Attica Gold: అట్టికా గోల్డ్‌పై ED సోదాలు.. 16 ప్రాంతాల్లో తనిఖీలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అట్టికా గోల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ అక్రమాల వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు ఉక్కుపాదం మోపారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం నిబంధనల ప్రకారం తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాల్లోనూ ఏకకాలంలో విస్తృత తనిఖీలు చేపట్టారు.
హైదరాబాద్‌తో పాటు విశాఖపట్నం, బెంగళూరు, చెన్నై నగరాల్లోని మొత్తం 16 ప్రాంతాల్లో ఈడీ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. అట్టికా గోల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రధాన కార్యాలయాలు, శాఖలతో పాటు కంపెనీ డైరెక్టర్లు, షేర్హోల్డర్లు, పూర్వపు డైరెక్టర్లు అలాగే పలు అనుబంధ సంస్థలకు చెందిన కార్యాలయాలు, నివాసాలలో ఈ తనిఖీలు సాగాయి.
Also Read
- AP Municipal Elections: విజయవాడ టీడీపీలో టికెట్ చిచ్చు.. బుద్ధా వెంకన్న ఇంటి వద్ద ఉద్రిక్తత
- Trump: గత ఒప్పందాల కంటే భిన్నంగా ఉంటుంది.. భారత్-అమెరికా వాణిజ్యంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- Madakasira: మడకశిర జనసేన అభ్యర్థి ఎంపికలో అనూహ్య పరిణామం... నామినేషన్ తిరస్కరణతో మారిన సీన్..
- Bhagwant Mann: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో సీఎం భగవంత్ మాన్కు అవమానం.. ఆప్ ఆగ్రహం
దొంగిలించిన బంగారమే లక్ష్యంగా కొనుగోళ్లు…
పోలీసు స్టేషన్లలో నమోదైన పలు ఎఫ్ఐఆర్లు, ఛార్జ్షీట్ల ఆధారంగా ఈడీ ఈ దర్యాప్తును ముమ్మరం చేసింది. నేరపూరిత మార్గాల ద్వారా సేకరించిన సొత్తుపై ప్రధానంగా దృష్టి సారించింది. దొంగతనం చేసిన బంగారాన్ని అట్టికా గోల్డ్ సంస్థ నిబంధనలకు విరుద్ధంగా కొనుగోలు చేస్తోందని, ఇలా అక్రమ పద్ధతిలో సేకరించిన బంగారం ద్వారా భారీగా నేర ఆదాయం సమకూరిందని అధికారులు గుర్తించారు. ఈ లావాదేవీల వెనుక ఉన్న అసలు సూత్రధారులు, హవాలా మార్గాలు , ఆర్థిక అక్రమాలపై ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు.
విదేశీ కరెన్సీ, బంగారం, వెండి సీజ్..
ఈ రెండు రోజుల పాటు సుదీర్ఘంగా సాగిన సోదాలలో ఈడీ అధికారులకు కీలక ఆధారాలు లభించాయి. తనిఖీలలో భాగంగా రూ. 7.52 లక్షల నగదుతో పాటు భారీ మొత్తంలో విదేశీ కరెన్సీ, బంగారు ఆభరణాలు, వెండి వస్తువులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ సోదాల సమయంలో కంపెనీకి సంబంధించిన కీలక వ్యక్తులు అందుబాటులో లేకపోవడం గమనార్హం. పి.ఎస్. ఆయుబ్ అలియాస్ బొమ్మనహళ్లి బాబు, ఒబేదుల్లా ఎ., మొహమ్మద్ సల్మాన్ ఎ., అర్బిన్ తాజ్ ఎ. తదితరుల నివాసాల్లోనూ ఈ తనిఖీలు జరిగాయి. అయితే, ఈడీ విచారణకు సహకరించకుండా కొందరు కీలక వ్యక్తులు, డైరెక్టర్లు పరారైనట్లు అధికారులు వెల్లడించారు.
సోదాల సమయంలో వ్యాపార కేంద్రాల్లోని సిబ్బందిని సైతం కొందరు వ్యక్తులు అందుబాటులో ఉండవద్దని ఆదేశించినట్లు ఈడీ వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్లు, వస్తువుల ఆధారంగా దర్యాప్తును మరింత వేగవంతం చేశామని, పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు ఈడీ అధికారులు స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
AP Municipal Elections: విజయవాడ టీడీపీలో టికెట్ చిచ్చు.. బుద్ధా వెంకన్న ఇంటి వద్ద ఉద్రిక్తత
-
SBI Cyber Attack: ఎస్బీఐ ఖాతాదారుల డేటా డార్క్ వెబ్‌లో లీక్.. 3,897 మందిపై ప్రభావం!
-
Trump: గత ఒప్పందాల కంటే భిన్నంగా ఉంటుంది.. భారత్-అమెరికా వాణిజ్యంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
-
Madakasira: మడకశిర జనసేన అభ్యర్థి ఎంపికలో అనూహ్య పరిణామం… నామినేషన్ తిరస్కరణతో మారిన సీన్..
-
Bhagwant Mann: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో సీఎం భగవంత్ మాన్కు అవమానం.. ఆప్ ఆగ్రహం
ట్రెండింగ్
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!
-
Smartphone Battery Draining: స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ త్వరగా డ్రెయిన్ అవుతుందా? త్వరగా ఈ సెట్టింగ్స్ మార్చేసేయండి అంతే..!
-
Transfer WhatsApp Chats: గూగుల్ డ్రైవ్ బ్యాకప్‌లతో పనిలేకుండా.. వాట్సాప్ చాట్స్ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలంటే.? సింపుల్ ప్రాసెస్ ఇదిగో..
-
165Hz డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్తో అక్టోబర్ 27న రాబోతున్న REDMI K100..!
-
Virat Kohli: కోహ్లీకి గోల్డెన్ ఛాన్స్.. సాధిస్తే ప్రపంచంలో తొలి బ్యాటర్‌గా రికార్డు.!