పొడిచారంటూ వెన్నుపోట్ల పితామహుడు చంద్రబాబు వాపోతున్నాడు. కోవర్టులను సహించనంటున్నాడు. నీవు నేర్పిన విద్యే నీరజాక్షా అంటున్నారు కార్యకర్తలు. ఎన్టీఆర్‌కు నువ్వు పొడిచిన పోటుతో పోలిస్తే కుప్పానిదీ ఒక పోటా […]
తెలంగాణ రాష్ట్రానికి చెందిన, సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న న్యాయవాది పి.నిరూప్ను సీనియర్ న్యాయవాదిగా సుప్రీంకోర్టు నియమించింది. తెలంగాణ నుంచి సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదిగా నియమితులైన తొలి న్యాయవాది నిరూప్. నిరూప్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రముఖ న్యాయవాది, మాజీ స్పీకర్, మంత్రి దివంగత పి. రామచంద్రారెడ్డి కుమారుడు. ఆయన మెదక్ జిల్లాకు చెందినవారు. 1985లో బార్ కౌన్సిల్లో చేరిన తర్వాత సంగారెడ్డిలోని మున్సిఫ్ కోర్టులో ప్రాక్టీస్ చేసి సుప్రీం కోర్టుకు వెళ్లారు. 2017-2018కి ఢిల్లీలోని మేఘాలయ, షిల్లాంగ్ రాష్ట్రానికి […]
హైదరాబాద్ పాతబస్తీలో ఎంఐఎం ఎమ్మెల్యే ముంతాజ్ ఖాన్ దౌర్జన్యానికి పాల్పడ్డారు. చార్మినార్ బస్ డిపో సమీపంలో యువకుడి పై ఎమ్మెల్యే దాడి చేయడం కలకలం రేపుతోంది. ఎమ్మెల్యే కనిపిస్తే నమస్తే పెట్టలేదు అంటూ ముంతాజ్ ఖాన్ హంగామా చేశారు. అర్ధ రాత్రి 12 గంటలకు గల్లీలో కూర్చున్న యువకుడు జిలానీపై చేయిచేసుకున్నారు ఎమ్మెల్యే ముంతాజ్ ఖాన్. ఎమ్మెల్యే ముంతాజ్ ఖాన్ దాడి పై హుస్సేని అలం పీఎస్ లో జిలానీ ఫిర్యాదు చేశాడు. ఎడమ చెవి దవడ […]
తెలంగాణపై బీజేపీ అధినాయకత్వం పూర్తి స్థాయిలో దృష్టి పెట్టిందని ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ ఈడీ నోటీసుల భయంతోనే సీఎం కేసీఆర్ ఢిల్లీకి పరుగులు పెట్టారన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని, బీజేపీలోకి ఎవ్వరు వచ్చిన చేర్చుకుంటామని ఆయన అన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని సంచలనాలు ఉంటాయని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ రాష్ర్టంలో ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆయన వెల్లడించారు. పార్టీ ఆదేశిస్తే […]
తూర్పుగోదావరి జిల్లాలో జగన్ ఫ్లెక్సీలు వైరల్ అవుతున్నాయి. అనపర్తి కెనాల్ రోడ్ మరమ్మత్తులు చెయ్యాలంటూ గుర్తుతెలియని వ్యక్తులు వివాదాస్పద ప్లెక్సీలు ఏర్పాటుచేశారు. జగన్ అన్న ఉన్నాడు జాగ్రత్త అంటూ గోతుల వద్ద ప్లెక్సీలు ఏర్పాటు చేయడం హాట్ టాపిక్ అవుతోంది. అనపర్తి – బలభద్రపురం మధ్య పలుచోట్ల సీఎం జగన్ ఫోటోలతో ఉన్న ప్లెక్సీలు దర్శనం ఇచ్చాయి. ఈ ఫ్లెక్సీలు వివాదాస్పదంగా ఉండటంతో రోడ్డుపై వున్న ప్లెక్సీలను తొలగించారు అనపర్తి పోలీసులు. స్వాధీనం చేసుకున్న ప్లెక్సీలను వాహనంలో […]
ప్రపంచ వ్యాప్తంగా కరోనాతో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నామనుకున్న సందర్భంలో కొత్త కరోనా వేరింయట్ ఒమిక్రాన్‌తో మళ్లీ గతంలోని లాక్ డౌన్ లాంటి పరిస్థితులు పునరావృతం అవుతున్నాయి.తాజాగా ఒమిక్రాన్ వేరింయట్‌పై పలు ఆసక్తికర విషయాలను శాస్ర్తవేత్తలు బయటపెట్టారు. ఒమిక్రాన్ వేరియంట్ పై ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు అధ్యయనం చేపడుతున్నారు. ఈ ఒమిక్రాన్ వేరియంట్‌తో రీఇన్ఫెక్షన్ల ముప్పు ఎక్కువగా ఉందని జొహెన్స్‌బర్గ్ శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది. గతంలో ఇన్ఫెక్షన్ కారణంగా వెలువడిన రోగనిరోధక శక్తిని కూడా తట్టుకునే లక్షణం ఒమిక్రాన్‌కు ఉందని వారు […]
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి స్థానంలో సెలక్టర్లు రోహిత్ శర్మను టీంఇండియా సారథిగా నియమించిన విషయం తెల్సిందే.. ఇప్పటికే రోహిత్ ముంబై ఇండియన్స్ సారథిగా ఐదు టైటిల్‌ను ఆ జట్టుకు అందించాడు. రోహిత్ శర్మపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీంఇండియా కెప్టెన్‌గా రోహిత్ శర్మ రాణించగలడని గంగూలీ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్‌కు మంచి రికార్డు ఉందని తెలిపారు. ఆసియా కప్‌లోనూ టీంఇండియాకు సారథిగా వ్యవహరించి […]
నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తుంది. నందమూరి బాలకృష్ణకు సినిమాకు తొలిసారిగా వంద కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించింది. డిసెంబర్ 2న విడుదలైన అఖండ పది రోజుల్లోనే రూ.100 కోట్ల గ్రాస్ మార్క్‌ను అందుకుని ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యానికి గురి చేశాయి. ఇప్పటి వరకు బాలయ్య కెరీర్లో ఎక్కువ గ్రాస్‌ను కలెక్ట్ చేసిన సినిమాగా గౌతమీ పుత్ర శాతకర్ణి నిలిచింది. కానీ తొలి వారంలోనే ఆ సినిమా కలెక్షన్లను అఖండ దాటేసి ఇప్పుడు […]
ఏపీలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఐర్లాండ్ నుంచి ముంబాయి మీదుగా విశాఖకు వచ్చిన ప్రయాణికుడికి ఒమిక్రాన్ వైరస్ సంక్రమించింది. విజయనగరం జిల్లాలో రెండు దఫాలుగా ఆర్టీపీసీఆర్ పరీక్షలో కోవిడ్ పాజిటివ్ అని తేలింది. హైదరాబాద్ సీసీఎమ్బీకి శాంపిల్స్ పంపారు అధికారులు. జీనోమ్ సీక్వెన్స్ లో ఒమిక్రాన్ గా నిర్ధారణ అయిందని తెలుస్తోంది. అయితే ఎటువంటి కోవిడ్ లక్షణాలు లేవని స్పష్టం చేసింది రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ. దీంతో అలెర్ట్ అయింది […]
రంగారెడ్డి జిల్లాలో హైవే నెంబర్ 163 విస్తరణకు రంగం సిద్ధమయింది. అయితే ఈ రహదారిలో ఎక్కువగా మర్రి చెట్లు వున్నాయి. వీటికి వందల ఏళ్ళ చరిత్ర వుందని పరిశోధకులు, పర్యావరణ నిపుణులు చెబుతున్నారు. హైవే విస్తరణ కారణంగా వాటిని తిరిగి వేరేచోట పాతాలని పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు. పర్యావరణ సమతుల్యాన్ని కాపాడడానికి ఈ మర్రి చెట్లు ఎంతగానో దోహదం చేస్తున్నాయి. ఈ రహదారిపై ఇరువైపులా 900 మర్రిచెట్లు వున్నాయి. వాటిని భద్రంగా తీసి వేరేచోట భద్రపరచాలని పర్యావరణ […]