NTV WebDesk
Author- NTV Telugu-
బండి సంజయ్ అంటే ప్రభుత్వానికి భయం: తరుణ్‌చుగ్
దీక్షకు దిగిన సంజయ్ కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేయడం.. ఆ తర్వాత జేపీ నడ్డా రావడం .. బండి విడుదల అన్ని చకచక జరిగిపోయాయి. ఇప్పుడు తెలంగాణలో రాజకీయం బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్గా మారింది. గత కొన్ని రోజులుగా ఇదే విషయంపై రెండు పార్టీలు ఒకరిపై ఒకరూ ఆరోపణలు, ప్రత్యాఆరోపణలు చేసుకుంటూ తెలంగాణ రాజకీయాన్ని రణరంగంగా మార్చేశారు. ఈ సందర్భంగా బండి సంజయ్ స్వాగత సభ అనంతరం బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ తరుణ్ చుగ్ […] -
కేసీఆర్ నిన్ను వదిలిపెట్టం.. శాశ్వతంగా జైలుకే..!
తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. దీక్షకు దిగిన సంజయ్ కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేయడం.. ఆ తర్వాత జైలుకు వెళ్లిన ఆయన.. జైలు నుంచి విడుదలైన తర్వాత తొలిసారి ఇవాళ తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చారు.. ఈ సందర్భంగా స్వాగత సభ ఏర్పాటు చేసింది రాష్ట్ర నాయకత్వం.. ఈ సభలో సంజయ్ మాట్లాడుతూ.. మరోసారి ప్రభుత్వాన్ని, సీఎం కేసీఆర్‌ను టార్గెట్ […] -
బ్రేకింగ్: ఉద్యోగ సంఘాలకు మళ్లీ పిలుపు.. ఇవాళే పీఆర్సీ ప్రకటన..!
పీఆర్సీపై ఇవాళే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది.. గురువారం ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపిన సీఎం వైఎస్ జగన్… ఉద్యోగులకు ఎంత మంచి చేయగలిగితే అంత మంచి చేస్తానని భరోసా ఇచ్చిన విషయం తెలిసిందే.. ఉద్యోగ సంఘాలు చెప్పిన అంశాలను నోట్ చేసుకున్నానని.. అన్నింటినీ స్ట్రీమ్ లైన్ చేయడానికి అడుగులు ముందుకేస్తామని, మెరుగ్గా చేయగలిగే దిశగా ప్రయత్నం చేస్తామని తెలిపారు.. ఇదే సమయంలో ప్రాక్టికల్‌గా ఆలోచించాలని ఉద్యోగ సంఘాలను కోరారు ఏపీ సీఎం… […] -
వారికీ లేని కోవిడ్ మాకే ఉందా..? బీజేపీకి రూల్స్ వర్తించవా..?
హైదరాబాద్‌లో వరుసగా కీలక సమావేశాలు జరుగుతున్నాయి.. అన్నోజిగూడలో ఆర్ఎస్ఎస్ సమావేశాలు ఇవాళ్టితో ముగిసిపోయాయి.. అయితే, ఇదే సమయంలో కాంగ్రెస్ మీటింగ్‌కు అనుమతి ఇవ్వకపోవడంపై ఆ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. సోషల్ మీడియా వేదికగా ఈ వ్యవహారంపై స్పందించిన ఏఐసీసీ ఇంచార్జ్ మనిక్కమ్ ఠాగూర్.. కాంగ్రెస్ పార్టీ 120 మందితో 9 నుంచి 11 వరకు హైదరాబాద్ శిక్షణ శిబిరాలు పెట్టుకుంటామంటే అనుమతి ఇవ్వని తెలంగాణ ప్రభుత్వం.. 300 మందితో సంఘ్ శిక్షణకు భద్రత, అనుమతి […] -
ప్రధాని పర్యటనలో భద్రతా వైఫల్యం.. సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు
ప్రధాని నరేంద్ర మోడీ పంజాబ్ పర్యటనలో భద్రతా వైఫల్యం పెద్ద రచ్చగా మారింది.. తన పర్యటనలో దాదాపు 20 నిమిషాలపు పాటు చిక్కుకుపోయిన ప్రధాని మోడీ.. ఆకస్మాత్తుగా తన పర్యటన రద్దు చేసుకుని తిరిగి ఢిల్లీ చేరుకున్నారు.. అయితే, దీనిపై తీవ్రస్థాయిలో రాజకీయ విమర్శల పర్వం కొనసాగుతుండగా.. ఇవాళ సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది.. మోడీ పర్యటనలో భద్రతా పరమైన అంశాలపై అటు కేంద్రంలోనూ, ఇటూ రాష్ట్రంలోనూ ఓ కమిటీ విచారిస్తున్న విషయం తెలిసిందే కాగా.. వచ్చే సోమవారం […] -
కోవిడ్ రూల్స్ ను బ్రేక్ చేసిన సోదరుడిపై మమతా బెనర్జీ ఆగ్రహం…
దేశమంతటా కరోనా కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. కేసులు భారీగా పెరుగుతుండటంతో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కరోనా రూల్స్‌ను పాటించాల్సిందేనని కేంద్రం స్పష్టం చేసింది. ఒక ఇంట్లో వ్యక్తికి కరోనా సోకితే, ఆ వ్యక్తి వారం పాటు హోమ్ క్వారంటైన్లో ఉండాలి. ఆ వ్యక్తితో పాటు ఇంట్లో ఉండేవారు కూడా బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. సామాన్యులు కావొచ్చు, మంత్రులు, ముఖ్యమంత్రులు ఎవరైనా కావొచ్చు. ప్రతి ఒక్కరూ ఫాలో కావాల్సందే. అయితే, స్వయానా ముఖ్యమంత్రి సోదరుడు ఆ […] -
వాండరర్స్ టెస్ట్: భారత్‌పై సౌతాఫ్రికా ఘనవిజయం…
సఫారీ గడ్డపై సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడు టెస్టుల సిరీస్ ను గెలిచి చరిత్ర సృష్టించాలనుకున్న భారత్‌కు రెండో టెస్టులో ఎదురుదెబ్బ తగిలింది. మొదటి టెస్టులో విజయం సాధించిన భారత్ రెండో టెస్టులో అదే దూకుడును ప్రదర్శించాలని చూసింది. రెండో టెస్టులో మొదటి ఇన్నింగ్స్‌లో 202 పరుగులకే ఆలౌట్ అయింది. అయితే సౌతాఫ్రికా జట్టు కూడా మొదటి ఇన్నింగ్స్‌లో కేవలం 229 పరుగులు మాత్రమే చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో ఇండియా 266 పరుగులకే అలౌట్ అయింది. 243 పరుగుల […] -
తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్… అదనపు బస్సులకు ప్రత్యేక ఛార్జీలు లేవు
తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. సంక్రాంతికి 4,318 ప్రత్యేక బస్సులను నడుపుతున్నారు. అయితే సంక్రాంతికి టీఎస్ ఆర్టీసీ నడుపుతున్న ప్రత్యేక బస్సులకు ఎలాంటి అదనపు ఛార్జీలు ఉండవని ఆర్టీసీ చైర్మెన్ బాజిరెడ్డి గోవర్థన్, ఎండీ సజ్జనార్ ప్రకటించారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలోప్రత్యేక బస్సులు ఈ నెల 7 నుంచి 14 వరకు నడపనున్నట్టు వెల్లడించారు. 4,318 ప్రత్యేక బస్సులు హైదరాబాద్ నుంచి ఇతర జిల్లాలకు నడుస్తాయని తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్‌కు కూడా భారీ సంఖ్యలో టీఎస్ […] -
అమరావతికి ‘నాబార్డ్’ రీజనల్ కార్యాలయం తరలించాలి: పాతూరి
హైదరాబాద్‌లో ఉన్న నాబార్డ్ రీజనల్ కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి తరలించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు గారు రాసిన లేఖను… బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పాతూరి నాగభూషణం నాబార్డ్ చైర్మన్ చింతల గోవిందరాజులుకు అందజేశారు. ముంబైలో గోవిందరాజులును కలిసి పాతూరి ఈ లేఖను స్వయంగా ఇచ్చారు. ఈ సందర్బంగా వీలైనంత త్వరగా ఈ ప్రక్రియ పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని పాతూరి కోరారు. అమరావతిలో ఇప్పటికే కేంద్రప్రభుత్వం నాబార్డుకోసం స్థలాన్ని కొనుగోలు చేసిందని పేర్కొన్నారు. -
కేంద్రీయ విశ్వవిద్యాలయం భూములపై హైకోర్టు కీలక తీర్పు
హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం భూములపై హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. భూములపై హెచ్‌సీయూకీ చట్టబద్ధత హక్కులపై ఆధారాలు లేవని హైకోర్టు తీర్పును వెలువరించింది. భూములపై హక్కలు కోసం సివిల్ కోర్టును ఆశ్రయించవచ్చని హెచ్‌సీయూకి హైకోర్టు సూచించింది. జీహెచ్ఎంసీ రోడ్డు నిర్మించడాన్ని సవాల్ చేస్తూ హెచ్‌సీయూలో దాఖలైన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. Read Also:అభివృద్ధిలో విద్య కీలక భూమిక పోషిస్తుంది: ఏపీ గవర్నర్ కాగా హెచ్ సీయూకి 1975లో 2,324 ఎకరాల భూమిని నాటి ప్రభుత్వం కేటాయించింది. అయితే […]
తాజావార్తలు
-
YS Jagan: అవినీతి ఏ స్థాయికి వెళ్లిందో చెప్పడానికి డీఎస్సీనే ఉదాహరణ!
-
SIR Row: ఈసీలో అంతర్గత విభేదాలు.. ‘‘దేశ ద్రోహం’’ అంటూ రాహుల్ విమర్శలు..
-
Banks Open on Sunday: బ్యాంక్ సమ్మెకు ముందు కీలక నిర్ణయం.. ఆదివారం కూడా బ్యాంకులు ఓపెన్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
Meghalaya BJP Expansion: మేఘాలయ అసెంబ్లీలో మారిన రాజకీయ లెక్కలు.. బీజేపీలోకి 8 మంది UDP ఎమ్మెల్యేలు
ట్రెండింగ్
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!