NTV WebDesk
Author- NTV Telugu-
Organ Donation: అవయవదానంతో పునర్జన్మ
సృష్టిలో తల్లి జన్మనిస్తుంది. కానీ అవయవదానం చేసేవారు పునర్జన్మను ఇచ్చినట్టే. ఈమధ్యకాలంలో అవయవ దానం పట్ల అవగాహన పెరుగుతోంది. అవయవదానంతో మరొకరికి పునర్జన్మ నిచ్చిన దాతలు దేవుడితో సమానం అన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. రవీంద్ర భారతిలో జీవన్ దాన్ ఆధ్వర్యంలో ఆర్గాన్స్ డోనర్స్ కుటుంబ సభ్యులకు సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి తలసాని. అవయవదానం చేసి అనేకమంది ప్రాణాలు కాపాడిన అవయవదాతలను స్మరించుకోవాలన్నారు. అవయవదానంతో 3800 మంది పునర్జన్మ పొందారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన […] -
Egg Rates: పడిపోతున్న కోడిగుడ్ల ధర… నష్టాల్లో యజమానులు
ఒకవైపు కోళ్ల దాణా ధరలు ఆకాశాన్నంటుతుండగా మరో వైపు కోడిగుడ్ల ధర మాత్రం రోజురోజుకు పడిపోతున్నాయి.ఇంకోవైపు ఎండలు వేడిమి తట్టుకోలేక కోళ్లు మృతి చెందుతుండడంతో కోళ్ల ఫారాల యజమానులు నష్టాల ఊబిలో పడుతున్నారు.. పది సంవత్సరాలలో ఎన్నడూ లేనంతగా కోళ్ల పరిశ్రమ నష్టాల బాటలో నడుస్తుండడంతో పౌల్ట్రీ రైతులు తమకు ఆత్మహత్యలే శరణ్యం అంటున్నారు.. ఒక్కసారిగా పెరిగిన దాణా రేట్లతో సతమతమవుతున్న కోళ్ల రైతుకు గోరుచుట్టుపై రోకలిపోటులా గిట్టు బాటుకాని విధంగా గుడ్డు ధర ఉండడంతో పరిశ్రమ […] -
Brutal Murder: నరసరావుపేటలో దారుణహత్య
పల్నాడు జిల్లాలో నరసరావుపేటలో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యారు. హత్యకు గురైంది కల్యాణ్ జ్యువెలరీ దుకాణంలో పనిచేసే రామాంజనేయులుగా గుర్తించారు. భర్త అపహరణపై నిన్న పోలీసులకు రామాంజనేయులు భార్య ఫిర్యాదు చేశారు. జంగం బాజితో పాటు అన్నవరపు కిషోర్ మరికొందరు షాపులోకి వచ్చి అపహరించారని ఫిర్యాదు చేశారు. రామాంజనేయులు భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు. గతంలో చంటి అనే వ్యక్తి అదృశ్యం వెనుక రామాంజనేయులు ప్రమేయం ఉందని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే […] -
Edible Oil Prices: మళ్ళీ వంటనూనెల మంట తప్పదా?
గత కొంతకాలంగా వంటగదికి వెళ్లాలంటేనే సామాన్యులకు వణుకు పుడుతోంది. వంటనూనెలు మంట పుట్టిస్తున్నాయి. గతంలో కంటే సగం పైగా ధర పెరిగాయి. ఉక్రెయిన్ పై రష్యా యుద్ధంతో సన్ ఫ్లవర్ నూనె ధరలు పెరిగిపోవడం వల్ల ఇప్పటికే వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇది చాలదన్నట్టుగా ఇండోనేషియా కీలక నిర్ణయం తీసుకుంది. వంట నూనెల ఎగుమతులపై ఇండోనేషియా తాజాగా నిషేధం విధించింది. దీంతో ధరలు మళ్ళీ ఆకాశాన్నంటడం ఖాయంగా కనిపిస్తోంది. కేంద్రం జోక్యం చేసుకోకపోతే ధరల పెరుగుదల […] -
Delhi Flu: పెరుగుతున్న ఫ్లూ బాధితులు
ఢిల్లీలో కరోనా కేసులు పెరుగుతుండటంతో, ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు ప్రారంభించింది. పబ్లిక్ ప్లేసెస్ లో మాస్కును తప్పనిసరి చేసింది. మాస్కులేకపోతే ఐదొందల రూపాయల జరిమానా తప్పదని హెచ్చరించింది. కార్లలో ప్రయాణించే వారికి మాస్కు నుంచి మినహాయింపు ఇచ్చింది ఢిల్లీ ప్రభుత్వం. అలాగే స్కూళ్లలో విద్యార్థులు, టీచర్లు, సిబ్బంది ప్రతి ఒక్కర్నీ థర్మల్ స్కానింగ్ చేసిన తర్వాతే, అనుమతించాలని తెలిపింది. పాజిటివ్ అని తేలిన పిల్లలను పాఠశాలకు పంపొద్దని తల్లిదండ్రులను కోరింది. ఢిల్లీలో ఒక్కరోజే రికార్డుస్థాయిలో 967 […] -
Rains: మండువేసవిలో చినుకులతో పులకరింత
ఒకవైపు మండే ఎండ, మరోవైపు హఠాత్తుగా చిరుజల్లులతో వాతావరణం చల్లబడుతోంది. ఎండలో తిరిగి అలసిన వారికి చిరుజల్లులు ఉపశమనం కలిగిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో మరో రెండ్రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి ఏర్పడిందని, రాయలసీమ నుంచి తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోందని, దీని ప్రభావంతో తెలంగాణలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఏపీలో మాత్రం ఎండలు మండుతాయని జాగ్రత్తగా వుండాలని ఐఎండీ సూచించింది. 26వ తేదీ వరకు […] -
Siricilla Police Nestham: ప్రజలతో మమేకం.. వినూత్న ప్రయోగం
ఫ్రెండ్లీ పోలీసింగ్‌కి అసలైన అర్థం చెబుతున్నారు సిరిసిల్ల పోలీసులు. ప్రజా చైతన్యానికి పోలీస్ నేస్తం అనే కార్యక్రమంతో ప్రజల ముంగిటనే అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. చట్టపరమైన, ఇతర సమస్యలకు కూడా పరిష్కారం చూపేలా రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు శ్రీకారం చుట్టారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వెంకటాపూర్ గ్రామంలో జిల్లా పోలీసులు వినూత్న ప్రయోగం చేపట్టారు. జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే పర్యవేక్షణలో శాంతిభద్రతల పరిరక్షణలో సరైన ముద్ర వేసుకుని ముందుకు సాగుతున్న జిల్లా పోలీసులు వినూత్నంగా […] -
Cement Rates Effect: మండుతున్న సిమెంట్.. నిర్మాణరంగానికి గడ్డురోజులే
నిర్మాణారంగానికి ప్రధానంగా అవసరమయిన సిమెంట్ మంట పెడుతోంది. ధరలు భగ్గమంటున్నాయి. ఈ నెలలోనే మరో 50 రూపాయల వరకు ధర పెరుగుతుందని క్రిసిల్ అంచనా వేస్తోంది. ఇప్పటికే భారీగా ఉన్న సిమెంట్ ధరలతో ఇంటి నిర్మాణం తడిసి మోపెడవుతోంది. సిమెంట్ ధరలు మరోసారి భారీగా పెరగనున్నాయి. ఈ నెలలోనే బస్తాపై 25 నుంచి 50 రూపాయల వరకు పెరగొచ్చని క్రిసిల్ అంచనా వేస్తోంది. సిమెంట్ తయారీలో ఉపయోగించే బొగ్గు, పెట్రోలియం కోక్ గత 6 నెలల్లో 30 […] -
Khammam Police: అక్కడ మరక పడితేనే మంచి పోస్టింగ్
సర్ఫ్ ఎక్సెల్.. యాడ్ లో మరక మంచిదేనంటారు. అక్కడ పోలీస్ శాఖలో పోస్టింగ్ లు రావాలంటే మరక ఉండాల్సిందేనంట. మరక ఉంటే మాత్రం వారికి మంచి పోస్టింగ్ పక్కానట. లేకపోతే ప్రమోషన్లుండవు… డిమోషన్లేనట. అందుకే ఆ నేతలు చెప్పినట్లుగా ఎవ్వరి మీద పడితే వారి మీద, అవసరం ఉన్నా లేకపోయిన కేసులు పెడుతున్నారట. కొందరు పోలీసుల్లో ఎందుకీ విపరీత ధోరణి? మరక కోసం ఆ జిల్లా రక్షకభటుల ఆరాటం విమర్శలపాలవుతోంది. ఖమ్మం జిల్లాలో ప్రజా ప్రతినిధులు కొందరు, […] -
Luxury Cars Thief: లగ్జరీకారు కనిపిస్తే ఖేల్ ఖతం
అదేదో సినిమాలో కార్ల దొంగలు సూటు బూటు వేసుకుని మరీ రంగంలోకి దిగుతారు. ఖరీదైన కార్లను మాయం చేస్తారు. అదే సీన్ నిజంగా జరుగుతోంది. లగ్జరీ కార్ల దొంగ సత్యేంద్రసింగ్ షెకావత్ ఎట్టకేలకు పట్టుబడ్డాడు. రాజస్థాన్ జైపూర్ కు చెందిన ఆర్మీ జవాన్ కుమారుడు సత్యేంద్ర సింగ్ షెకావత్. 2003 నుంచి కార్ల దొంగగా మారాడు సత్యేంద్ర. ఇప్పటివరకు నిందితుడిపై పది రాష్ట్రాల్లో 61 చోరీ కేసులు వుండడం విశేషం. అధునాతన సాంకేతికతతో కార్ల దొంగతనాలు చేస్తుంటాడు. […]
తాజావార్తలు
-
Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!
-
Iran-US: ఇస్లామాబాద్‌లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
-
Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
-
DMK: కాంగ్రెస్‌ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
-
Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!